నిజమే.. రాజకీయ నాయకుల్లో దారుణ వ్యక్తిత్వ హననానికి గురైన నేత కేసీఆర్ ఒక్కరే

ఎప్పుడైతే నిన్ను శత్రువు నిజాలు లేదా లాజిక్లతో ఓడించలేకపోతాడో, అప్పుడు నీ ప్రతిష్టను దెబ్బతీయడానికి మరియు సమాజంలో నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి వ్యక్తిగత దాడులు మరియు నిందారోపణలకు దిగుతారు. ఇది కెసిఆర్ విషయంలో 2001లో మొదలైంది‌, ఇంకా కొనసాగుతునే ఉంది.

kcr

కేసీఆర్

ఎప్పుడైతే నిన్ను శత్రువు నిజాలు లేదా లాజిక్లతో ఓడించలేకపోతాడో, అప్పుడు నీ ప్రతిష్టను దెబ్బతీయడానికి మరియు సమాజంలో నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి వ్యక్తిగత దాడులు మరియు నిందారోపణలకు దిగుతారు. ఇది కెసిఆర్ విషయంలో 2001లో మొదలైంది‌, ఇంకా కొనసాగుతునే ఉంది. తెలంగాణా కు జరిగిన అన్యాయం పైన పూర్తి అద్యయనం తర్వాత, సంపూర్ణ అవఘాహణతో 2001 లో చరిత్రలో లేని కొత్త తరహా ఉద్యమాన్ని టీఆర్ఎస్ రూపంలో ప్రారంభించిన కెసిఆర్‌పై ఆది నుండి శత్రువులు చేస్తున్నది ఈ వ్యక్తిత్వ హననం అనే దాడే. నాడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను పూర్తి ఆధారాలతో, వివిధ వేదికల్లో మాట్లాడుతూ స్టాటిస్టిక్స్ తో వ్యతిరేకుల నోర్లు ముయించేది కేసీఆర్. అప్పటి శత్రువు ఆ సాటిస్టిక్స్ అండ్ ట్రూత్ వార్ లో ఓడిపోయి వ్యక్తిత్వ హననంతో కుతి తీర్చుకునేవాడు. ఆ శత్రువులు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడోళ్ళు శత్రువుగా  లేకపోతే, పరిస్థితులు అంత ఈజీగా అర్థం చేసుకుని మేల్కాని పోరాడేటోల్లైతే, తెలంగాణ 60 ఏండ్ల బందీ ఎట్లైతుండే?

ఇక్కడి రాజకీయ శత్రువులు, ఇక్కడి సిద్ధాంత శత్రువులు, ఇక్కడి వ్యక్తిగత వైరుద్య శత్రువులు, ఇక్కడి మీడియా శత్రువులు, ఇక్కడి ఏదో ఫలితం ఆశించి భంగపడ్డ శత్రువులు, ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచన లేకుండా, వ్యూహం అర్థం చేసుకోకుండా అందరూ ఏదో ఒక సందర్భంలో రకరకాల వ్యక్తిత్వ హననం చేసిన వాళ్లే. ఇదే అక్కడి నాటి శత్రువుకు బలమైన ఆయుధం అక్కడోళ్ళు చెప్పేదానికంటే ఇక్కడోళ్ళు చెప్పేదానికి వాల్యూ ఎక్కువ, అదే ఫోకస్ గా చూపించి అసలు ఉద్దేశాన్ని మసకబార్చే ప్రయత్నాలు 2001 నుండీ జరిగినై.

