Opinion: సనాతన ధర్మంపై నిరంతర దాడులు.. హిందువులు మేల్కొనకపోతే మనుగడే కష్టం

ఇప్పుడు భారతదేశం మరో దండయాత్రను ఎదుర్కొంటున్నది. అదే.. అర్బన్‌ నక్సలైట్ల దండయాత్ర. సనాతన ధర్మంపై పగబట్టి, దాన్ని నాశనం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.

sanatan hindu

ప్రతీకాత్మక చిత్రం

పర్షియన్‌ దండయాత్ర..

అలెగ్జాండర్‌ దండయాత్ర..

అరబ్బుల దండయాత్ర..

టర్కిష్‌ల దండయాత్ర..

మంగోలియన్ల దండయాత్ర..

మొఘలుల దండయాత్ర..

యూరోపియన్ల దండయాత్ర..

ఇన్ని దండయాత్రలను తట్టుకొని కూడా సనాతన ధర్మం నిలబడిరది. మరో దేశంపై దండయాత్ర చేయని, మరో దేశాన్ని పల్లెత్తు మాట అనని దేశం ఏదైనా ఉందీ అంటే అది భారతదేశమే. దానికి కారణం.. భారతీయులు నేర్చిన సనాతన ధర్మం. కానీ, ఇప్పుడు భారతదేశం మరో దండయాత్రను ఎదుర్కొంటున్నది. అదే.. అర్బన్‌ నక్సలైట్ల దండయాత్ర. సనాతన ధర్మంపై పగబట్టి, దాన్ని నాశనం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.

‘‘ఒకడు హిందూయిజం అంత దుర్మార్గమైనది ఇంకోటి లేదు’’ అని అన్నాడంటే అది వాడి ధైర్యమా? లేక.. హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నవారి సహనమా? లేక చేతగానితనమా? వాడు ఇదే మాట ఇంకో మతాన్ని అని ఉంటే.. చీల్చి చెండాడేవాళ్లు. ఆ మాట అన్నచోటే బట్టలు విప్పి చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించేవాళ్లు. కానీ.. హిందువులు సహనశీలురు. అందుకే.. దుర్మార్గమైనది అని అన్నా కిక్కురుమనటం లేదు. అదీ మన హిందూ సమాజం. రక్తంలో చీమంత నెత్తురు లేని సమాజం. శతాబ్దాల క్రితం విదేశీయులు దండయాత్రలు మొదలుపెట్టి.. దొరికిన చోటల్లా రక్తపుటేర్లు పారించి, సనాతన ధర్మ మూలాలను చెరిపేసే కుట్రలు చేశారు. పర్షియన్ల నుంచి మొదలుపెడితే.. అలెగ్జాండర్‌, అరబ్బులు, టర్కిష్‌లు, మంగోలియన్లు, మొఘలులు, యూరోపియన్లు.. ఇలా భారతదేశాన్ని చెరబట్టి సంపదనంతా దోచుకుపోయారు. అవసరమైన చోటల్లా తమ మత ప్రభావాన్ని పెంచారు. దాని ఫలితమే భారతదేశంలో మైనారిటీలు ఉన్న ముస్లింలు, క్రిస్టియన్లు. అయితే, ఇప్పుడు భారతదేశం అత్యంత క్లిష్టమైన దండయాత్రను ఎదుర్కొంటున్నది. అదే అర్బన్‌ నక్సలైట్ల దండయాత్ర. స్వాతంత్య్రానికి ముందు వరకు భారత దేశం ఎదుర్కొన్న దండయాత్రలన్నీ విదేశీయులు చేపట్టినవే. కానీ, వర్తమాన భారతం ఎదుర్కొంటున్న దండయాత్ర మాత్రం.. దేశంలో ఉండి.. దేశంలో తిరుగుతూ.. సనాతన ధర్మంపై చేస్తున్న దండయాత్ర.

హిందూ ధర్మంపై దండయాత్రలు చేస్తున్న ఈ అర్బన్‌ నక్సలైట్ల నుంచి హిందూ ధర్మాన్ని కాపాడేది ఎవరు? హిందువులు ఇంకెంత కాలం సహనంతో ఉండాలి? విదేశీ దండయాత్రలన్నీ మనలో ఐకమత్యం లోపించడం వల్లే జరిగాయి. ఇప్పుడూ ఐకమత్యం లేకపోవడం వల్లే సనాతన ధర్మంపై చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఒకడు.. సనాతన ధర్మ నిర్మూలన అంటాడు. ఇంకొకడు.. హిందూ ఆలయాల డబ్బంతా ప్రజలకు పంచి పెట్టాలంటాడు. ఇప్పుడేమో ఒకడు.. హిందూ మతం అంత దుర్మార్గమైన మతం లేదని అంటాడు. ఇంతలా అంటున్నా.. ఏ హిందువు రక్తం మరగడం లేదా? ‘యస్మిన్‌ యథా వర్తతే యో మనుష్యః  తస్మిన్‌ తథా వర్తితవ్యం స ధర్మః మాయాచారో మాయయా బాధితవ్యః సాధ్వాచారః సాధునా ప్రత్యుపేయః’.. ఎవడు ఎవరితో ఎలా ప్రవర్తిస్తాడో, వాడు వాడితో అలాగే ప్రవర్తించడం ధర్మం. మాయాచారునితో, మాయావిలా, సాధుశీలునితో సాధువులా ప్రవర్తించుటే న్యాయం అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి శ్రీకృష్ణుడి మాటను అక్షరాలా పాటించాల్సిన అవసరం హిందువులకు ఉంది కదా. సనాతన ధర్మాన్ని పాటించే వారికి ఉంది కదా. అలాంటప్పుడు.. హిందూ మతాన్ని దూషించేవాడికి దండన విధించాల్సిందే కదా. మతాన్ని దూషించేవాడిని కేవలం హిందూ సంఘాలే ఖండిరచాలా? హిందువుగా.. ప్రతి ఒక్కరు ఖండిరచాల్సిన అవసరం ఉంది కదా. తప్పుడు మాటల మాట్లాడేవారికి తప్పక శిక్ష పడాలి కదా. మరోసారి హిందూధర్మాన్ని కించపర్చాలన్న ఆలోచన వచ్చినా భయం పుట్టేలా చేయాలి.

వ్యాసకర్త: రణధీర్‌ గుండు, రాజకీయ విశ్లేషకుడు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్