ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో సిలిండర్ పేరడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో పిల్లలు వార్డులో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో చికిత్స పొందుతున్న పదిమంది చిన్నారులు కారిపోయి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
పూర్తిగా దగ్ధమైన పిల్లల వార్డు
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో సిలిండర్ పేరడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో పిల్లలు వార్డులో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో చికిత్స పొందుతున్న పదిమంది చిన్నారులు కారిపోయి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భారీగా మంటలు చెలరేగడంతో అదుపులోకి రాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని ఎన్ఐసి వార్డులో శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఈ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అఖిల ప్రమాదం తర్వాత మంటలు ఒక్కసారిగా ఎగసి పడడంతో మెడికల్ కాలేజీలో గందరగోళ వాతావరణం నెలకొంది. విషయాన్ని స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వెంటనే ఘటనా స్థలానికి సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కొన్ని గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్ఐసియు సిబ్బంది వార్డులోకి ప్రవేశించి పరిస్థితిని పరిశీలించింది. అప్పటికే పలువురు చిన్నారులు మంటల్లో చిక్కుకొని కాలిపోయి మృతి చెందినట్లు గుర్తించారు. మిగిలిన చిన్నారులను హుటాహుటిగా ఎన్ఐసియూ వార్డు నుంచి ఇతర వార్డుల్లోకి సిబ్బంది తరలించారు. ఈ ఘటనలో పదిమంది చిన్నారులు మృత్యువాత చెందినట్లు అధికారులు గుర్తించారు.
మరో 40 మందిని సిబ్బంది కాపాడగలిగారు. మంటలను అదుపు చేసేందుకు ఆరు అగ్నిమాపక దళ వాహనాలు వచ్చాయి. ప్రమాద సమయంలో రెండు వార్డులో 25 చిన్నారులు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. మిగిలిన వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ ఉన్నతాధికారులు చేపట్టారు. మెడికల్ కాలేజీ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణ వ్యక్తం చేశారు. ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీ ఎంఐసీయూలో జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం బాధాకరమని, హృదయ విధారకమని సోషల్ మీడియా వేదికగా ఆయన సంతాపాన్ని తెలియజేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సీఎం యోగి ఆదేశాల మేరకు ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఝాన్సీ బయలుదేరి వెళ్లారు. ప్రమాదంపై విచారణ జరిపి 12 గంటల్లో నువ్వు వేలికి సమర్పించాలని ఝాన్సీ కమిషనర్, డిఐజిని సీఎం ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు వెలుగులోకి రావడం విస్మయానికి గురిచేస్తుంది. వీడియోలో వార్డు లోపల కేకలు, కుటుంబ సభ్యులు రోధనలతో బీభత్సమైన వాతావరణం నెలకొంది.