స్త్రీలు చేయకూడని పనులు ఇవే.. ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే.. సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఉండకూడదు. ఎట్టిపరిస్థితుల్లో రెండు చేతులతో తల గీరుకోరాదు. అయినదానికీ, కానిదానికీ కంట నీరు పెట్టుకోరాదు. ఏడిస్తే దరిద్రం.
స్త్రీలు చేయకూడని పనులు ఇవే.. ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే..
- సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఉండకూడదు.
- ఎట్టిపరిస్థితుల్లో రెండు చేతులతో తల గీరుకోరాదు.
- అయినదానికీ, కానిదానికీ కంట నీరు పెట్టుకోరాదు. ఏడిస్తే దరిద్రం.
- ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి, మరో ఆకులో వడ్డించకూడదు.
- ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు ఇచ్చి సత్కరించాలి.
- గర్భిణులు నిమ్మకాయ కోసి టెంకాయ పగులకొట్టరాదు. గుమ్మడికాయ కొట్టరాదు.
- సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయాలి. దానివల్ల లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్నా ఇంటి యజమానురాలు చేస్తే లక్ష్మి లోగిలిలోకి రావడానికి దోహదం చేస్తుంది.
- ఏ వస్తువైనా ఇంట్లో ఉంటే.. లేదు అనకుండా తీసుకురావాలి. లేకపోతే నిండుకుంది అనడం బెటర్. నాస్తినాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవుతారని అశ్వినీ దేవతలు, తథాస్తు దేవతలు పలుకుతారు.
గమనిక: ఈ సమాచారం పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం సేకరించినది మాత్రమే.