ఇప్పటివరకు కేసీఆర్ పార్టీ బోణీ కొట్టని నియోజకవర్గం ఇదే.. ఈ సారైనా గెలుపు దక్కుతుందా?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||కేసీఆర్||

(ఎల్బీనగర్, ఈవార్తలు ప్రతినిధి, దేవులపల్లి రంగారావు)

నామినేషన్ల పర్వం ముగిసింది ఎన్నికల కులాహలం మొదలైంది కాగా రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారుతుంది ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ బిజెపి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు నువ్వా నేనా? అనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని 11 డివిజన్లలో పోటీ హోరాహోరీగా ఇక చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, మనసురాబాద్, గడ్డి అన్నారం, చంపాపేట్, లింగోజిగూడ డివిజన్లలో, కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న వనస్థలిపురం, బి.ఎన్.రెడ్డి నగర్, హస్తినాపురం, హయత్ నగర్ డివిజన్లపై, కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సెటిలర్ల ఓట్లు గంపగుత్తగా హస్తం పార్టీ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది టిడిపి పోటీలో లేకపోవడంతో సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్కు మొగ్గు చూపుతారని ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వనస్థలిపురం బి.యన్.రెడ్డి హస్తినాపురం గడ్డి అన్నారం చైతన్యపురి హయత్ నగర్ డివిజన్లో ఉద్యోగులు ఆంధ్ర ప్రాంత సెటిలర్ల ఓట్లే కీలకం కానున్నాయి.

మూడు ఎన్నికల్లో టిడిపి కాంగ్రెస్ కే జై

డి లిమిటేషన్ లో భాగంగా 2009లో ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి 2014లో జరిగిన ఎన్నికల్లోను ఇక్కడి ప్రజలు టిడిపికే పట్టం కట్టారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో టిడిపి పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇలా నియోజకవర్గ ఏర్పడిన తర్వాత జరిగిన మూడు ఎన్నికలలోను ఇక్కడి ప్రజలు టిడిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టారు. నల్లగొండ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన అనేకమంది వివిధ వృత్తులు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడ్డారు. గడిచిన మూడు ఎన్నికల్లోను వీరి ఓట్లే కీలకంగా మారాయి. ఇందులోను రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్కు ప్లస్ పాయింట్ అవుతూ వచ్చింది. 2014లో టిడిపి తరఫున బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గెలుపొందారు. 2018 ఎన్నికల్లో టిడిపి ఓటు బ్యాంకు కలిసి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి ముద్దగాని రామ్మోహన్ గౌడ్ పై రెండు వేల పైచిలుకు ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు.

ప్రస్తుతం గెలుపు పై కాంగ్రెస్ ధీమా

ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్పై హస్తం పార్టీ గంపేడు ఆశలు పెట్టుకుంది గౌడ సామాజిక ఓటర్లతో పాటు తమ సిట్టింగ్ సిటీ అని నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. అయితే మల్రెడ్డి రాంరెడ్డి వర్గం మధు యాష్కి గౌడు కు ఎంతవరకు సహకరిస్తారు? అనేది చూడాలి. గత రెండు ఎన్నికల్లోను రామ్మోహన్ గౌడ్ రెండో స్థానంలో ఉండడం గణనీయంగా ఓట్లు సాధించడంతో ఆయన సామాజిక ఓటు బ్యాంకు కాంగ్రెస్కు చేరితే మధు యాష్ కి కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పాలి కానీ మళ్ళీ ఆయన కాంగ్రెస్ నుండి ఇటీవలే సొంతగూడు టిఆర్ఎస్ లో చేరారు దీనితో బిసి ఓటర్లు గౌడ సామాజిక వర్గం ఓటర్లు చూపుతారో వేచి చూడాలి మరి!

బిజెపికి కలిసి వచ్చేనా?

బిజెపి కూడా ఎల్బీనగర్ పై ఫోకస్ పెట్టింది జిహెచ్ఎంసి ఎన్నికల్లో నియోజకవర్గంలోని 11 డివిజన్లను కైవసం చేసుకుంది ఆ సమయంలో వచ్చిన వరదలు రిజిస్ట్రేషన్లు సమస్యలతో విసిగిస్తున్న ప్రజలు జిహెచ్ఎంసి ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు దీనితో అన్ని డివిజన్లో డిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇవ్వబోతున్నామని బిజెపి అభ్యర్థి సామ రంగారెడ్డి చెబుతున్నారు. ఈసారి ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటాం అన్న ధీమాతో కమలం పార్టీ ఎల్బీనగర్ స్పెషల్ ఫోకస్ పెట్టింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపికి కలిసి వచ్చేనా? లేదా అన్నది ఫలితాల తర్వాతే తేల నుంది.

రెండుసార్లు కారు పల్టీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 2018 లో జరిగిన రెండు ఎన్నికల్లో ఎల్బీనగర్లో కార్ పల్టీ కొట్టింది 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి షిఫ్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బరిలో నిలిచారు అప్పటి ఎన్నికల్లో అనూషంగా టిడిపి అభ్యర్థి ఆర్ కృష్ణయ్య గెలు పొందారు . బి ఆర్ ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ రెండో స్థానంలో నిలిచారు సుధీర్ రెడ్డికి మూడో స్థానం దక్కింది 2018లో టిడిపి పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ సుధీర్ రెడ్డికి అవకాశం వచ్చింది ఈ ఎన్నికల్లో సుధీర్ రెడ్డి కేవలం 2010 ఓట్ల శిల్ప ఆదిత్యతో గెలుపొందారు ఆ తరువాత సుధీర్ రెడ్డి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు కాగా ప్రస్తుతం 2023లో జరిగే ఎన్నికల్లో మొదటిసారి టిఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

వెబ్ స్టోరీస్