ఏపీలో మందుబాబులకు పండగే పండగ.. కొద్ది రోజుల్లోనే అంతర్జాతీయ బ్రాండ్లు

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాల్లో మద్యం ఒకటి. గత వైసిపి ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానం, తీసుకువచ్చిన నాణ్యత లేని మద్యం కారణంగా మందు బాబులు నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో కూటమి నాయకుడు కూడా నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామంటూ మందుబాబులకు హామీ ఇచ్చింది. ఈ హామీ పట్ల ఆకర్షితులైన మందుబాబులు కూటమి పార్టీలకు చెందిన అభ్యర్థులకు తమ ఓట్లను వేశారు. దీంతో వైసిపి ప్రభుత్వం దారుణమైన పరాభవాన్ని మూట కట్టుకుంది.

alcohol

మద్యం

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాల్లో మద్యం ఒకటి. గత వైసిపి ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానం, తీసుకువచ్చిన నాణ్యత లేని మద్యం కారణంగా మందు బాబులు నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో కూటమి నాయకుడు కూడా నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామంటూ మందుబాబులకు హామీ ఇచ్చింది. ఈ హామీ పట్ల ఆకర్షితులైన మందుబాబులు కూటమి పార్టీలకు చెందిన అభ్యర్థులకు తమ ఓట్లను వేశారు. దీంతో వైసిపి ప్రభుత్వం దారుణమైన పరాభవాన్ని మూట కట్టుకుంది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నాణ్యమైన మద్యాన్ని మందుబాబులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే వివిధ రకాల బ్రాండ్లను మందుబాబులకు నామమాత్రపు ధరలకే కూటమి ప్రభుత్వం అందిస్తోంది. దీంతో మందుబాబులు తమకు నచ్చిన బ్రాండ్లు తాగుతూ చిల్ అవుతున్నారు. తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన మందుబాబులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. అదే ఏపీలో కొద్ది రోజుల్లో అంతర్జాతీయ బ్రాండ్లను మందుబాబులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చేసిన ప్రకటన. వైసిపి హయాంలో రాష్ట్రం నుంచి తరిమేసిన జాతీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీలు, గ్రెయిన్ బేస్డ్ డిస్టలరీస్ అసోసియేషన్ ప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు.

వినియోగదారులు కోరుకునే బ్రాండ్లని అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. గ్రైన్ బేస్డ్ డిస్టలరీలు ఉత్పత్తి చేసే మద్యాన్ని విదేశాలకు ఎగుమతికి అవకాశం కల్పించాలని సంఘం ప్రతినిధులు కోరగా, మంత్రి దీనికి అంగీకరించారు. వినియోగదారులు తాగాలనుకునే బ్రాండ్లను అందుబాటులో ఉంచడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడేందుకు అవకాశం ఉంటుందన్న భావనను మంత్రి వ్యక్తం చేశారు. కొద్దిరోజుల్లోనే అంతర్జాతీయ బ్రాండ్లు మద్యం దుకాణాల్లో లభిస్తాయని, ఈ మేరకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో నూతన మద్యం పాలసీ కూడా కొద్ది రోజుల్లోనే అమల్లోకి తీసుకువస్తామని మంత్రి చెబుతున్నారు. ఇప్పటికే గత వైసిపి ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. ఈ విధానంపై పునః సమీక్షించి నూతన పాలసీని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. మరో నెల రోజుల్లో నూతన విధానం అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారని, వినియోగదారులకు మేలు చేకూర్చేలా తమ విధానం ఉంటుందని స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్