బైక్ డ్రైవింగ్ వస్తే చాలు 65 వేల జీతంతో ఉద్యోగం.. ఈ అవకాశం అస్సలు మిస్ కావద్దు

బైక్ డ్రైవింగ్ వచ్చా అయితే మీరు రూ.65 వేల వేతనంతో ఉద్యోగాన్ని పొందేందుకు అర్హులుగా ఉన్నట్టే. మీరు చదివింది అక్షరాలా నిజం. ఈ అధరే ఆఫర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ఎందుకు ఆలస్యం చదివేయండి. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) తెలంగాణ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్ అయిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ ద్వారా తెలంగాణ నుంచి అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.

Bikers

బైకర్స్

బైక్ డ్రైవింగ్ వచ్చా అయితే మీరు రూ.65 వేల వేతనంతో ఉద్యోగాన్ని పొందేందుకు అర్హులుగా ఉన్నట్టే. మీరు చదివింది అక్షరాలా నిజం. ఈ అధరే ఆఫర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ఎందుకు ఆలస్యం చదివేయండి. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) తెలంగాణ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్ అయిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ ద్వారా తెలంగాణ నుంచి అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. నైపుణ్యం కలిగిన, సెమీ స్కిల్డ్ కార్మికుల విదేశీ ప్లేస్మెంట్ శిక్షణకు అధికారులు తాజాగా ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటన ప్రకారం టామ్ కామ్ గల్ఫ్ దేశాలతోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, పోలాండ్, రొమేనియా, సౌదీ, యూఏఈ వంటి దేశాలతో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. తాజాగా ఆయా దేశాల్లో బైక్ రైడర్స్, డెలివరీ బాయ్స్ జాబ్స్ కు మంచి డిమాండ్ ఉన్న విషయాన్నీ గుర్తించిన ఈ సంస్థ ఎక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు సిద్ధమవుతోంది.

బైక్ రైడర్స్, డెలివరీ బాయ్స్ ఉద్యోగాలను ఆయా దేశాల్లో చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని ఈ సంస్థ కల్పించింది. అయితే వీరికి తప్పనిసరిగా ఇంటర్నేషనల్ టు వీలర్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. అదే సమయంలో 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు మధ్య మాత్రమే వయసు ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. సురక్షితమైన చట్టబద్ధమైన వలస మార్గాల ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియను టామ్ కామ్ కంపెనీ నిర్వహిస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ అప్డేట్ చేసిన రెజ్యూమ్ ను tomcom.resume@gmail.com కి మెయిల్ పంపించాలని అధికారులు కోరారు. మరిన్ని వివరాల కోసం www.tomcom.telangana.gov.in ని సంప్రదించాలని, లేదా టామ్ కామ్ ఆఫీసుకు సంబంధించిన 9440051285, 9440048500, 9701040062 నెంబర్ కు సంప్రదించితే మరిన్ని వివరాలను తెలియజేస్తారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. బయట ఏజెన్సీ కి చెందిన వ్యక్తులు మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ ప్రైవేటు నోటిఫికేషన్లు వచ్చిన తరువాతే వాటికి అప్లై చేసుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్