వారాహి అమ్మవారికి పూజ ఎలా చేయాలి. వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
వారాహి అంటే..భూదేవి అని అర్థం. హిరణ్యాక్షుడు భూదేవిని జలాలలో తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహంలో భూమిపై అవతరించాడు. రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామిమీద ఉన్న ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని..అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో ఉంది.వారాహి అమ్మవారు అంటే..ఎవరో కాదు శ్రీ మహాలక్ష్మీ స్వరూపం శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ద్రవ అనే నామం ఉంటుంది. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన విధంగా వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా పేర్కొన్నారు.
అవి పంచమి, సమయ సంకేత, దండనాథా, వారాహీ, సంకేతా, పోత్రిణి, శివా, మహాసేన, వార్తాళి, అరిఘ్ని ఆజ్ఞా చక్రేశ్వరి అనే 12 నామాలుగా పిలుస్తుంటారు. ఈ 12 నామాలను ప్రతిరోజూ 11 సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
వారాహి దేవి అమ్మవారి పూజా విధానం:
ఎన్ని పూజలు పరిహారాలు చేసినా.. కోరికలు తీరడం లేదు అనుకునేవారు 3 అక్షరాల బీజ మంత్రాన్ని అనుకోని చూడండి. 10 నిమిషాల్లో తీరుతుంది. లక్ష్మీ స్వరూపమైన వారాహి దేవి పై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి. ఐమ్ క్లీమ్ సౌ అనే మంత్రాన్ని 11 సార్లు, 21సార్లు.. ఎన్నిసార్లైనా జపించవచ్చు ఇలా జపించడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పండితులు చెబుతున్నారు. ఏదో ఒక రూపంలో మీ సమస్య సమసిపోతుంది.
వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం 6 నుంచి 9 లోపు పూజ చేయాలి. పూజ కోసం అమ్మవారి చిత్ర పటం, గంధం, పూలు, సాంబ్రాణి దూపం ఉండాలి. బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి దూపం వేయాలి. అగరబత్తులు వెలిగించకూడదు. అమ్మవారికి మహాదీపంతో పాటు చిన్న దీపం కూడా వెలిగించాలి. నైవేద్యంగా నల్లబెల్లం రెండు లవంగాలు పెట్టాలి. సింధూరం కలిపిన అక్షింతలు వేస్తూ..పూజ చేయాలి. అమ్మవారికి శుక్రవారం అష్టమి తిధి కలిసి వచ్చిన రోజు 6గంటల నుంచి 10 గంటలు లోపు దీపం, ధూపం నైవేద్యం భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకొని 3 లవంగాలు అరచేతిలో తీసుకొని ఈ మంత్రాన్ని 26 సార్లు అనుకోండి.
మీరు ఏమి కోరుకుంటే వెంటనే తీరుతుంది. నర దిష్టి, చెడు దిష్టి పోవాలంటే శుక్రవారం రోజు అష్టమి తిధి పంచమి నాడు అమ్మవారిని పూజించాలి. ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు.. శుక్ర గోరల్లో ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాట ఉండదు.