కేజీఎఫ్ సినిమాలో భారీ బంగారు గని.. తవ్వుతున్న కొద్ది కేజీలకు కేజీలు బంగారం బయటపడుతుంది. ఈ బంగార గని నిర్వహించే వాళ్లు ఒక సామ్రాజ్యాన్నే నడుపుతుంటారు. అటువంటి బంగారపు గనులు ఉంటే ఏ దేశమైనా ఆర్థికంగా పరిపుష్టితో వెలుగుతుంది. అటువంటి మహర్ధశ ఇప్పుడు చైనాకు పట్టింది. కేజీఎఫ్ సినిమాలో చూపించినట్టు బంగారు గనులు వంద కలిపితే ఎంత ఉంటుందో అంతటి భారీ బంగారు గని తాజాగా చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో బయటపడింది. ఇప్పుడు ఇదే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రతీకాత్మక చిత్రం
కేజీఎఫ్ సినిమాలో భారీ బంగారు గని.. తవ్వుతున్న కొద్ది కేజీలకు కేజీలు బంగారం బయటపడుతుంది. ఈ బంగార గని నిర్వహించే వాళ్లు ఒక సామ్రాజ్యాన్నే నడుపుతుంటారు. అటువంటి బంగారపు గనులు ఉంటే ఏ దేశమైనా ఆర్థికంగా పరిపుష్టితో వెలుగుతుంది. అటువంటి మహర్ధశ ఇప్పుడు చైనాకు పట్టింది. కేజీఎఫ్ సినిమాలో చూపించినట్టు బంగారు గనులు వంద కలిపితే ఎంత ఉంటుందో అంతటి భారీ బంగారు గని తాజాగా చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో బయటపడింది. ఇప్పుడు ఇదే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అగ్రరాజ్యం దిశగా దూసుకుపోతున్న చైనాకు తాజాగా సమకూరిన బంగారు గనితో మరింత ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ బంగారు గని దాదాపు 78 బిలియన్ యూరోలు విలువైన బంగారు గనిగా పేర్కొంటున్నారు. ఈ గనిలో సుమారు వేయి టన్నులు బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే చైనా బంగారు పరిశ్రమతో ప్రపంచ మైనింగ్ రంగం ఒక మైలురాయిగా మారుతుంది. చైనాలోని వాంగులో బయటపడిన ఈ బంగారు గని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
హువాన్ ప్రావిన్స్ జియోలాజికల్ బ్యూరో వాంగు బంగారం క్షేత్రంలో 40కిపైగా గోల్ వెయిన్స్‌ను గుర్తించింది. ఇవి భూ ఉపరితలం కింద దాదాపు రెండు వేల మీటర్లు లోతులో ఉన్నాయి. ఈ లోతులో దాదాపు 300 మెట్రిక్ టన్నుల బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మూడు వేల మీటర్లకు చేరుకునే వరకు తవ్వకాలు జరపడం వల్ల అదనపు ఆశాజనకమైన నిల్వలు బయటపడ్డాయి. అందువల్ల మొత్తం వేయి మెట్రిక్ టన్నులకు మించి ఈ బంగారు నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి నిల్వ భౌగోలిక అన్వేషనలో అసాధారణమైన ఘటనగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్ని నమూనాల్లో మెట్రిక్ టన్ను ధాతువుకు 138 గ్రాములు వరకు బంగారం ఉంటుంది. ఈ స్థాయి నిల్వ సాధ్యమైతే హునాన్ ప్రావిన్స్ ప్రపంచ బంగారు మార్కెట్‌లో కీలక పాత్రదారిగా మారుతుంది.