||యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ||
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవలు ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆలయ పునః నిర్మాణం తర్వాత వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. దీనికోసం ఆలయ అధికారులు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 28 తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఆర్జిత సేవలు, హోమాలను బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు నిలిపి వేయాలని ఆలయ ఈవో నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల రోజు వారి పూజలు లివే
ఫిబ్రవరి 21 :
ఉదయం 10గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహన జరిపిస్తారు.
ఫిబ్రవరి 22 :
ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం.
ఫిబ్రవరి 23 :
ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకా రం చుడతారు. ఉదయం 9గంటలకు మత్సా్యవతార అలంకార సేవ, వేదపారాయణం. రాత్రి 7గంటలకు శేష వాహన సేవ ఉంటుంది.
ఫిబ్రవరి 24 :
ఉదయం 9గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7గంటలకు హంస వాహన సేవ.
ఫిబ్రవరి 25 :
ఉదయం 9గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ. రాత్రి 7గంటలకు పొన్న వాహన సేవ.
ఫిబ్రవరి 26 :
ఉదయం 9గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7గంటలకు సింహ వాహన సేవ.
ఫిబ్రవరి 27 :
ఉదయం 9గంటలకు జగన్మోహిని అలంకా ర సేవ. రాత్రి 7గంటలకు అశ్వవాహన సేవ, అ నంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం.
ఫిబ్రవరి 28 :
ఉదయం 9గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ. రాత్రి 8గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం.
మార్చి 1 :
ఉదయం 9గంటలకు గరుడ వాహన సేవ. రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం.
మార్చి 2 :
ఉదయం 10.30గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం. సాయంత్రం 6గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన.
మార్చి 3 :
ఉదయం 10గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.