బంగారం కొనుగోలుదారులకు షాక్ ఇచ్చేలా ధరలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు తరువాత భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడమే కారణంగా నిపుణులు చెబుతున్నారు. మూడు రోజులు నుంచి మళ్ళీ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పెట్టుబడిదారులతోపాటు సామాన్యులు కూడా కొనుగోళ్లపై ఆసక్తిని చూపిస్తుండడంతో మళ్ళీ పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి.
బంగారం ధరలు
బంగారం కొనుగోలుదారులకు షాక్ ఇచ్చేలా ధరలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు తరువాత భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడమే కారణంగా నిపుణులు చెబుతున్నారు. మూడు రోజులు నుంచి మళ్ళీ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పెట్టుబడిదారులతోపాటు సామాన్యులు కూడా కొనుగోళ్లపై ఆసక్తిని చూపిస్తుండడంతో మళ్ళీ పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. తాజాగా శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని అనేక నగరాలు బంగారం, వెండి ధరలు గడిచిన మూడు రోజులతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఉదయం బులియన్ మార్కెట్ లో బంగారం ధర మళ్ళీ పెరిగింది. శుక్రవారం ఉదయం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం బంగారం ధర రూ.130 పెరిగింది. దీంతో శుక్రవారం బంగారం ధర రూ.77,900 చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం ధరలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. హైదారాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.77,900లుగా ఉంది. 22 కారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,410లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, పొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో శుక్రవారం నాటి బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,560 గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,050లకు చేరుకుంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,410 లుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,900లకు చేరుకుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,410 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,900 కు చేరింది. అలాగే, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,410 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,900 వద్ద కొనసాగుతోంది. బంగారం బాటలోనే వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. వెండి ధర కిలోకు రూ.1200 పెరిగింది. దీంతో హైదరాబాదులో కిలో వెండి ధర మళ్ళీ రూ.10,1100 లకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.92,100 గా కొనసాగుతోంది. బంగారం వెండి ధరలు మళ్ళీ పుంజుకోవడానికి పెళ్లిళ్లు చేయడం కారణంగా చెబుతున్నారు. వెండి ధరలు దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ఇదేవిధంగా కొనసాగుతున్నాయి.