ఆకలితో అలమటిస్తున్న 110 కోట్ల మంది నిరుపేదలు.. ఒక్క భారత్ లోనే 23.4 కోట్ల మంది

ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంకా తీవ్రమైన పేదరికంలోనే జీవిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన గ్లోబల్ మల్టీ డైమన్షనల్ పోవర్టీ ఇండెక్స్ - 2024 నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో అనేక దేశాల్లో నిరుపేదల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు జాబితాలో ముందంజలో ఉన్న భారత్.. నిరుపేదల సంఖ్య అధికంగా ఉన్న దేశాలు జాబితాలను టాప్ లో ఉండడం గమనార్హం. అత్యధిక నిరుపేదలు కలిగిన దేశాలు జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

poor people

 నిరుపేదలు

ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల సంఖ్య పెరుగుతోంది. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ శరవేగంగా ముందుకు సాగుతుండగా, మరోవైపు తినేందుకు తిండి లేక అలమటిస్తున్న నిరుపేదల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంకా తీవ్రమైన పేదరికంలోనే జీవిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన గ్లోబల్ మల్టీ డైమన్షనల్ పోవర్టీ ఇండెక్స్ - 2024 నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో అనేక దేశాల్లో నిరుపేదల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు జాబితాలో ముందంజలో ఉన్న భారత్.. నిరుపేదల సంఖ్య అధికంగా ఉన్న దేశాలు జాబితాలను టాప్ లో ఉండడం గమనార్హం. అత్యధిక నిరుపేదలు కలిగిన దేశాలు జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల మంది నిరుపేదలు ఉండగా ఒక్క భారత్ లోనే 23.4 కోట్ల మంది నిరుపేదలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్, ఇథియోఫియా, నైజీరియా దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ లో 9.3 కోట్ల మంది, ఇథియోపియాలో 8.6 కోట్ల మంది, నైజీరియాలో 7.4 కోట్ల మంది, కాంగోలో 6.6 కోట్ల మంది నిరుపేదలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మొత్తంగా 110 కోట్ల మంది నిరుపేదల్లో 58.4 కోట్ల మంది 18 ఏళ్లలోపు చిన్నారులు ఉండడం ఆందోళన కలిగించే అంశంగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదల్లో 83.2 శాతం మంది ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లోనే ఉన్నారని నివేదిక గుర్తించింది. మొత్తం పేదల్లో 83.7 శాతం మంది గ్రామాల్లోనే ఉన్నారని నివేదిక తేల్చి చెప్పింది. ఇల్లు, పారిశుధ్యం, విద్యుత్,  వంట గ్యాస్, పోషకాహారలేమి తదితర అంశాలపై 2012 - 2023 మధ్య అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఐక్యరాజ్యసమితికి చెందిన యుఎన్డిపి మరో సంస్థ ఓపిహెచ్ఐతో కలిసి ఈ నివేదికను రూపొందించింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 2023లో అధికంగా అనేక దేశాల్లో అంతర్గత ఘర్షణలు, పలు దేశాల మధ్య యుద్ధాలు నెలకొన్నాయి. దీనివలన 11.7 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పోవాల్సి వచ్చిందని నివేదిక తెలియజేసింది. మొత్తంగా 110 కోట్ల మంది పేదల్లో ఘర్షణలు, యుద్ధాలు అశాంతియుత పరిస్థితులు నెలకొన్న రీజియన్లలో 40 శాతం అంటే 45.5 కోట్లు మంది ఉన్నారని వెల్లడించింది. తాజా నివేదిక పట్ల వివిధ దేశాలకు చెందిన డిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని గర్వంగా చెబుతున్న అగ్రరాజ్యాల నేతలు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో దేశాల్లో నెలకొన్న పేదరికం పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సంపన్నులు సంపన్నులుగా ఎదిగేందుకు మరింతగా సహకరించే ప్రభుత్వాలు, నిరుపేదల జీవన స్థితిగతులు మెరుగుపడేందుకు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ దిశగా అగ్ర రాజ్యాలు ఆయా దేశాలకు సహకారాన్ని అందించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్