లక్ష్మీదేవి నివాసం ఉండే స్థానాలు ఇవే..

సిరిసంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. అమ్మ కరుణాకటాక్షాల కోసం ఎదురుచూడని వాళ్లు ఉండరు. ఆ తల్లి దృష్టి పడాలని ఎంతోమంది పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అయితే, లక్ష్మీదేవి ఏయే స్థానాల్లో నివాసం ఉంటుంది? అమ్మ ప్రీతి కోసం ఏం చేయాలి? అనేది తెలుసుకొంటే.. జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు.

goddess laxmi
లక్ష్మీదేవి

సిరిసంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. అమ్మ కరుణాకటాక్షాల కోసం ఎదురుచూడని వాళ్లు ఉండరు. ఆ తల్లి దృష్టి పడాలని ఎంతోమంది పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అయితే, లక్ష్మీదేవి ఏయే స్థానాల్లో నివాసం ఉంటుంది? అమ్మ ప్రీతి కోసం ఏం చేయాలి? అనేది తెలుసుకొంటే.. జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు.

- ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెప్పులు చిందరవందరగా పడేయవద్దు

- గడప లక్ష్మీ స్వరూపం. అందువల్ల గడపను తొక్కి ఇంట్లోకి రావటం, బయటకు వెళ్లడం, గడపకు అటో కాలు, ఇటో కాలు వేసి నిల్చోవటం వంటివి చేయకూడదు.

- పసుపు, కుంకుమలు ఉన్న గడపలు లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమతో అలంకరించాలి.

- ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చు.

- శుచి, శుభ్రత ఉన్న ఇంటికి లక్ష్మీ దేవి ఆలవాలం. అందువల్ల పనికిరాని, చెడిపోయిన వస్తువులు బయట పాడేయాలి.

- పాడైన గడియారాలు, విరిగిన అద్దాలు, చిరిగిన వస్త్రాలు ఇంట్లో ఉండకూడదు.

- ముగ్గువేసిన వాకిలి ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల తెల్లవారుజామునే వాకిలి ఉడ్చి ముగ్గు వేసుకోవాలి.

- ఇల్లాలు అరవకూడదు. నట్టింట్లో చెడు మాటలు మాట్లాడకూడదు. తిట్లు తిట్ల కూడదు.

- భార్యాభర్తలు నిత్యం కొట్టుకొనే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు.

- అబద్ధాలు చెప్పేవాళ్లు, ఇరు సంధ్యలలో తినేవారు, నిద్రించేవారుండే స్థానాల్లో లక్ష్మిదేవి ఉండదు.

- నిజం మాట్లాడుతూ, ధర్మానికి బద్ధులై ఉంటే లక్ష్మీ దేవి ప్రసన్నురాలు అవుతుంది.

- వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

- ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మీపూజ చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది.

- చిల్లర పైసలు, పువ్వులు, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు తల్లి అనుగ్రహాన్ని పొందలేరు.

గమనిక: ఈ సమాచారం ఆధ్యాత్మిక గురువుల ద్వారా సేకరించినది మాత్రమే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్