ఆధార్ కార్డుతో ఇక పని లేనట్టే.. అందుబాటులోకి సరికొత్త వ్యవస్థ.!

పౌరుల డేటా భద్రత లక్ష్యంగా కొత్త ఆధార్ యాప్ ను రెడీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల ఫేస్ ఐడి, క్యూఆర్ స్కానింగ్ ద్వారా తమ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. సులభంగా చెప్పాలంటే డిజిటల్ ధ్రువీకరణకు వీలు కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఫిజికల్ గా ఆధార్ కార్డును తమ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఆధార పోతుందన్న భయం కూడా అవసరం లేదు. వినియోగదారులు ఆధార్ కార్డుల ఒరిజినల్సు, జరాక్స్ కాపీలు తమ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ గా ధ్రువీకరించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ తాజాగా వెల్లడించారు. ఫేస్ ఐడి నిర్ధారణ, వినియోగదారుల డేటాను సురక్షితంగా పంచుకునే సామర్థ్యం ఈ యాప్ సొంతం. ప్రస్తుతం డేటా పరీక్ష దశలో ఇది ఉందని చెబుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

symbolic image

ఆధార్ కార్డు ప్రస్తుతం అనేక అవసరాలకు దీనిని వినియోగించాల్సిన పరిస్థితి ఉంది.  సిమ్ కార్డు కొనుగోలు చేయాలన్న.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. దీంతో ఏదైనా పని నిమిత్తం వెళ్లాలంటే ఆధార్ కార్డును పట్టుకొని గాని జెరాక్స్ తీసుకుని కానీ వెళ్లాల్సి వస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆధార్ కు అంతే ప్రాధాన్యతను ఇస్తున్నాయి.  ఆయా ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ వస్తున్నాయి. దీంతో ఆధార్ కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడుతోంది. అయితే ఆధార్ కార్డును ప్రతిపనికి తీసుకొని వెళ్లడం కొంత ఇబ్బందికి గురి చేయాల్సివస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆధార్ కార్డుకు సంబంధించి తీసుకువచ్చిన కీలక మార్పు వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తోంది. ముఖ్యంగా పౌరుల డేటా భద్రత లక్ష్యంగా కొత్త ఆధార్ యాప్ ను రెడీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల ఫేస్ ఐడి, క్యూఆర్ స్కానింగ్ ద్వారా తమ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. సులభంగా చెప్పాలంటే డిజిటల్ ధ్రువీకరణకు వీలు కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఫిజికల్ గా ఆధార్ కార్డును తమ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఆధార పోతుందన్న భయం కూడా అవసరం లేదు. వినియోగదారులు ఆధార్ కార్డుల ఒరిజినల్సు, జరాక్స్ కాపీలు తమ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ గా ధ్రువీకరించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ తాజాగా వెల్లడించారు. ఫేస్ ఐడి నిర్ధారణ, వినియోగదారుల డేటాను సురక్షితంగా పంచుకునే సామర్థ్యం ఈ యాప్ సొంతం. ప్రస్తుతం డేటా పరీక్ష దశలో ఇది ఉందని చెబుతున్నారు.

అంతా ఓకే అయితే కొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే ఆధార్ ధ్రువీకరణ, దుర్వినియోగం నుంచి రక్షణ కల్పించేందుకు ఉపకరిస్తుంది. యాప్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. పౌరులు అనుమతి లేకుండా డేటాను తీసుకోవడం ఇకపై కుదరదు. వినియోగదారులు అనుమతితో డేటాను పంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల వ్యక్తిగత సమాచారం పై నియంత్రణ కలుగుతుంది. చెల్లింపుల సమయంలో క్యూఆర్ కోడ్ ఉపయోగించినట్టుగా ఆధార్ ధ్రువీకరణ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయడం మరింత సులభతరం అవుతుంది. అలాగే ఆధార్ కార్డు, జిరాక్స్ కాపీలను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం అస్సలు ఉండదు. మొబైల్ యాప్ ద్వారా ఫేస్ ఐడి ద్వారా చేయవచ్చు. హోటల్స్ లో స్టే చేసినప్పుడు, ప్రయాణ చెక్ పాయింట్ లో జిరాక్స్ అందించాల్సిన అవసరం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే 100% డిజిటల్. సురక్షితమైన గుర్తింపును ఇది ధ్రువీకరిస్తుంది. ఆధార్ డేటా దుర్వినియోగం కాకుండా చూస్తుంది కూడా. ఆధార్ ఫోర్జరీ లేదా సవరణలను నిరోధించనుంది. వెరిఫికేషన్ ప్రక్రియతో వినియోగదారులకు సులభమైన సేవలను కూడా అందిస్తుంది. నార్మల్ పద్ధతితో పోలిస్తే వినియోగదారుడికి సమర్థవంతమైన ప్రైవసీ లభిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే ఎంతో మేలు కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్