Ekadasi 2024:ఏకాదశి రోజున స్త్రీలు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు

హిందూక్యాలెండర్ ప్రకారం ఆషాఢ ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి మంగళవారం రాత్రి 8.33గంటలకు ప్రారంభమై జులై 17, 2024 బుధవారం రాత్రి 9.02గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది జులై 17న తొలి ఏకాదశి పండగను జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజు కొన్ని పనులు మహిళలు చేయకూడదు. అవేంటో చూద్దాం.

Ekadasi 2024

ప్రతీకాత్మక  చిత్రం 

ఆషాడమాసం ప్రారంభమయ్యిందంటే తెలుగువారికి వరుసగా పండగలే వస్తుంటాయి. అందులో ముందుగా వచ్చేది తొలిఏకాదశి. ఈ పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు స్వామివారిని పూజిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు. ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢమాసంలోని శుక్ల పక్షంలోని 11వ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజు విష్ణువుమూర్తిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈరోజు కొన్ని పనులకు చేయకుండా దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం. 

ఏకాదశి రోజు భక్తులు ఉపవాసం పాటించాలి. విష్ణుమూర్తికి పూజ చేయాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిల్లో తులసీ ఆకులు కూడా ఒకటి. తులసీ దళం సమర్పించకుండా విష్ణుపూజ పూర్తి కాదని భక్తుల విశ్వసిస్తుంటారు. కాబట్టి శ్రీమహా విష్ణువు దర్శనానికి వెళ్లినా, పూజ చేసిన కచ్చితంగా తులసీ ఆకులను వాడాల్సిందే. 

తొలిఏకాదశి రోజు ఉపవాసం ఉంటే బియ్యంతో తయారు చేసిన ఎలాంటి పదార్థాన్ని తినకూడదని పండితులు చెబుతున్నారు. ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈరోజు మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే ఇవి మనసులో ప్రతికూల ఆలోచనలకు దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు. అలాంటి ఆలోచనలతో మనం ఆరాధనపై ఫోకస్ పెట్టలేము. 

తొలిఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా పూజ చేసిన చేయకున్నా దానం చేయాలి. బియ్యం, బట్టలు, డబ్బులు, నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఎందుకంటే ఏకాదశి రోజు ఇలాంటి పనులు చేస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. 

తొలిఏకాదశి రోజు బ్రహ్మచర్యం పాటించాలి. భక్తులు తమ శరీరం, మనస్సుపై నియంత్రణ ఉంచుకోవాలి. విష్ణుమూర్తి మంత్రాలను పటిస్తూ రోజంతా గడపడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈరోజు స్త్రీలు ఎరుపు లేదా పసుపు రంగు దస్తువులను ధరించి పూజ చేయాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్