భూమి దిశగా భారీ గ్రహశకలం దూసుకు వస్తోంది. సుమారు 130 నుంచి 300 అడుగుల విస్తీర్ణం ఉన్న భారీ గ్రహశకలం భూమి దిశగా జట్ స్పీడ్ తో దూసుకు వస్తోంది. గంటకు 46,800 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తుంది. ఇది భూమిని 2032 డిసెంబర్ 22న ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహ శకలానికి నాసా శాస్త్రవేత్తలు 2024 వైఆర్4 గా నామకరణం చేశారు. న్యూయార్క్ లోని స్వేచ్ఛ ప్రతిమ అంత పెద్దగా ఉండే ఈ గ్రహ శకలం లేకుంటే భూమ్మీద ఏకంగా ఒక నగరమే నాశనం అయిపోతుందని అంచనాలు ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
భూమి దిశగా భారీ గ్రహశకలం దూసుకు వస్తోంది. సుమారు 130 నుంచి 300 అడుగుల విస్తీర్ణం ఉన్న భారీ గ్రహశకలం భూమి దిశగా జట్ స్పీడ్ తో దూసుకు వస్తోంది. గంటకు 46,800 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తుంది. ఇది భూమిని 2032 డిసెంబర్ 22న ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహ శకలానికి నాసా శాస్త్రవేత్తలు 2024 వైఆర్4 గా నామకరణం చేశారు. న్యూయార్క్ లోని స్వేచ్ఛ ప్రతిమ అంత పెద్దగా ఉండే ఈ గ్రహ శకలం లేకుంటే భూమ్మీద ఏకంగా ఒక నగరమే నాశనం అయిపోతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని సిటీ కిల్లర్గా కూడా వ్యవహరిస్తున్నారు. దక్షిణ అమెరికాలోని ఉత్తరభాగం నుంచి ఫసిపిక్ మహాసముద్రం, సబ్ సహారన్ ఆఫ్రికా మీదుగా ఆసియా వరకు ఎక్కడైనా ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించే ముప్పు ఉందని అంచనావేస్తున్నారు. ఈ పరిధిలో ఈక్విడార్, కొలంబియా, వెనిజులా, నైజీరియా, సుడాన్, ఇథియోపియా, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఉన్నాయి.
భారత్ లో ముంబై, కలకత్తాలకు ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత వేగంతో ఈ గ్రహశకలం భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు జరిగే పేలుడు తీవ్రత, హిరోషిమాలో అనుభాంబు పేలుడు కన్నా 500 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. హిరోషిమాలో అనుబాంబు పేలుడు తీవ్రత 15 కిలో టీఎన్టీ కాగా.. ఈ గ్రహ శకలం పేలుడు తీవ్రత 15 నుంచి 30 మెగా టన్నుల టీఎన్టి దాకా ఉంటుందని వారు చెబుతున్నారు. భూమిని తాకితే ఆ తాకిడికి 3 అడుగులకు పైగా వెడల్పు పైన గొయ్యి ఏర్పడుతుందని.. ఒక పెద్ద నగరం పూర్తిగా నాశనం అయ్యే స్థాయిలో దాని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ గ్రహశకలం భూమికి దాదాపుగా 37 మిలియన్ మహిళ దూరంలో ఉంది. ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం 3.1% మేరా ఉందని మొదట నాసా శాస్త్రవేత్తలు భావించారు. దాని గమనాన్ని నిశితంగా గమనించిన తరువాత 1.5 శాతం మాత్రమే భూమిని తాగుతుందని అంచనా వేశారు.
ఇదిలా ఉంటే 1908 జూన్ 30న ఉదయం 7.15 గంటల సమయంలో రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలోని తుంగూస్కా నాది పరివాహక ప్రాంతంలో దాదాపు 177 అడుగుల విస్తీర్ణం ఉన్న భారీ గ్రహ సకలం ఒకటి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అయితే అది గాల్లోనే పేరు పోయింది. అది మంచు ఎడారి కావడం, మనుషుల జాడ అత్యంత తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఆ పేలుడు దాటికి దాదాపు 8 కోట్ల చెట్లు నిలువునా కాలిపోయాయి. 1908 లోనే ఈ ఘటన జరిగిన రష్యా ప్రభుత్వం అక్కడికి 1921 లో మాత్రమే శాస్త్రవేత్తలను పంపించింది. వారు అక్కడికి చేరుకోవడానికి ఆరేళ్ల సమయం పట్టింది. ఈ నేపథ్యంలోనే సిటీ కిల్లర్ ఎటువంటి నష్టాన్ని చేకూరుస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.