హిందువుల అన్ని పండగల కన్నా గురు పౌర్ణమికి ప్రత్యేకత ఉంటుంది. ఆషాడమాసం శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. మనకు జ్నానాన్ని ప్రసాదించి జీవితాన్ని ముందుకు నడిపించడంలో సాయపడిన ప్రతి గురువుకు మనం కృతజ్ఞతగా చెప్పుకోవడమే గురుపౌర్ణమి ముఖ్య ఉద్దేశ్యం.
ప్రతీకాత్మక చిత్రం
హిందువుల అన్ని పండగల కన్నా గురు పౌర్ణమికి ప్రత్యేకత ఉంటుంది. ఆషాడమాసం శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. మనకు జ్నానాన్ని ప్రసాదించి జీవితాన్ని ముందుకు నడిపించడంలో సాయపడిన ప్రతి గురువుకు మనం కృతజ్ఞతగా చెప్పుకోవడమే గురుపౌర్ణమి ముఖ్య ఉద్దేశ్యం. అందుకే ఈ రోజును ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ గురువులను పూజిస్తుంటారు.
మనిషి తల్లి కడుపులోనే అన్నీ నేర్చుకుని బయటకురాడు. బయటకు వచ్చాక ఎదుటివాళ్లనుచూసి ఎన్నో నేర్చుకుంటాడు. పొద్దున నుంచి రాత్రి వరకు ఎవరో ఒకరు మనకు ఏదొక విధంగా సాయం చేస్తూనే ఉంటారు. అది మాటా సాయం కావొచ్చు..పని కావొచ్చు..ఎవరి సహాయం లేకుండా మనిషి బతకడం సాధ్యమా? అందుకే పుట్టుగానే అమ్మానాన్నలతో పెద్దయ్యాక జీవితం భాగస్వామితో, ముసలితనం వచ్చాక పిల్లలతో గడుపుతారు.
గురువు అంటే ?
సంస్క్రుతంలో గు అనే శబ్దానికి చీకటి అని అర్థం వస్తుంది. రు అంటే నాశనం చేసే తేజస్సు. అజ్నానం అనే చీకటిని తొలగించి జ్నానం అనే వెలుగును ప్రసాదించేవాడే గురువని అర్థం. మన గమ్యానికి దారి చూపించేవాడే గురువు. మనకు తెలియని విషయాలను చెబుతూ..అజ్నానాన్ని తొలగించే రూపంతో ఉండాలని లేదు. గురువు రూపాతీతం. మాటలు అమ్మ నేర్పితే..నడకలు నాన్న నేర్పుతాడు. చదువు, జ్నానాన్ని బడిలో గురువు పంచుతాడు. ఈ జీవితాన్ని ఏ దారిలో నడిపించాలి..ఏదారిలో ఏముంటాయ్..ఎటువైపు, ఎలా నడవాలి అని చెప్పి ముందుకు నడిపించడం గురువుకే సాధ్యం.
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురువే మహేశ్వరుడు. గురు సాక్షాత్తు పరబ్రహ్మ. అలాంటి గురువుకు నమస్కరిస్తున్నాను అర్థం. గురువులకు మన సంస్క్రుతి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ఈ శ్లోకం చెబుతుంది. కేవలం మనకు చదువు చెప్పేవాళ్లే గురువులు కాదు. జ్నానాన్ని ప్రసాదించే వాళ్లెవరైనా మనకు గురువు సమానం. ఒక గొప్ప గురువు తన శిష్యునికి ఎంత ప్రశాంతత లభిస్తుందో ఆ గమ్యానికి దారి చూపిస్తాడు. దాని కోసం ఆయన దగ్గరున్న జ్నానాన్ని పంచుతుంటాడు. కష్టకాలంలో కన్నీరు మున్నీరవుతూ ఆయన కాళ్ల దగ్గరకు చేరితే తప్పకుండా ఏదొక దారి చూపిస్తాడని ఇస్తుందో ఈ శ్లోకం చెబుతుంది.