మీ పిల్లలు చదువులో రాణించాలంటే..ఇంట్లో స్టడీ రూం విషయంలో పాటించాల్సిన వాస్తు ఇదే..

వాస్తు అనేది మన జీవితంలో అనేక మార్పులు రావడానికి కారణం అవుతుంది. మన శరీరానికి ఆయుర్వేదం ఎంత అవసరమో. మన ఇంటికి వాస్తు శాస్త్రం కూడా అంతే అవసరమని పెద్దలు చెబుతున్నారు.

vastu tips

ప్రతీకాత్మక చిత్రం 

వాస్తు అనేది మన జీవితంలో అనేక మార్పులు రావడానికి కారణం అవుతుంది.  మన శరీరానికి ఆయుర్వేదం ఎంత అవసరమో.  మన ఇంటికి వాస్తు శాస్త్రం కూడా అంతే అవసరమని పెద్దలు చెబుతున్నారు.  అందుకే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకొని ఆ ఇంట్లో ఉన్నట్లయితే మీకు సకల సౌకర్యాలు లభిస్తాయి అని పెద్దలు చెబుతుంటారు.  అయితే ప్రస్తుతం వాస్తు శాస్త్రం ప్రకారం  మీ పిల్లలు సరిగ్గా చదువుకోవాలంటే వారి స్టడీ రూమ్  ఏర్పాటు చేసుకుంటే  మంచిగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  చదువుకునే పిల్లలు  ప్రతి ఇంట్లో ఉంటారు అయితే కొంతమంది పిల్లలు చురుగ్గా ఉంటారు వారికి చదువుకోమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు. 

పాఠశాలలో చెప్పిన పాఠాలను ఇంటికి వచ్చి రివిజన్ చేసుకొని పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తూ ఉంటారు.  మరి కొంతమంది పిల్లలు తరగతి గదిలో చెప్పిన పాఠాలు సరిగ్గా అర్థం అవ్వక,  చదువులో వెనుక పడుతూ ఉంటారు.  అంతేకాదు చెడు స్నేహాలు,  సహవాస దోషాల వల్ల కూడా  పిల్లలు సరిగ్గా చదువుకోరు.  దీంతోపాటు ఇంట్లో ప్రశాంతత లోపించడం వల్ల కూడా పిల్లలు సరైన చదువు చదవలేకుండా అవుతున్నారు.  ఈ నేపథ్యంలో వాస్తు రీత్యా కొన్ని మార్పులు చేసినట్లయితే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహించి,  మీరు చదువులో ముందుకు వెళతారు. 

స్టడీ రూం ఏర్పాటుకు సరైన దిశ:

వాస్తు ప్రకారం, స్టడీ రూమ్‌కి దిశ చాలా ముఖ్యం. దీని ప్రకారం, పిల్లల చదువు గది నైరుతి మూలలో ,  పశ్చిమ దిశలో ఉండాలి. ఈ దిక్కు స్టడీ రూమ్‌కి చాలా శుభప్రదమైనది ,  పిల్లలను చదువుపై ఏకాగ్రత పెట్టేలా చేస్తుంది.

కిటికీలు:

ఇంట్లో స్టడీ రూమ్ కిటికీలు ఉత్తరం లేదా తూర్పు దిక్కుగా ఉండాలి. తద్వారా వెలుతురు,  పాజిటివ్ ఎనర్జీ సమృద్ధిగా ఈ గదిలోకి ప్రవేశించవచ్చు.

తలుపులు:

స్టడీ రూమ్ తలుపు తూర్పు, ఉత్తరం లేదా పడమర వైపు ఉండాలి. దీనితో పాటు ఈశాన్య మూలలో సరస్వతి మాత చిత్రపటాన్ని ఉంచాలి. ఎందుకంటే మాతా సరస్వతి జ్ఞానానికి, కళకు ,  సంగీతానికి దేవత. స్టడీ రూమ్‌లో చదువుతున్నప్పుడు, మీ ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలని గుర్తుంచుకోండి.

స్టడీ గది రంగు:

వాస్తుశాస్త్రంలో కూడా రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి స్టడీ రూం రంగు పసుపు, కుంకుమ లేదా ఆకుపచ్చ రంగులో ఉండాలి. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ని స్టడీ రూమ్‌కి ఆగ్నేయ మూలలో ఉంచండి. దానికి ఇదే సరైన స్థలం


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్