విమానయానానికి ఊపు.. దేశంలో గణనయంగా పెరిగిన విమాన ప్రయాణికులు

దేశంలో విమాన ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. గడిచిన ఏడాది దేశంలో 16.13 కోట్ల మంది విమానాల్లో ప్రయాణాలు సాగించారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వివరాలను వెల్లడించారు. గడిచిన ఏడాది డిసెంబర్లో దేశీయ విమాన ప్రయాణికులు సంఖ్య 1.49 కోట్లగా అధికారులు వెల్లడించారు. 2023 డిసెంబర్ తో పోలిస్తే 8.19 శాతం మేర పెరుగుదల కనిపించింది. ఇక విమానయాన సంస్థలు విషయానికి వస్తే ఇండిగో 64.4 శాతం వాటాతో మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో విమాన ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. గడిచిన ఏడాది దేశంలో 16.13 కోట్ల మంది విమానాల్లో ప్రయాణాలు సాగించారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వివరాలను వెల్లడించారు. గడిచిన ఏడాది డిసెంబర్లో దేశీయ విమాన ప్రయాణికులు సంఖ్య 1.49 కోట్లగా అధికారులు వెల్లడించారు. 2023 డిసెంబర్ తో పోలిస్తే 8.19 శాతం మేర పెరుగుదల కనిపించింది. ఇక విమానయాన సంస్థలు విషయానికి వస్తే ఇండిగో 64.4 శాతం వాటాతో మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఆ తరువాత ఎయిర్ ఇండియా 26.4 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. వీటి తరువాత అకాశ ఎయిర్, స్పైస్ జెట్ వరుసగా 4.6 శాతం, 3.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇండిగో అత్యధికంగా 73.4 శాతం ఆల్ టైం పెర్ఫార్మెన్స్ తో అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్ ఇండియా 67.6 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. విమానాల రద్దు, జాప్యం కారణంగా డిసెంబర్లో ఓటిపి వ్యవస్థ దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.

గడిచిన ఏడాది విమానాల రద్దు రేటు 1.07 శాతంగా ఉంది. విమానాల రద్దు కారణంగా 67,622 మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. రద్దు అయిన విమానా ప్రయాణికులకు పరిహారం, సౌకర్యాల కోసం విమానయాన సంస్థలు రూ.1.26 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. విమానాలు ఆలస్యం కావడం వల్ల 2,79,985 మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. విమాన సంస్థలు ఆలస్యం వల్ల ఇబ్బందులు పడిన ప్రయాణికుల సౌకర్యాల కోసం ఆయా విమానయాన సంస్థలు రూ.3.78 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. 2,147 మంది ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించారు. దీనివల్ల విమానయాన సంస్థలు రూ.1.76 కోట్లు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో విమాన  రంగం తీవ్రంగా కుదేలైంది. ఇప్పుడిప్పుడే కోరుకుంటుండడంతో భారీగా ప్రయాణికులు సంఖ్య పెరుగుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్