ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తోంది. గత వైసిపి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహించగా, తాజాగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు విధానంలో దుకాణాలను కట్టబెట్టింది. కొద్దిరోజుల కిందటే టెండర్రింగ్ ప్రక్రియ పూర్తి చేసి షాపులను కేటాయించారు. అయితే ఈ షాపుల్లో కొన్నింటిని కళ్ళు గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపులకు సంబంధించిన వివరాలను తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తోంది. గత వైసిపి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహించగా, తాజాగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు విధానంలో దుకాణాలను కట్టబెట్టింది. కొద్దిరోజుల కిందటే టెండర్రింగ్ ప్రక్రియ పూర్తి చేసి షాపులను కేటాయించారు. అయితే ఈ షాపుల్లో కొన్నింటిని కళ్ళు గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపులకు సంబంధించిన వివరాలను తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలో మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన మంత్రి రవీంద్ర.. డిస్టిలరీసు టెండర్ కమిటీని సంప్రదించి ధరలు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో తెచ్చామని మంత్రి వెల్లడించారు. మద్యం దుకాణాలను పారదర్శకంగా కేటాయించాలని కోరారు. గీత కార్మికులకు 340 దుకాణాల కేటాయింపునకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వివరించారు. నవంబర్ 15లోపు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
తాజా ప్రకటనతో కల్లుగీత కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తోందని వారు పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పలువురు కల్లుగీత కార్మికులు ఈ మద్యం దుకాణాలు కోసం తమ ప్రయత్నాలను సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ కేటాయించిన దుకాణాలను పొందేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఈ దుకాణాలు ఎవరికి లభిస్తాయి అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. ఎవరి స్థాయిలో వారు తీవ్రంగానే ప్రయత్నాలను సాగిస్తున్నారు.