చనిపోయినవారి నోట్లో తులసి దళాన్ని ఎందుకు ఉంచుతారంటే..

తులసి చెట్టు దగ్గర చాలా మంది ఉదయం, సాయంత్ర సమయంలో దీపం పెడుతుంటారు. ఇలా దీపం పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఎవరైన చనిపోతే ఆ వ్యక్తి నోట్లో కుటుంబ సభ్యులు ఒకటి లేదా రెండు తులసి ఆకులను ఉంచుతారు, ఇలా ఎందుకు చేస్తారు?

TULASI

ప్రతీకాత్మక చిత్రం

తులసి చెట్టు దగ్గర చాలా మంది ఉదయం, సాయంత్ర సమయంలో దీపం పెడుతుంటారు. ఇలా దీపం పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఎవరైన చనిపోతే ఆ వ్యక్తి నోట్లో కుటుంబ సభ్యులు ఒకటి లేదా రెండు తులసి ఆకులను ఉంచుతారు, ఇలా ఎందుకు చేస్తారు? ప్రతికూల శక్తులకు, తులసి మొక్కకు సంబంధం ఏంటి? తులసి దేవి తులసి మొక్కగా ఎలా మారింది? ఈ భూలోకంలో ఎందుకు ఉంది? తులసి దేవి విష్ణుమూర్తిని ఏమని శపించింది? అనే విషయాలను తెలుసుకుందాం. తులసి ప్రాముఖ్యాన్ని అనేక గ్రంథాలలో, కథలలో పేర్కొన్నారు.  స్కాంద మహపురాణం, శ్రీ మహపురాణము, శ్రీ మద్దేవి భాగవతము ప్రకారం తులసి మొక్కను ఎలా పూజించాలి, దీని వల్ల కలిగే ఫలితాల గురించి వివరించాయి. ఇప్పుడు మనం శ్రీ మద్దేవి భగవతము తొమ్మిదవ స్కంధంలో నుంచి తులసి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. 

తులసి మొక్క ముందు సాయంత్రం వేళ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వెనక ఉన్న కథ ఏంటి? అంటే కొన్ని వేళ సంవత్సరాల క్రితం ఒక ఋషిని పెళ్లి చేసుకున్న స్త్రీ.. తన చర్యల ద్వారా అపవిత్రురాలుగా మిగిలిపోయింది. ఆమె ప్రవర్తన, మర్యాద భర్తకి ఎప్పటికీ నచ్చలేదు. దీంతో ఆమె అడవుల పాలయింది. విపరీతమైన ఆనారోగ్యానికి గురయింది. ఆమెను చూసుకోవడానికి ఎవరు లేరు. అప్పుడు ఆవిడే ఇద్దరు స్త్రీలతో కలిసి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. అలా నివసించేటప్పుడు ఇతర స్త్రీలు పాటించే ఏ ఆచారాన్నీ ఆమె పాటించలేదు. కానీ ఒక రోజు కొందరు స్త్రీలు తులసి మొక్క ముందు దీపారాధన చేయడం చూసింది. ఆ సాయంత్రం వేళ ఆవిడ కూడా తులసి మొక్క ముండు దీపం పెట్టింది. దురదృష్టవశాత్తు అదే రోజు ఆమె ఆనారోగ్య సమస్యతో చనిపోయింది. ఆమెను తీసుకుపోవడానికి యమభటులు వస్తే ఆమె నరకానికి వెళ్లదని వైకుంటానికి వస్తుందని చెప్తారు. అందుకు కారణం మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన తులసి కోట దగ్గర దీపం పెట్టడం వల్ల ఆమెకు సర్వపాపాలు తొలగిపోయి స్వర్గ లోకానికి ప్రవేశం లభించిందని చెబుతారు. అందుకే తులసి మొక్క ముందు దీపం వెలిగించడం మంచిది అని అంటారు. 

దీపం ప్రాముఖ్యత:

హిందూ ఆచారాల ప్రకారం దీపం వెలిగించడం ఒక ముఖ్యమైన ఆచారం. చీకటిపై క్రాంతి, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయానికి చిహ్నంగా దీపాన్ని వెలిగిస్తారు. అంటే చీకటి అజ్ఞానంలో నిండిన ప్రదేశంలో వెలుగును తీసుకురావటం ఉద్దేశంగా దీపాన్ని వెలిగిస్తారు. ఇది దైవానికి నైవేధ్యం లాంటిది. ఎలాంటి ప్రతికూల శక్తులను మన దగ్గరకు రానివ్వకుండా కాపాడుతుంది. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం  వల్ల వ్యక్తి తన పూర్వ పాపాల నుండి విముక్తుడు అవుతాడు. విష్ణువు నివాసం అయిన వైకుంఠంలోకి చేరుకుంటాడు. అలాగే ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి నోట్లో కుటుంబసభ్యులు తులసి దళం ఉంచుతారు. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మరణించిన వ్యక్తి స్వర్గానికి చేరుకునేందుకు సహయపడుతుందని, ఆత్మ మోక్షాన్ని పొంది విష్ణువు నివాసానికి చేరుకునేందుకు సహయపడుతుందని విశ్వసిస్తారు. తులసి పవిత్రమైనది, ఆత్మను శుద్ధి చేస్తుందనే నమ్మకం ఉంటుంది.

తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల ప్రయోజనాలు:

తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల లక్ష్మీవి, విష్ణుమూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయి. సంపద, శ్రేయస్సుగా భావించే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండి ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. అలాగే విష్ణుమూర్తి సమృద్ధికుడిగా కుటుంబాన్ని కాపాడుతూ వస్తాడు. దీపం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. శక్తివంతమైన ప్రకాశాన్ని ఆధ్యాత్మిక స్వచ్ఛతను తను సృష్టిస్తుందని నమ్ముతారు. దీపం వెలగించడం వల్ల శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక స్వచ్ఛత లభిస్తుంది. సానూకుల శక్తులను ఆహ్మనిస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్