పగిలిన లేదా పాడైపోయిన దేవుడి ఫోటోలను ఏం చేయాలి?

ప్రతి ఇంటి పూజ గదిలో దేవుడి ఫోటోలు, విగ్రహలు ఉంటాయి. అనేక కారణాలతో ఫోటోలు పాడవడం లేదా వెలసి పోవడం, విగ్రహాలు పగిలిపోవడం లాంటివి జరుగుతుంటాయి మరి ఇలాంటి ఫోటోలను ఏం చేయాలి?

damaged god photos

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి ఇంటి పూజ గదిలో దేవుడి ఫోటోలు, విగ్రహలు ఉంటాయి. అనేక కారణాలతో ఫోటోలు పాడవడం లేదా వెలసి పోవడం, విగ్రహాలు పగిలిపోవడం లాంటివి జరుగుతుంటాయి మరి ఇలాంటి ఫోటోలను ఏం చేయాలి? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. కొంతమంది ఇలా పాడైన ఫోటోలను ఏదైనా గుడిలో ధ్వజ స్తంభం దగ్గర లేదా చెట్టు మొదట్లోనో పెట్టేస్తుంటారు. వద్దనుకున్న దేవీదేవతల విగ్రహలు, చిత్రపటాలను దేవాలయములో చెట్టు కింద పెట్టడం వల్ల అవి జీర్ణమై వాటికి అవమానం జరుగుతుంది. పాడైన ఫోటోలను, పనికి రాని ఫోటోలను ఇలా గుడిలో వదిలేయడం తప్పు. దేవుడి ఫోటోలను గౌరవించాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇంట్లో ప్రతి రోజు పూజించిన దేవుడి ఫొటోలను మర్యాద పూర్వకంగా మంచి నీటిలో అంటే ప్రవహించే నీటిలో విడిచి పెట్టాలి. మురికి కాలువల్లో కాకుండా ప్రవహిస్తున్న స్వచ్ఛమైన నీటిలో మాత్రమే దేవుడి ఫోటోలను విడిచి పెట్టాలి. ప్రవహించే నీరు అందుబాటులో లేనివారు ఫోటోకు నమస్కారం చేసుకొని అగ్నికి సమర్పించవచ్చు. కానీ ఎక్కడపడితే అక్కడ ఫోటోలను వదిలి పెట్టడం తప్పు. అగ్నినా దారుజం దగ్ధం క్షిప్తం శైలాదాకం జలే.. అంటే కట్టెతో తయారు చేసిన దేవతావిగ్రహలను అగ్నికి సమర్పించాలి. ధాతువుతో తయారు చేసిన మూర్తులను నీటిలో నిమజ్జనం చేయాలి. పగిలిన, పాడైన ఫోటోలకు పూజ చేయకూడదు. అలా చేస్తే ఇంటికి, కుటుంబానికి అరిష్టం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్