శివ లింగాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి ఎందుకు దర్శనం చేసుకోవాలో తెలుసా..

శివుడి ఆలయాల్లో నందీశ్వరుడు కచ్చితంగా ఉంటాడు. నందీశ్వరుడి అనుమతి లేకుండా శివుడిని దర్శించుకోవడం వల్ల ఫలితం ఉండదని పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా నంది కొమ్ముల మధ్యలోంచి శివలింగాన్ని దర్శించుకోవాలని చెప్తుంటారు.

nandhi shivalingam

ప్రతీకాత్మక చిత్రం

శివుడి ఆలయాల్లో నందీశ్వరుడు కచ్చితంగా ఉంటాడు. నందీశ్వరుడి అనుమతి లేకుండా శివుడిని దర్శించుకోవడం వల్ల ఫలితం ఉండదని పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా నంది కొమ్ముల మధ్యలోంచి శివలింగాన్ని దర్శించుకోవాలని చెప్తుంటారు. మరి ఎందుకు నంది కొమ్ముల మధ్యలోంచి శివుడిని దర్శించుకోవాలి? అందులోని పరమార్థం ఏంటి? పైగా దర్శనం చేసుకొనేప్పుడు ఒక ప్రార్థన కూడా చెప్పుకోవాలట. ఆ వివరాలేంటో చూద్దాం.

శివుడి ఆలయాల్లో నందీశ్వరుడు ద్వార పాలకుడు. కాబట్టి శివుడి కంటే ముందు ద్వారపాలకుడైన నందీశ్వరుడిని దర్శించుకోవాలి. కోరికలు ఉంటే నంది చెవిలో చెప్తే శివుడికి చేరుతాయట. అందుకే నందీశ్వరుడికి అంత ప్రాముఖ్యత. శివుడి దర్శనం చేసుకొనేప్పుడు.. నంది కొమ్ములపై ఎడమ చేతిని ఉంచి, వెనుక భాగంలో కుడి చేతితో స్పృశిస్తూ దర్శనం చేసుకోవాలి. ఇలా దర్శనం చేసుకొనేప్పుడు భక్తుడు తన శిరస్సును వంచుతాడు. అంటే.. పరమేశ్వరునికి సర్వస్య శరణాగతి చేస్తూ, అహాన్ని, ఇహాన్ని వదిలి ఈశ్వరుడిని కోరడం అన్న మాట. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుడి ముందుకు వెళ్లకూడదట. ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు.

అలాగే.. శివుడిని దర్శనం చేసుకొనేప్పుడు.. ‘‘నందీశ్వర నమస్తుభ్యం.. శాంతానంద ప్రదాయక.. మహాదేవస్య సేవార్ధం..అనుజ్ఞామ్ దాతు మర్హసి’’ అన్న శ్లోకాన్ని పఠించాలి. ఇలా చేస్తే వేద పఠనం చేసినంత ఫలితం, సప్తకోటి మహామంత్ర జప ఫలితము లభిస్తాయని, పాప పరిహారం అవుతుందని పురాణాలు చెప్తున్నాయి. నంది చెవుల్లో కోరికలు చెప్పేటప్పుడు.. కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణలో ఉన్నది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్