ఏడు కొండల వేంకటేశ్వరస్వామికి శనివారం అంటే అత్యంత ప్రీతి. ఈ రోజు గోవింద నామస్మరణలతో, సుప్రభాత సేవలతో స్వామివారి అన్ని ఆలయాలు కిటకిటలాడుతాయి. అయితే, శనివారమే స్వామికి ఎందుకంత ప్రీతి.
ఏడు కొండల వేంకటేశ్వరస్వామికి శనివారం అంటే అత్యంత ప్రీతి. ఈ రోజు గోవింద నామస్మరణలతో, సుప్రభాత సేవలతో స్వామివారి అన్ని ఆలయాలు కిటకిటలాడుతాయి. అయితే, శనివారమే స్వామికి ఎందుకంత ప్రీతి. ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తే అనుగ్రహం ఏ స్థాయిలో కలుగుతుంది? వేంకటేశ్వరస్వామికి, శనివారానికి ఉన్న బంధం ఏమిటి? అంటే.. ఆధ్యాత్మిక పండితులు శనివారం గొప్పతనాన్ని, స్వామివారి ప్రీతికరమైన రోజు కావటానికి కారణాలను ఇలా వివరించారు.
- ఓంకారం ప్రభవించిన రోజు.. శనివారం
- శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించేవాళ్లకు శనిదేవుడు పీడించనని మాట ఇచ్చిన రోజు.. శనివారం
- వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు.. శనివారం
- తిరుమల ఆలయం నిర్మాణం చేయాలని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు.. శనివారం
- శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నదీ.. శనివారమే
- వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది.. శనివారమే
- అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం అని ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు.