మహశివరాత్రి ప్రాముఖ్యత ఏంటి.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారంటే..

హిందువులు పరమ పవిత్రంగా జరుపుకునే ఉత్సవాల్లో మహాశివరాత్రి అతి పెద్దది, అలాగే ప్రముఖమైనది. సంవత్సరంలోకెల్లా వచ్చే అత్యంత చీకటి రాత్రిని – యోగ సంప్రదాయానికి మూలమైన ఆది గురువు లేదా మొదటి గురువైన శివుని అనుగ్రహం పొందే రోజుగా భావిస్తారు.

maha shivarathri

ప్రతీకాత్మక చిత్రం

హిందువులు పరమ పవిత్రంగా జరుపుకునే ఉత్సవాల్లో మహాశివరాత్రి అతి పెద్దది, అలాగే ప్రముఖమైనది. సంవత్సరంలోకెల్లా వచ్చే అత్యంత చీకటి రాత్రిని – యోగ సంప్రదాయానికి మూలమైన ఆది గురువు లేదా మొదటి గురువైన శివుని అనుగ్రహం పొందే రోజుగా భావిస్తారు. ఈరోజు రాత్రి ఏర్పడే గ్రహ స్థితులు కారణం చేత, మానవ వ్యవస్థలో సహజంగానే శక్తి ఊర్ధ్వముఖంగా కదులుతుంది. ఈ రోజు రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచి, జాగరణ చేయడం మన భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకి ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతి చాంద్రమాన మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజును శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి – మార్చిలో వచ్చే దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్థగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. ఈ రోజున ప్రకృతి ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికే, ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవార్లూ జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగాపైకి ఎగసి పడటానికి సహకరించవచ్చు.

హిందూ పురాణాల ప్రకారం, మహా శివరాత్రి అనేది శివుడు సృష్టి, సంరక్షణ, విధ్వంస విశ్వ నృత్యమైన తాండవాన్ని అమలు చేసిన రోజును గుర్తుచేస్తుంది. ఈ రోజున, శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రాత్రి ఇదేనని నమ్ముతారు. మహా శివరాత్రి అజ్ఞానం, చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. ఈ ప్రత్యేక సాయంత్రం శివుడు అజ్ఞానం, అహంకారానికి కారణమైన త్రిపురాసురుడిని జయించాడని నమ్ముతారు. మరికొందరు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా భావిస్తారు. కానీ సన్యాసులకు మాత్రం మహశివరాత్రి అనేది శివుడు కైలాస పర్వతంతో ఒక్కటైన రోజుగా భావిస్తారు. శివుడి పరిపూర్ణ నిశ్చలత్వంతో, పర్వతంలా అయిపోయాడు. యోగ సంప్రదాయంలో శివుడిని దేవుడిగా భావించరు, యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు. ఆ పరమ శివుని ఆశీస్సులు పొందడానికి, భక్తులు మహా శివరాత్రిని ఉపవాసం, ప్రార్థన, ధ్యానం చేసే రోజుగా జరుపుకుంటారు. శివాలయాలకు వెళ్లడం, ప్రార్థనలు చేయడం, ఆచారాలు పాటించడం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలను ఘనంగా నిర్వహిస్తారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్