లయ తప్పుతున్న గుండె.. ఏటా పెరుగుతున్న గుండె జబ్బులు, అప్రమత్తం కావాల్సిందే.!

మనిషి శరీరంలోని అత్యంత కీలకమైన అవయవం గుండె. గుండె పనితీరు మెరుగ్గా ఉంటేనే మనిషి బతికేందుకు అవకాశం ఉంటుంది. గుండె లయ తప్పితే ప్రాణాలకు ముప్పు తప్పదు. గడచిన కొన్నాళ్లుగా గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. దీనికి అనేక అంశాలు దోహదం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా తొమ్మిది రిస్క్ ఫ్యాక్టర్స్ కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

heart disease

గుండె జబ్బు

ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులు బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గుండె జబ్బులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు రెండు కోట్ల మంది మృత్యువాత చెందుతున్నారని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజు కొన్ని లక్షల మంది కొత్తగా గుండె జబ్బులు బారిన పడుతున్నారు. నేడు వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో గుండె జబ్బులకు గల కారణాలు, ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ కథనంలో తెలుసుకుందాం. 

మనిషి శరీరంలోని అత్యంత కీలకమైన అవయవం గుండె. గుండె పనితీరు మెరుగ్గా ఉంటేనే మనిషి బతికేందుకు అవకాశం ఉంటుంది. గుండె లయ తప్పితే ప్రాణాలకు ముప్పు తప్పదు. గడచిన కొన్నాళ్లుగా గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. దీనికి అనేక అంశాలు దోహదం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా తొమ్మిది రిస్క్ ఫ్యాక్టర్స్ కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అవి స్మోకింగ్, ఆల్కహాల్, ఫ్యామిలీ హిస్టరీ, షుగర్, బిపి, జీవన విధానంలో వచ్చిన మార్పులు, మానసిక ఒత్తిడి, ఒబేసిటీ, కొలెస్ట్రాల్. ఈ లక్షణాలు గుండె జబ్బులకు కారణం అవుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వీటితోపాటు యువకుల్లో తీవ్రమైన ఒత్తిడి గుండె జబ్బులకు కారణమవుతుందని కార్డియాలజీ వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గుండె జబ్బులు బారిన పడుతున్న వారిలో 40 ఏళ్లలోపు వారు 30 నుంచి 40 శాతం ఉండగా, 40 ఏళ్ళు పైబడిన వారిలో మిగిలిన 60 నుంచి 70 శాతం మంది ఉంటున్నట్లు వైద్య నిపుణులు చేరుకున్నారు. 

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే..

హార్ట్ స్ట్రోక్ వచ్చే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. మూడు నాలుగు గంటల్లోనే ఆసుపత్రికి తరలించాలి. దీనినే గోల్డెన్ అవర్ అంటారు. చాతి మధ్య భాగంలో నొప్పి, గుండు బరువుగా అనిపించి ఎడమ చేతి వైపు లోపలికి లాగుతుండడం, బొడ్డు నుంచి కింది దవడ వరకు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమట పట్టడం, పొత్తికడుపులో నొప్పి, కాళ్లు చేతులు లాగుతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. వీరికి ఈసీజీ, 2డి ఎకో,  లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలు నిర్వహించి సమస్యను నిర్ధారిస్తారు. అవసరమైన వారికి యాంజియో ప్లాస్టి చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తారు. కొన్నిచోట్ల త్రంబోలైసిస్ చేస్తున్నారు. దీని ద్వారా కూడా క్లాట్ ను కరిగించి రోగి కోలుకునేలా చేస్తారు. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

గుండె జబ్బులు బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ అదుపులో ఉంచుకోవడం మద్యపానానికి స్మోకింగ్కు దూరంగా ఉండటం ఫ్యాట్ ఫుడ్ తీసుకోకపోవడం ప్రతిరోజు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయడం 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ఏడాదికి ఒక్కసారైనా గుండు పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండటంతో పాటు సకాలంలో గుర్తించేందుకు అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్