రెండు లక్షలకు పైగా వేతనంతో ప్రభుత్వ ఉద్యోగం.. ఇంటర్వ్యూ పూర్తయితే చాలు

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు భారీగా పోటీ ఉంటుంది. లక్షలాదిమంది నిరుద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. అటువంటి వారికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, ఫైనాన్స్ ఆఫీసర్, ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ హెచ్ఏఎల్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అవసరమైన అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ఒక ప్రకటనలో కోరింది.

Hindustan Aeronautics Limited

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 

దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. వివిధ కోర్సులు పూర్తిచేసి బయటకు వస్తున్న విద్యార్థులు సంఖ్యకు అనుగుణంగా బయట ఉద్యోగ అవకాశాలు లభించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో దేశంలో నిరుద్యోగిత ఏటా క్రమంగా పెరుగుతోంది. ఎక్కడ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన వేలాదిమంది నిరుద్యోగులు తరలివస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు భారీగా పోటీ ఉంటుంది. లక్షలాదిమంది నిరుద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. అటువంటి వారికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, ఫైనాన్స్ ఆఫీసర్, ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ హెచ్ఏఎల్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అవసరమైన అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ఒక ప్రకటనలో కోరింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా ఆ సంస్థ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీలోగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 44 ఖాళీలను భర్తీ చేయమన్నారు. దరఖాస్తు చేసే ముందు కొన్ని అంశాలను చూసుకోవాలని ఆ ప్రకటనలో కోరింది. దరఖాస్తు చేయాలంటే దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో పలు అర్హతలను పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 30 నుంచి 47 ఏళ్ల లోపు ఉండాలి. జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.500 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు లేదు. ఈ పోస్టులకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.40 వేల నుంచి రూ.2,40,000 వరకు వేతనం చెల్లించనున్నారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మరిన్ని వివరాలకు సంస్థ వెబ్ సైట్ ను సంప్రదించ్చాల్సి ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్