- 2001 లో టిడిపిని వదిలి బైటికి వచ్చినప్పుడు

- స్థానిక సంస్థల్లో పోటీ అన్నప్పుడు 

- 2004లో కాంగ్రెస్ తో పొత్తు అన్నప్పుడు

- 2004లో యూపీఏ మంత్రివర్గంలో చేరినప్పుడు 

- 2005లో తెలంగాణా ఎజెండాగా యూపీఏ నుండి బైటికి వచ్చినప్పుడు 

- 2006 ఎంపీగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయినప్పుడు 

- 2008 ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయినప్పుడు

- 2009 TDPతో పొత్తు అన్నప్పుడు 

- 2009 లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు 

- 2009 లో తెలంగాణా ప్రకటన సాధించినప్పుడు 

- 2010 లో మల్లీ ఉద్యమ ఉధృతి పెంచినప్పుడు

- 2014 లో తెలంగాణా ప్రకటన వస్తున్నప్పుడు 

- 2014 లో తెలంగాణా ముఖ్యమంత్రిగా ప్రమాణా స్వీకారం చేస్తున్నప్పుడు

ప్రతి సందదర్భంలో రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేసన్ జరిగింది. ఫౌండర్ మెంబెర్స్‌గా ఉన్నోళ్ళు బైటికి పోయి చిత్ర విచిత్ర కథనాలతో పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు చేశారు. ఒకసారి అమ్ముడు పోయిండని, ఒకసారి సీరియస్నేస్ లేదని, ఒకసారి రాజకీయ పబ్బం కోసమని, ఒకసారి కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి అని, ఒకసారి అసలు తెలంగాణా రావడమే ఇష్టం లేదని, ఒకసారి రాజకీయ ఉనికి కోసమే ఉద్యమమని, ఒకసారి ఉద్యమానికి పార్టీతో అవసరమేందని, ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన నరేటివ్ నడుపుతూ వ్యక్తిత్వంపై, వ్యక్తిగత అలవాట్ల పై, సహచరులతో వ్యవహారశైలిపైనా ఇష్టారీతిన దుష్ప్రచారం జరిగింది‌. ఇట్లా దుష్ప్రచారం చేసెటోల్లను కలుపుకుంటూనే, వీటన్నింటినీ దాటుకుంటూనే ఢిల్లీకి తెలంగాణా ఇవ్వకుండా ఉండలేని అనివార్యతను సృష్టించి గమ్యాన్ని ముద్దాడాడు. 

విజయానికి అందరూ చుట్టాలే.. అపజయానికి అందరూ విమర్శకులే 

2014 లో సిద్ధించిన తెలంగాణాకు అందరూ కారకులే అని గల్లాలు ఎగిరేసిన మేధావులు.. 2001 తర్వాత పుట్టిర్రా? అంతకుముందు లేరా? అనే అనుమానం కూడా వస్తది వాళ్ల మాటలింటుంటే. తెలంగాణా ఉద్యమంలో ఎవ్వరి పాత్ర కాదనలేనిదే, కానీ నేను లేకుంటే ఏమైతుండే అనేటోల్లతోనే సమస్య. వీళ్లంతా సందర్భం వచ్చినప్పుడల్లా తమ అసలు రంగులు చూపిచ్చినోళ్ళే. ఇక 2014 నుంచి పాలకుడిగా మారిన కెసిఆర్ మీద రెండింతలు ఎక్కువ దాడి జరిగిందన్నది, ఇప్పుడు జరుగుతున్నది వాస్తవం. అద్దాలు పెట్టుకుని యూట్యూబ్ గొట్టాల ముందు 6-7 ఏండ్ల నుంచి పిచ్చిపిచ్చి ఒర్రుడు ఒర్రిన ఓ జర్నలిస్టు.. నిన్న మొన్న క్షమాపణలు చెప్పుకుంటూ ఇట్లైతదనుకోలే.. అప్పుడు కెసిఆర్‌కి జర్క్ ఇయ్యాల్నని అట్ల మాట్లాడిన అంటుండు. ఉద్యమ సమయంలో, గత పదేండ్లలో, ఇప్పుడు స్టాటిస్టిక్స్ గానీ, సబ్జెక్ట్ మీద గానీ, ఇన్ఫ్రా స్ట్రక్చర్ మీద గానీ, 10 సంవత్సరాల చేంజెస్ మీద గానీ, మారిన జీవన ప్రమాణాల మీద గానీ, మన భవిష్యత్తు ప్రణాళీకలమీద గానీ చర్చ జరిగిందా? ఎంతసేపు కెసిఆర్ వ్యక్తిత్వంపై, ఆధారాలు లేని దుష్ప్రచారాల చుట్టూ జనాల్ని తిప్పుడే గానీ ఇందులో నిజాలేవి?

తెలంగాణ 1956 లో రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రం ,

2014 లో రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రం (కాగ్ డేటా), 

2022-23 లో రెవెన్యూ సర్ఫ్లస్ రాష్ట్రం ( కాగ్ డేటా).

మన కండ్లముందే నీళ్ళు, కరెంట్, ఉద్యోగాలు,ఊర్లు పట్టణాలు, మండలాలు, జిల్లాలు, గురుకుల స్కూల్లు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వ్యవసాయం...etc  అన్నీ మన కండ్లముంగట్నే బాగుపడ్డా ఏమిట్కి ఆగమైనం మరి? శత్రువు కాంగ్రెసైనా, బిజెపి అయినా , ఇంకెవరయినా అకాడమిక్స్ తో యుద్ధం చేసి కేసిఆర్ ని గెలవడం అసాధ్యమని తెలుసు. అందుకే ఈ వ్యక్తిత్వాన్ని కించపరిచే దుష్ప్రచారం. కాంగ్రెస్ అధికారం చేపట్టి యాడాదిన్నర అయింది తెలంగాణాను విపరీతంగా అభివృద్ధి చేస్తాం అంటే గనుక అడ్డం పడుతున్నారా ఎవరైనా? బిజెపి 10 ఏండ్లుగా అధికారంలో ఉంది. ఇక్కడ వాళ్ల ప్రాతినిథ్యం పెరిగింది. పార్లమెంటులో తెలంగాణా కోసం మాట్లాడి విపరీతమైన ఫండ్స్ తెచ్చి తెలంగాణాను అభివృద్ధి చేస్తం అని ఉర్కుతుంటే ఎవరన్న ఆపిర్రా? ఆ పని చేతకాదు గనుకనే మల్లీ ప్రజలేడ అవ్వి అడిగి ఆగం చేస్తారేమో అనే ఈ దుష్ప్రచారం. 

- పాశం రఘునందన్ రెడ్డి


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్