Telangana Debts : తెలంగాణ అప్పు ఎంతో తెలుసా.. నోరెళ్లబెట్టాల్సిందే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||తెలంగాణ అప్పులు రూ.4.3 లక్షల కోట్లు||

ఈవార్తలు, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంతో తెలుసా? అక్షరాలా నాలుగు లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈ వివరాలు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని తెలిపింది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు పెరుగుతూ పోతున్నాయని వివరించింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 2014లో రూ.75,577 కోట్లు ఉండగా, 2021-22 నాటికి రూ. 2,83,452 కోట్లకు చేరాయి. 2022, అక్టోబర్‌ నాటికి తెలంగాణ అప్పులు రూ.4,33,817.6 కోట్లకు చేరిందని పేర్కొంది.

తెలంగాణ అప్పులు ఇలా..

201415లో రూ.8,121 కోట్లు

2015-16లో రూ.15,515 కోట్లు

2016-17లో రూ.30,319 కోట్లు

2017-18లో రూ.22,658 కోట్లు

2018-19లో రూ.23,091 కోట్లు

2019-20లో  రూ.30,577 కోట్లు

2020-21లో రూ.38,161 కోట్లు

2021-22లో రూ.39,433 కోట్లు

ఇవి కాకుండా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, ఇతర కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు రూ.1,50,365.60 కోట్లు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్