సనాతన ధర్మంలో దేవీ దేవతలను క్రమం తప్పకుండా ఆరాధించడం చాలా ముఖ్యమైనది. అందువల్ల, ప్రతి ఇంటిలోనూ పూజ గది ఉంటుంది. సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో ప్రతి ఉదయం, సాయంత్రం దేవుళ్ల చిత్రపటాలను పూజించడం ఆనవాయితీ.
సనాతన ధర్మంలో దేవీ దేవతలను క్రమం తప్పకుండా ఆరాధించడం చాలా ముఖ్యమైనది. అందువల్ల, ప్రతి ఇంటిలోనూ పూజ గది ఉంటుంది. సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో ప్రతి ఉదయం, సాయంత్రం దేవుళ్ల చిత్రపటాలను పూజించడం ఆనవాయితీ. శాస్త్ర ప్రకారం, పూజగదికి సంబంధించి కొన్ని నియమాలు పాటించాలి. దీని ప్రకారం, దేవత దిశ, స్థానం, విగ్రహాలు లేదా చిత్రాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శాస్త్రం ప్రకారం, ఆలయంలో కొన్ని దేవతల విగ్రహాలను ఇంట్లో ఉంచడం నిషిద్ధంగా పరిగణిస్తారు. ఈ దేవతల విగ్రహాలను పూజగదిలో ఉంచడం వల్ల ఇంట్లో కలహాలు ఏర్పడి జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. పూజగదిలో ఏయే దేవతా మూర్తులను ఉంచకూడదో తెలుసుకుందాం.
ఈ దేవతల విగ్రహాలను ఇంట్లో పెట్టకూడదు
నటరాజ: పరమశివుడి నటరాజ రూపం చాలా మనోహరమైనది. నటరాజ విగ్రహం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయినా కూడా నటరాజ విగ్రహాన్ని ఇంటికి తీసుకురాకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం నటరాజ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం అశుభం. నటరాజ స్వామి శివుని ఉగ్ర రూపం, అంటే కోపంతో ఉన్న స్థితి. అలాంటి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఇంట్లో శాంతి పోతుంది ఇంట్లో గొడవలు ఏర్పడతాయి.
కాలభైరవుడు : ధర్మశాస్త్రం ప్రకారం, కాలభైరవుడు దేవతల దేవుడైన మహాదేవుడి ఐదవ అవతారంగా పూజిస్తారు. కాలభైరవుడిని పూజించడం ద్వారా మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే కాలభైరవుడిని ఆలయంలోనే పూజించాలి. కాలభైరవ విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురాకూడదు. ఈ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించకూడదు. భైరవుడు తంత్ర-మంత్ర దేవుడు, అతన్ని ఇంటి లోపల కాకుండా బయట కాలభైరవ ఆలయంలో పూజించాలి.
శని: నవగ్రహాలలో శని చాలా శక్తివంతమైన గ్రహం. శనికి దేవుడి హోదా ఉంది. శని వక్రత దృష్ట్యా ఒక వ్యక్తి జీవితంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి శనిదేవుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. మీరు శనిని పూజించాలనుకుంటే, మీ ఇంటి బయట ఉన్న గుడికి వెళ్లి శని పూజ చేయండి. కానీ, శని విగ్రహాన్ని దేవుడి ఇంట్లో ప్రతిష్టించకండి.
రాహు-కేతువులు : మత విశ్వాసాల ప్రకారం, శని వంటి రాహు-కేతువుల విగ్రహాలను ఇంట్లోకి తీసుకురాకూడదు. ఎందుకంటే శని, రాహువు కేతువు మూడు దుష్ట గ్రహాలు. ఈ మూడు గ్రహాలను పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయనేది నిజమే అయినప్పటికీ, రాహువు కేతువులను ఇంట్లో పూజగదిలో ఉంచవద్దు. ఇలా చేస్తే ఇంట్లో నెగెటివిటీ ఏర్పడి ఇంట్లో అనేక రకాల సమస్యలు ఏర్పడి మనిషి జీవితం కష్టతరమవుతుంది.