గాయత్రీ దేవి ఎవరు? గాయత్రి మంత్రంలో ఎంతమంది దేవతల శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి? గాయత్రీ మంత్రాక్షరాలు అంత శక్తివంతమా? ఈ సందేహాలకు సరైన సమాధానం దొరికింది.
గాయత్రీ దేవి
ఈవార్తలు, డెవోషనల్ న్యూస్: గాయత్రీ దేవి ఎవరు? గాయత్రి మంత్రంలో ఎంతమంది దేవతల శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి? గాయత్రీ మంత్రాక్షరాలు అంత శక్తివంతమా? ఈ సందేహాలకు సరైన సమాధానం దొరికింది. ఇలాంటి ప్రశ్నలే వశిష్ట మహర్షికి రావటంతో బ్రహ్మ దగ్గరికి వెళ్లి అడిగాడు. గాయత్రీ దేవి నుంచి సావిత్రి.. సావిత్రి నుంచి వేదాలు.. వేదాల నుంచి సమస్త క్రియలు వచ్చాయని బ్రహ్మ తెలియజేశాడు. అంటే.. వేదానికి మూలం గాయత్రీ దేవీ అని స్పష్టం అవుతోంది. అందుకే బ్రాహ్మణులకు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించేప్పుడు చాలా నిష్టతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు.
గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
గాయత్రీ మంత్ర ఫలితాలు
త్రికాలాల్లో గాయత్రీ మంత్రాన్ని జపిస్తే ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధిస్తాం. ఏ పనిలో ఉన్నా కాసేపు ఆపి, చెప్పులు తీసేసి ఈ మంత్ర జపం చేయొచ్చు. శివుడు బ్రహ్మానందంలో తన ఢమరుకం ద్వారా చేసిన 24 ధ్వనులే గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు.
గాయత్రి మంత్రంలో 24 దేవతలు.. వారి శక్తులు
1. వినాయకుడు (తత్)
2. నృసింహ స్వామి (స)
3. విష్ణుమూర్తి (వి)
4. ఈశ్వరుడు (తు)
5. శ్రీకృష్ణుడు (వ)
6. రాధాదేవి (రే)
7. లక్ష్మీదేవి (ణి)
8. అగ్నిదేవుడు (యం)
9. ఇంద్రుడు (భ)
10. సరస్వతి (గో)
11. దుర్గాదేవి (దే)
12. ఆంజనేయుడు (వ)
13. భూదేవి (స్య)
14. సూర్య భగవానుడు (ధీ)
15. శ్రీరాముడు (మ)
16. సీతాదేవి (హి)
17. చంద్రుడు (ధి)
18. యముడు (యో)
19. బ్రహ్మ (యో)
20. వరుణుడు (న: )
21. నారాయణుడు (ప్ర)
22. హయగ్రీవుడు (చో)
23. హంస (ద)
24. తులసీమాత (యత్)