హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ థ్రెటెనింగ్ మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే అలెర్ట్
ఇండిగో విమానానికి వచ్చిన బాంబు బెదిరింపు కాల్
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ థ్రెటెనింగ్ మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే అలెర్ట్ అయి ఎయిర్‌పోర్ట్ మొత్తం బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవాళ(గురువారం) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోయంబత్తూరు –చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
దీంతో హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు అధికారులు. దాదాపు ఆరు గంటలు తనిఖీలు చేసిన తర్వాత ఏమీ లేదని ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ప్రయాణ సమయంలో ఇండిగో విమానంలో 181మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది...చేసింది ఎవరూ అనేదానిపై ఆరా తీస్తున్నారు.