కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం నవంబర్ 15న వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగించాలని పెద్దలు చెప్తుంటారు. అయితే, 365 వత్తులే ఎందుకు వెలిగించాలి? ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీకార్మక చిత్రం
కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం నవంబర్ 15న వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగించాలని పెద్దలు చెప్తుంటారు. అయితే, 365 వత్తులే ఎందుకు వెలిగించాలి? ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహం ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు కొన్ని దివ్య శక్తులు ఉంటాయి అని చెబుతున్నాయి. అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక శుక్రవారం నాడు కలిసి రావడం ఈ రోజు శుభకరం.
ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమిలో అన్ని రోజులు మీరు పూజా చేసుకోవడానికి వీలు కుదురుచుకోండి. అలాగే కార్తీకమాసం డిసెంబర్ 1న ముగుస్తుంది. ప్రతి మాసం లాగానే ఈ కార్తీకమాసంలో కూడా నాలుగు సోమవారాలు ఉంటాయి. ఈ కార్తీకమాసంలో మనం శివుడిని పూజిస్తాం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీకమాసం. అయితే ఈ కార్తీకమాసంలో పరమశివున్నే కాదు విష్ణుమూర్తినికూడా పూజించాలి. ఈ కార్తీకమాసంలో విష్ణుమూర్తి దామోదర రూపంలో పూజించాలి. శివ కేశవులకు భేదం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని కూడా మనం ఆరాధించాలి. అయితే ఈ కార్తీక మాసంలో ఎలా పూజా చేయాలి అనేది తెలుసుకుందాం.
ముందుగా ఈ కార్తీకమాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి. అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహుర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు ఈ కార్తీక స్నానం చేయాలి. ఈ కార్తీకమాసంలో ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. పురుషులు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయాలి. కార్తీక స్నానం ఆచరించిన తర్వాత ఇల్లు అంతటినీ శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి. అలాగే మీరు పూజ చేసే చోట తప్పకుండా బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. తర్వాత మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి, ఆ తరువాత ఇంటి ప్రధాన ద్వారం గడప దగ్గర రెండు దీపాలను వెలగించాలి.
ఆ తర్వాత తులసి కోట వద్ద ఒక దీపాన్ని వెలగించాలి. దీపారాధన సమయంలో నువ్వుల నూనె కానీ.. ఆవు నెయ్యి కానీ వాడితే చాలా శుభప్రదం. ఇవన్నీ కూడా మనం తెల్లవారకముందే అంటే సూర్యుడు ఉదయించక ముందే ఉదయం 6 లోపు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక, కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను ఎందుకు వెలిగించాలి అంటే మనం ప్రతి రోజు దేవునికి దీపారాధన చేయలేకపోతాం కాబట్టి ఆ రోజున 365 వత్తులు కలిగిస్తే 365 రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుంది అని పురాణాలు చెప్తున్నాయి.