రామోజీరావుకు అక్షరాంజలి.. మరో జర్నలిస్టు మరో కోణం

మాట‌విన‌ని స‌ర్కారును కూల్చ‌డం, త‌న ముందు మోక‌రిల్లే వ్య‌క్తులు అక్ష‌ర హార‌తులివ్వ‌డం, అధికార పీఠం ఎక్కించడం రామోజీరావుకే చెల్లింది. ఊళ్ల‌కు ఊళ్ల‌ను మింగి, నిబంధ‌న‌లు ఉల్లంఘించి వేల ఎక‌రాల్లో ఫిలింసిటీ క‌ట్టినా క‌నీసం ప్ర‌శ్నించ‌ని ప్ర‌భుత్వాలు ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డాయి.

ramoji rao

రామోజీ రావు

అక్ష‌ర వ్యాపారి రామోజీ రావు!

ఈనాడు మాటున మ‌హా సామ్రాజ్య స్థాప‌న‌

మాట‌విన‌ని స‌ర్కారుపై క‌త్తిగ‌ట్టిన క‌లంపోటు

అనుకూల ప్ర‌భుత్వాల‌కు అక్ష‌రాల దండ‌లు

ఊళ్ల‌కు ఊళ్ల‌ను మింగి క‌ట్టిన కోట.. ఫిలిం సిటీ

శ్ర‌మ‌దోపిడి, వెట్టిచాకిరికి కేరాఫ్ రామోజీ సంస్థ‌లు

యూనియ‌న్లు లేకుండా క‌ట్ట‌డి చేసిన నియంత‌

అక్ష‌ర‌యోధుడు.. పాత్రికేయ మ‌హ‌ర్షి.. వాణిజ్య మేరున‌గం.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫిలింసిటీని చెక్కిన‌ విశ్వ‌క‌ర్మ‌.. ప్ర‌జాబంధువు.. సినీస్ర‌ష్ట‌.. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి.. ఇవ‌న్నీఒకే ఒక్క‌రికి తొడిగిన భుజ‌కీర్తులు.. ఆయ‌నే చెరుకూరి రామోజీరావుగారు. ఆయ‌నను అక్ష‌ర యోధుడు.. పాత్రికేయ‌ మ‌హ‌ర్షి అన‌డం కంటే పంక్తు వ్యాపారి అంటే స‌బ‌బేమో. అంద‌మైన అక్ష‌రాలు పేర్చి ఈనాడు మాటున ఆనాటి నుంచి మ‌హా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన‌ బిజినెస్ టైకూన్‌. మాట‌విన‌ని స‌ర్కారును కూల్చ‌డం, త‌న ముందు మోక‌రిల్లే వ్య‌క్తులు అక్ష‌ర హార‌తులివ్వ‌డం, అధికార పీఠం ఎక్కించడం ఆయ‌న‌కే చెల్లింది. ఊళ్ల‌కు ఊళ్ల‌ను మింగి, నిబంధ‌న‌లు ఉల్లంఘించి వేల ఎక‌రాల్లో ఫిలింసిటీ క‌ట్టినా క‌నీసం ప్ర‌శ్నించ‌ని ప్ర‌భుత్వాలు ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డాయి. నిబంధ‌న‌లు అతిక్ర‌మించి మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్ ఫెట్టి ప్ర‌జ‌ల డ‌బ్బులు వ‌సూలుచేసినా అడిగే ధైర్యం చేయ‌ని యంత్రాంగం ఆయ‌న వ‌ద్ద మోక‌రిల్లింది.

శ్ర‌మ‌దోపిడీ, వెట్టిచారికి కేరాఫ్ అడ్ర‌స్ రామోజీ సంస్థ‌లు. అక్క‌డ యూనియ‌న్లు.. హ‌క్కులు ఉండ‌వు. ప్ర‌భుత్వాలు ఇచ్చే అక్రెడిటేష‌న్లు పొందే క‌నీస హ‌క్కు కూడా ఉండ‌దు. ప్ర‌శ్నించ‌డం.. ఎదిరించ‌డం అనే ఆలోచ‌నే రాకూడ‌దు. చెప్పిన ప‌ని చెప్పిన‌ట్టుగా చేసి వెళ్లాల్సిందే.. అంతే త‌ప్ప ఎలాంటి డిమాండ్లు రాకూడ‌దు. ఇదీ గ్రేట్ రామోజీ సంస్థ‌ల హుకుం. ఈనాడులో ప‌నిచేసే సిబ్బంది ఎవ‌రైనా చ‌నిపోతే క‌నీసం ఆ సంస్థ గుర్తించ‌దు. ప‌నిచేయండి.. ఫ‌లితం ఆశించొద్దు.. ఫ‌లితం ఆశించాల్సింది నేనోక్క‌డినే అన్న‌ట్టుగా ఉంటుంది రామోజీ సంస్థ‌ల తీరు. అందుకే రామోజీరావు గారు మంచి వ్యాపారి. కొత్త ఆవ‌కాయ ప‌చ్చ‌డిని మార్కెట్లో అమ్మిన‌ట్టు.. అక్ష‌రాలు అమ్మ‌డం నేర్చిన గొప్ప వ్యాపారి. లాభ‌మే ఆయ‌న అంతిమ ల‌క్ష్యం. న‌ష్టాలు వ‌స్తే దేనినైనా వ‌ధించుకొనే వ్యాపారి. విఫుల, అన్న‌దాత‌, తెలుగు వెలుగు వంటితో మ్యాగ‌జైన్ల‌తో లాభం లేద‌ని న‌ష్ట‌మే వ‌స్తుంద‌ని విదిలించుకున్న అక్ష‌రాల ప‌చ్చ‌డి వ్యాపారి. 

ఉదయం పేప‌ర్‌ను దెబ్బ‌తీసేందుకు సారా ఉద్య‌మం ఎత్తుకున్న‌రు. వ్య‌క్తిగ‌త ద్వేషంతో దాస‌రి నారాయ‌ణరావు పేరును కూడా ప్ర‌చురించ‌ని మీడియా ప్ర‌మాణాలు పాటించిన సంస్థ‌కు యజమాని. తెలంగాణ వ్య‌తిరేకి.. ఏనాడూ మ‌ద్ద‌తు ఇవ్వ‌ని ఉద్యమ ద్రోహి. కేసీఆర్ ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నుతా అన‌గానే.. భీతిల్తి కేసీఆర్ వంత పాడిన అక్షర యోధుడు. జగన్ నియంత అని బట్టలు విప్పేసిన పత్రికకు ఓనర్.

- జ్వాల


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్