బొట్టు పెట్టుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందా..

మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో అధిదేవత ఉన్నాడు. బ్రహ్మ స్థానం నుదుటు. బ్రహ్మ దేవుడి రంగు ఎరుపు, కావున బ్రహ్మ స్థానమైన నుదుటున ఎరుపు రంగు బొట్టు ధరించాలి. అనగా కుంకుమ నుదుటన సూర్యకిరణాలు తాకరాదు. మనలోని జీవి జ్యోతి స్వరూపుడిగా భూమధ్యంలోని అజ్ఞాన చక్కంలో సుషుప్త దశలో హృదయ స్థానంలో అనగాఅనాహత చక్రంలో ఉంటాడు.

bindi on fore head

ప్రతీకాత్మక చిత్రం

మన శరీరంలో  ప్రతి అవయవానికి ఒక్కో అధిదేవత ఉంటాడు. బ్రహ్మ స్థానం నుదురు. బ్రహ్మ దేవుడి రంగు ఎరుపు. కాబట్టి బ్రహ్మ స్థానమైన నుదుటన ఎరుపు రంగు బొట్టు ధరించాలి. నుదుటన సూర్యకిరణాలు తాకరాదు. మనలోని జీవి జ్యోతి స్వరూపుడిగా భూమధ్యంలోని అజ్ఞాన చక్కంలో సుషుప్త దశలో హృదయ స్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు. కాబట్టి కుంకుమను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే ప్రశాంతత చేకూరుతుంది. మధ్యవేలుతో కుంకుమ పెట్టుకుంటే సమృద్ధి కలుగుతుంది. బొటనవేలితో ధరిస్తే శక్తి వస్తుంది. చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే భక్తి, ముక్తి కలుగుతాయి. ఎప్పుడైతే కుంకుమను నుదుటన పెట్టుకుంటారో వారు జ్ఞాన చక్రాన్ని పూజింజినట్టు అవుతుంది. కుంకుమ బొట్టు ధరించడం వల్ల పవిత్ర భావనలు కలుగుతాయి. 

ఇతరులకు బొట్టు ఎలా పెట్టాలంటే

మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో పెట్టుకోవాలి.

ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి. ఎందుకంటే మధ్య వేలితోగానీ, ఉంగరపు వేలితో గానీ పెడితే వారి కర్మలు మనకు వస్తాయి.

దేవతలకు కుంకుమ పెట్టెటప్పుడు ఉంగరపు వేలితో పెట్టాలి.

బొట్టు పెట్టుకోవటం వల్ల ఉపయోగాలివే..

కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల చక్కనైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నుదుటన పెట్టుకున్న కుంకుమబొట్టు మెదడుని ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది. నుదటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా, మానసికంగానూ చాలా ఉత్సాహంగా మారుస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్