దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బ్రేక్ దర్శనం ప్రారంభించారు.
వేములవాడ రాజన్న దేవాలయం
వేములవాడ, ఈవార్తలు : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బ్రేక్ దర్శనం ప్రారంభించారు. ఈ మేరకు ఆలయ ఈవో ప్రెస్‌నోట్ విడుదల చేశారు. భక్తుల సౌకర్యార్థం సోమవారం నుంచి బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బ్రేక్ దర్శనం కావాలనుకునే భక్తులు ఒక్కరికి రూ.300 రుసుం చెల్లించాలని తెలిపారు. ఉదయం 10.15 గంటల నుంచి 11.15 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. శ్రావణ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వేములవాడకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తారు. మొక్కులు చెల్లించుకొని, రాజన్నను కొలుస్తారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా దర్శనం కావాలనుకునే భక్తులకు బ్రేక్ దర్శనం సౌలభ్యంగా ఉంటుందని ఈవో పేర్కొన్నారు.