లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ హయాంలో సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభమైన తొలి రెండు రోజులు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. జూలై మూడో తేదీ వరకు పది రోజులపాటు సాగే లోక్ సభ సమావేశాల్లో ముందుగా కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండనుంది.
పార్లమెంట్ భవనం
లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ హయాంలో సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభమైన తొలి రెండు రోజులు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. జూలై మూడో తేదీ వరకు పది రోజులపాటు సాగే లోక్ సభ సమావేశాల్లో ముందుగా కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. అనంతరం స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోజు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ప్రోటెం స్పీకర్ గా ఎన్నికైన కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయనతో కాసేపట్లో రాష్ట్రపతి ప్రమాణం చేయించనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రారంభమవుతుంది. అనంతరం మంత్రులు ప్రమాణం చేయనున్నారు.
ఇది కూడా సీనియారిటీ ఆధారంగా ఉంటుంది. వీళ్ళ తర్వాత మిగిలిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. 544 మంది సభ్యులు ఉన్న లోక్ సభలో మొదటి రోజు సగం మంది సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు. రెండో రోజు మిగతా సభ్యులు ప్రమాణం చేస్తారు. రెండు రోజులపాటు ఈ ప్రమాణ స్వీకార ప్రక్రియ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీలు మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండో రోజు అంటే మంగళవారం తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. లోక్సభ స్పీకర్ ఎవరు అన్నదానిపై ఇప్పటికి చర్చ కొనసాగుతూనే ఉంది. మరోవైపు స్పీకర్ పదవి విషయంలో మాత్రం ఇండీ కూటమి గట్టిగానే ఉంది. అధికార ప్రతిపక్షాలను సమానంగా చూసే వ్యక్తిని మాత్రమే ఆ స్థానంలో కూర్చోవాలని పట్టుబడుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవినైన విపక్షాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. లేకుంటే డిప్యూటీ స్పీకర్ విషయంలో ఎవరిని పెట్టినా కచ్చితంగా పోటీలో ఉంటామని స్పష్టం చేస్తోంది. దీంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే 2029 ఎన్నికల నాటికి లోక్ సభ స్వరూపం మారిపోయే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాలు పునర్విభజన కారణంగా సభ్యుల సంఖ్య మరింత పెరగనుంది. దీనికి తోడు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమల్లోకి రానుంది. 2029 నాటికి ఎన్నికల తర్వాత కొలువుదీరే సభ చాలా ప్రత్యేకతను సంతరించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.