ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పబ్లిక్ పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా గత 100 రోజుల నుంచి పాఠశాల విద్యాశాఖ విద్యార్థులను సన్నద్ధం చేసింది 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది మెరుగ్గా ఉన్న విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించేలా, అంతంత మాత్రమే ఉన్నవారు సులభంగా ఉత్తీర్ణుల అయ్యేలా సమాయత్తం చేసింది సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పబ్లిక్ పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా గత 100 రోజుల నుంచి పాఠశాల విద్యాశాఖ విద్యార్థులను సన్నద్ధం చేసింది 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది మెరుగ్గా ఉన్న విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించేలా, అంతంత మాత్రమే ఉన్నవారు సులభంగా ఉత్తీర్ణుల అయ్యేలా సమాయత్తం చేసింది సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 8:45 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాలను మొబైల్ రహితంగా ప్రకటించారు చీఫ్ సూపర్డెంట్ ఎందుకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి మొబైల్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలైన లాప్టాప్ లు కెమెరాలు ట్యాబ్లు ఇయర్ ఫోన్లో స్పీకర్లు స్మార్ట్ వాచ్లు బ్లూటూత్ వంటి వాటిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం ఏఎన్ఎం లను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేశారు. పదో తరగతి పరీక్షలకు 6,49,884 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 3,36,225 మంది కాగా, బాలికలు 3,13,659 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు 156, సమస్యాత్మక కేంద్రాలుగా 163 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వీరిలో 51,069 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాయనున్నారు.

ఒడియాలో 838 మంది విద్యార్థులు, తమిళంలో 194 మంది, కన్నడలో 623 మంది, హిందీలో 16 మంది, ఉర్దూలో 2,471 మంది పరీక్షలు రాయనున్నారు. వీరితోపాటు ఓపెన్ స్కూల్ సొసైటీ విద్యార్థులకు సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం ఉన్నాయి. పదో తరగతి పరీక్షలో రాయబోతున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒత్తిడికి గురికాకుండా ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించే పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్టీసీ అధికారులకు సమాచారాన్ని అందించారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యేంత వరకు విద్యార్థులకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కలుగుతుంది.  దీనివల్ల విద్యార్థులు వేగంగా, సులభంగా పరీక్షా కేంద్రాలను చేరుకునే అవకాశం ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్