తిరుమల వెంకన్నను వడ్డీ కాసుల వాడు అని ఎందుకు అంటారో తెలుసా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| తిరుమల వెంకన్న ||


కలియుగ దైవం ఏడుకొండల స్వామి, ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా.. గోవిందా.. ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా.. గోవిందా.. భక్తులు తమ కోర్కెలను తీర్చే వెంకటేశ్వర స్వామిని వెయ్యి పేర్లకు పైగా స్మరిస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల నమ్మకం. భక్తులు తమ ఆపదలను తీర్చేవాడని ఆపదమొక్కులవాడా అంటారు. కానీ, స్వామివారిని భక్తులు వడ్డీ కాసుల వాడు అని కూడా అంటారు అసలు స్వామివారికి ఆ పేరెలా వచ్చింది. 

అయితే ఏడుకొండలస్వామి పద్మావతి దేవిని వివాహమాడడానికి భూలోకానికి వచ్చాడు. ఆ సమయంలో స్వామివారి వివాహం చేసుకునేందుకు ఎక్కడ డబ్బు పుట్టలేదు. అయితే స్వామివారికి పెళ్లి అయ్యాక కుబేరుడు ధనం మొత్తం స్వామివారికి ఇచ్చాడు. ఆ ధానాన్ని తీసుకుంటూ స్వామివారు సంవత్సరంలోపు అప్పు చెల్లిస్తానని కుబేరునికి చెప్పగా, సంవత్సరం అయ్యాక స్వామివారికి వడ్డీ తీర్చేందుకు మాత్రమే డబ్బులు సమకూరాయి. కానీ, అసలు చెల్లించేందుకు డబ్బులు సమాకురలేదు. దీనితో కుబేరునికి స్వామివారు ఇచ్చే ధనం రోజు రోజుకు వడ్డీ రూపంలో పెరుగుతూనే ఉంది. అందుకనే స్వామివారిని వడ్డీ కాసుల వాడు అని కూడా భక్తులు స్మరిస్తూ ఉంటారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్