దోమలపై యుద్ధానికి సరికొత్త ఆవిష్కరణ.. ఐరన్ డోమ్ రూపొందించిన చైనా

వినూత్నమైన ఆవిష్కరణలతో నిరంతరం వార్తల్లో ఉండే చైనా మరో విభిన్నమైన ఆవిష్కరణ చేసింది. కుబేరుడు నుంచి సాధారణ ప్రజల వరకు అందరిని ఇబ్బందులకు గురి చేసే దోమలపై యుద్ధానికి వినూత్నమైన పరికరాన్ని చైనాకు చెందిన ఒక వ్యక్తి డిజైన్ చేశారు. ఈ పరికరాన్ని ఆనంద్ మహేంద్ర ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. దోమల బాధను భరించలేక రకరకాల పరిష్కార మార్గాలను వెతుకుతుంటారు.

Iron Dome

 ఐరన్ డోమ్

వినూత్నమైన ఆవిష్కరణలతో నిరంతరం వార్తల్లో ఉండే చైనా మరో విభిన్నమైన ఆవిష్కరణ చేసింది. కుబేరుడు నుంచి సాధారణ ప్రజల వరకు అందరిని ఇబ్బందులకు గురి చేసే దోమలపై యుద్ధానికి వినూత్నమైన పరికరాన్ని చైనాకు చెందిన ఒక వ్యక్తి డిజైన్ చేశారు. ఈ పరికరాన్ని ఆనంద్ మహేంద్ర ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. దోమల బాధను భరించలేక రకరకాల పరిష్కార మార్గాలను వెతుకుతుంటారు. మార్కెట్లో మస్కిటో కాయిల్స్, దోమల బ్యాట్లు, ఆల్ అవుట్లు, జెట్ల వరకు ఎన్నో ఉపకరణాలు వచ్చేసాయి. అయినప్పటికీ దోమల బాధ మాత్రం ప్రజలకు తప్పడం లేదు. దోమల మీద ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల పరిశ్రమ నడుస్తోంది. అయినా ఈ సమస్య నిర్మూలన కావడం లేదు.

ఎప్పటికప్పుడు డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దోమలకు చెక్ పెట్టేందుకు చైనాకు చెందిన ఒక వ్యక్తి వినూత్న ఆవిష్కరణ చేశాడు. దోమలను చంపే బుజ్జి యంత్రాన్ని తయారు చేశాడని పేర్కొంటూ ఆ మిషన్ వీడియోను ఆనంద్ మహేంద్ర ట్విట్టర్లో షేర్ చేశారు. 'ముంబైలో డెంగీ పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఈ సూక్ష్మ ఆయుధాన్ని ఎలా సంపాదించాలా..? అని ఆలోచిస్తున్న. ఇది దోమల్ని వెతికి మరీ చంపుతుంది. మీ ఇంటికి ఐరన్ డోమ్ ఉక్కు తెరలాగా రక్షణ కల్పిస్తుంది' అని ఆ పరికరం గురించి మహేంద్ర కామెంట్ పెట్టారు. ఈ మిషన్ చంపిన దోమలను ప్రదర్శిస్తున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. యుద్ధ ట్యాంకును పోలి ఉండే ఈ బుజ్జి యంత్రంలో ఒక రాడార్ ఉంటుంది. దోమలు ఎక్కడున్నాయో గుర్తించి రాడార్ ఆ సమాచారాన్ని యంత్రానికి అందిస్తుంది. దానిలో నుంచి లేజర్ కిరణాలు వెలువడి దోమల్ని చంపుతాయి. శత్రుదేశాల రాకెట్, క్షిపణి దాడులను తిప్పికొట్టే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ అంతర్జాతీయంగా పేరొందిన విషయం తెలిసిందే. అదే తరహాలో దోమల అంతానికి ఈ డోమ్ ను రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఎప్పటిలోగా మార్కెట్లోకి వస్తుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్