శ్రావణమాసం...శివుడి మాసంగా భావిస్తారు. ఈ మాసంలో చాలా నియమాలను పాటిస్తుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ తినరు. దీని వెనక మతపరమైన కారణాలే కాదు..శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రం
ఇంకొన్ని రోజుల్లో శ్రావణమాసం ప్రారంభం అవుతుంది. ఈ నెలరోజులు భక్తులు శివుడి సేవలో నిమగ్నమవుతారు. దేశంలోని అన్ని శివాలయాల్లో భక్తుల రద్దీ ఉంటుంది. శ్రావణ సోమవారమే కాకుండా శ్రావణమాసం మొత్తం ఉపవాసం ఉ:టారు. ఈ నెల మొత్తం శివుని అనుగ్రహం లభించే విధంగా కొన్ని నియమాలను కూడా పాటిస్తారు. అయితే ఈ మాసంలో మాంసాహారం జోలికి వెళ్లరు. నెలపాటు మాంసాహారం నిషేధం. దీని వెనక మతపరమైన కారణాలు మాత్రమే కాదు..శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.
శ్రావణ మాసంలో తామసిక ఆహారాన్ని తినడం నిషిద్ధం. తామసిక్ ఆహారంలో వెల్లుల్లి, ఉల్లి, నాన్ వెజ్, బెండకాయ, పచ్చి కూరగాయలు తినడం నిషిద్ధం. ప్రజలు కూడా ఈ కఠినమైన నియమాలను పాటిస్తారు.అంతేకాదు చాలా మంది ఈ మాసంలో పాలు, పెరుగు కూడా తినరు. దీని వెనుక మత విశ్వాసాలే కాదు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.
నిజానికి శ్రావణ మాసంలో జోరుగా వర్షాలు కురుస్తాయి. మారుతున్న వాతావరణం శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో, ఒక వ్యక్తి జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల రోగాలు త్వరగా అంటుకుంటాయి. అటువంటి పరిస్థితిలో మాంసాహారం వంటి భారీ ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టంగా మారుతుంది. అది ప్రేగులకు అంటుకుని..జీర్ణం కాకుండా ఉంటుంది. దీని కారణంగా తీవ్రమైన వ్యాధులు వస్తాయి. వర్షాకాలం అనేక జీవులకు సంతానోత్పత్తి నెల. దీని కారణంగా వాటి శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో, మాంసాహారం తినడం మరింత ప్రమాదకరమే కాదు..ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో సాత్విక, తేలికైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.