ఏపీలో పెరుగుతున్న జనాభా సంఖ్యకు అనుగుణంగా జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజాగా జూనియర్ కాలేజీలు అవసరం పై ఇంటర్ విద్యా మండల సర్వే చేయగా రాష్ట్రవ్యాప్తంగా 37 మండలాల్లో 47 ఇంటర్ కాలేజీలు అవసరమని గుర్తించింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని రెండు పట్టణాభివృద్ధి సంస్థల్లో మొత్తం ఆరు కాలేజీల అవసరం ఉంది. ఈ మేరకు కొత్త కాలేజీల అవసరం పై ఇంటర్ విద్యా మండలి చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో పెరుగుతున్న జనాభా సంఖ్యకు అనుగుణంగా జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజాగా జూనియర్ కాలేజీలు అవసరం పై ఇంటర్ విద్యా మండల సర్వే చేయగా రాష్ట్రవ్యాప్తంగా 37 మండలాల్లో 47 ఇంటర్ కాలేజీలు అవసరమని గుర్తించింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని రెండు పట్టణాభివృద్ధి సంస్థల్లో మొత్తం ఆరు కాలేజీల అవసరం ఉంది. ఈ మేరకు కొత్త కాలేజీల అవసరం పై ఇంటర్ విద్యా మండలి చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. కొత్తగా 53 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీకి అనుమతి ఇచ్చింది. కొద్దిరోజుల్లోనే కాలేజీలు ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలను కానుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3381 విద్యాసంస్థలు విద్యనందిస్తున్నాయి. అందులో 2000 పైగా ప్రైవేట్ కాలేజీలు, 470 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇవి కాకుండా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, హై స్కూల్ ప్లస్ లు, సాంఘిక సంక్షేమ, ఇతర సంక్షేమ సంస్థల పరిధిలోని కాలేజీలు ఇంటర్ విద్యను అందిస్తున్నాయి. భారీ సంఖ్యలో కాలేజీలో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కాలేజీల అవసరం ఏర్పడుతుంది. పదో తరగతి పూర్తిచేసుకుని బయటకు వస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా కొత్త కాలేజీలు ఏర్పాట్ల అవసరం ఏర్పడింది. అదనపు సీట్లు అవసరం కూడా ఉండడంతో ఈ దిశగా ప్రభుత్వం సర్వే చేయించింది. ప్రస్తుతం సుమారు పది లక్షల మంది రాష్ట్రంలో ఇంటర్ విద్య చదువుతున్నారు. ఉన్నత పాఠశాలలోనే ఇంటర్ విద్య అందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం 292 పాఠశాలల్లో ప్రారంభించింది. వీటికి హై స్కూల్ ప్లస్ లుగా పేరు పెట్టింది. కానీ పూర్తిస్థాయిలో బోధనా సిబ్బందిని కేటాయించలేదు. అదే పాఠశాలల్లో అర్హత కలిగిన టీచర్లకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పదోన్నతి కల్పించి వారిని ఇంటర్ బోధనకు కేటాయించింది.
ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే జూనియర్ కాలేజీలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయన్న విషయాలను పరిశీలిస్తే.. అల్లూరు జిల్లాలోని అనంతగిరి, కూనవరం, అనకాపల్లి జిల్లాలోని మాడుగుల, రావికమతం, రాంబిల్లి, నక్కపల్లి, పరవాడ, అనంతపురం జిల్లాలోని రాప్తాడు, యాడికి, బాపట్లలో సంతమాగులూరు, వేటపాలెం, కోనసీమలోని ఐ పోలవరం, కపిలేశ్వరం, రాయవరం, ఏలూరు జిల్లాలోని టీ నర్సాపురం, ముసునూరు, గుంటూరులోని మేడికొండూరు, కాకినాడలో కరప, కొత్తపల్లి, తొండంగి, కృష్ణాలోని బాపులపాడు, గుడ్లవల్లెరు, దేవనకొండ, నంద్యాలలోని రేపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో చందర్లపాడు, పల్నాడులోని క్రోసూరు, నాదెండ్ల, యడ్లపాడు, ప్రకాశంలో కొత్తపట్నం, కురిచేడు, పెద్దారవీడు, తాళ్లూరు, వెలిగండ్ల, పశ్చిమ గోదావరిలోని మొగల్తూరు, కడపలో మైలవరం, గోపవరం ప్రాంతాల్లో కొత్త కాలేజీలకు ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి యుడిఏలు రెండు, గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి యూడీఏలో నాలుగు కాలేజీలు అవసరమని గుర్తించారు. వీటిని వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులకు మేలు కలుగునుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు తాజా నిర్ణయం వల్ల ఉపశమనం దక్కనుంది.