ఖరీదైన గెలాక్సీ వాచ్ అల్ట్రాను ఉచితంగా పొందే ఛాన్స్.. అదెలా అంటే.!

ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ కంపెనీ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ కంపెనీ నిరంతరం విభిన్నమైన శైలిలో ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే కస్టమర్లను ఆనందపరిచేలా రూ.51 వేల విలువైన గెలాక్సీ వాచ్ ఆల్ట్రాను ఫ్రీగా ఇచ్చేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. సాంసంగ్ లవర్స్ ఈ చాన్స్ మిస్ చేసుకోకుండా ఆ కంపెనీ పెట్టిన షరతులకు అనుగుణంగా పొందవచ్చు. కంపెనీ తన వాకర్తాన్ ఇండియా ఫిట్నెస్ ఛాలెంజ్ రెండో ఎడిషన్ ను ప్రకటించింది. ఇందులో విజేతగా నిలిచిన వారికి స్పెషల్ ప్రైస్ అందించనున్నారు. వా కథాన్ ఇండియా ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనేవారు ఇచ్చిన గడువులోగా స్టెప్ గోలు పూర్తిచేస్తే వారికి గెలాక్సీ వాచ్ అల్ట్రా ఉచితంగా లేదా కొనుగోలుపై తగ్గింపు లభిస్తుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ కంపెనీ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ కంపెనీ నిరంతరం విభిన్నమైన శైలిలో ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే కస్టమర్లను ఆనందపరిచేలా రూ.51 వేల విలువైన గెలాక్సీ వాచ్ ఆల్ట్రాను ఫ్రీగా ఇచ్చేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. సాంసంగ్ లవర్స్ ఈ చాన్స్ మిస్ చేసుకోకుండా ఆ కంపెనీ పెట్టిన షరతులకు అనుగుణంగా పొందవచ్చు. కంపెనీ తన వాకర్తాన్ ఇండియా ఫిట్నెస్ ఛాలెంజ్ రెండో ఎడిషన్ ను ప్రకటించింది. ఇందులో విజేతగా నిలిచిన వారికి స్పెషల్ ప్రైస్ అందించనున్నారు. వా కథాన్ ఇండియా ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనేవారు ఇచ్చిన గడువులోగా స్టెప్ గోలు పూర్తిచేస్తే వారికి గెలాక్సీ వాచ్ అల్ట్రా ఉచితంగా లేదా కొనుగోలుపై తగ్గింపు లభిస్తుంది. సాంసంగ్ హెల్త్ యాప్ వినియోగదారులు మాత్రమే ఈ ఆఫర్కు అర్హులుగా పేర్కొంది. సామ్సంగ్ వాకతా ఇండియాలో పాల్గొనేవారు గెలాక్సీ వాచ్ అల్ట్రాను గెలుచుకునే అవకాశం ఈ సంస్థ కల్పించింది. 

సాంసంగ్ హెల్త్ యాప్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ ఛాలెంజ్ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభమైంది. మే 20వ తేదీ వరకు కొనసాగుతుంది. అర్హత సాధించడానికి ఒక నెలలో మొత్తం 2 లక్షల అడుగులు నడవాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్ లో పాల్గొనడానికి అన్ని సాంసంగ్ హెల్త్ యాప్ వినియోగదారులు అర్హులే. #Walkthonindia అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించి సాంసంగ్ సభ్యుల యాప్ లో స్క్రీన్ షాట్ ను అప్లోడ్ చేయాలి. ఈవెంట్ ముగింపులో లక్కీ డ్రా ద్వారా ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తారు. ఈ ముగ్గురు విజేతలకు గెలాక్సీ వాచ్ అల్ట్రాను బహుమతిగా అందిస్తారు. లక్ష్యాన్ని సాధించిన ఇతరుల కోసం స్మార్ట్ వాచ్ పై 20% వరకు తగ్గింపును అందిస్తారు. సాంసంగ్ హెల్త్ యాప్ లోని టుగెదర్ ట్యాబ్ కు వెళ్లి మీరు నమోదు చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్ లో సాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా ధర రూ.51,999 గా ఉంది. ఇది టైటానియం బిల్డ్, 2.5 అంగుళాల సూపర్ AMOLED డిస్ ప్లే తో వస్తుంది. ఈ వాచ్ లో గెలాక్సీ వాచ్ సెవెన్ మాధురిగానే ప్రాసెసర్, సాఫ్ట్వేర్ ఉన్నాయి. కానీ ఇది 10 ATM నీటి నిరోధకతను కలిగి ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ వాచ్ 590 mAh బ్యాటరీని కలిగి ఉంది. కాబట్టి మీరు దీన్ని పవర్ సేవింగ్ మోడ్ లో 100 గంటల వరకు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్