ఎన్డీయేకు మద్దతుగా ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించేందుకు రెడీ కాగా, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర బాట పట్టారు. గురుశిష్యులుగా పేరున్న వీరిద్దరు.. వేరే పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఒకే రాష్ట్రంలో వేర్వేరు పార్టీలకు ప్రచారం నిర్వహించనుండటం అరుదైన సందర్భంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, ఈవార్తలు ప్రతినిధి : జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో విజయం కోసం అతిరథ మహారథులు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్,యోగి ఆదిత్యనాథ్ తదితరులు రంగంలోకి దిగారు. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీయేకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. రెండు రాష్ట్రాల్లోనూ గెలుపు తమదే అన్న ధీమాలో బీజేపీ ఉంది. నవంబర్ చివరి వారంలో పార్లమెంట్ సమావేశాలకు ముందే ఈ రెండు రాష్టాల్ర ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. జమిలి ఎన్నికల గురించి పట్టుదలగాఉన్న బీజేపీకి ఈ గెలుపు అనివార్యం. ఎన్ని రాష్టాల్ల్రో అధికారంలో ఉంటే అంతగా అనుకూలం అవుతుంది. అందుకే సర్వశక్తులు ఒడ్డుతోంది. గత పదేళ్లలో భారతీయ జనతా పార్టీ ఒక అజేయ శక్తిగా ఎదిగింది. అయినా కాంగ్రెస్ ముక్త భారత్ అంతగా పనిచేయలేదు.
అయితే, ఎన్డీయేకు మద్దతుగా ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించేందుకు రెడీ కాగా, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర బాట పట్టారు. గురుశిష్యులుగా పేరున్న వీరిద్దరు.. వేరే పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఒకే రాష్ట్రంలో వేర్వేరు పార్టీలకు ప్రచారం నిర్వహించనుండటం అరుదైన సందర్భంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి కూడా గట్టిగానే ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిస్తే ఇక్కడి వనరులను బడా కార్పొరేట్లు దోపిడీ చేస్తారని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. కాషాయ నేతల చొరబాటును అడ్డుకోవాలని పిలుపునిస్తున్నారు. ఆదివాసీలకు, ఇతర సామాజిక తరగతుల ప్రజలకు మధ్య చిచ్చురాజేసి జార్ఖండ్‌లో కాషాయ పార్టీ లబ్ది పొందాలని కుయుక్తులు పన్నుతోందని విమర్శిస్తున్నారు.