Vrushabha Rasi | ఉగాది వృషభ రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

Vrushabha Rasi | ఉగాది వృషభ రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

vrushabha rasi

వృషభ రాశి

వృషభ రాశి:

కృత్తిక 2, 3, 4, పాదములు (ఈ,ఊ,ఏ)

రోహిణి 1, 2, 3, 4 పాదములు (ఓ,వా,వీ, వూ)

మృగశిర 1,2 పాదములు (వే,వో)

ఆదాయము -11, వ్యయం-5, పూజ్యత-1,అవమానం-2

గ్రహ సంచారం:

గురువు : ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశియందు, తదుపరి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిధున రాశియందు సంచారము. విశ్వావసు నామ సం॥ర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచార చేయును. శని - ఈ సం॥ నుండి 28-03-2025 వరకు కుంభరాశియందు 29-3-2025 నుండి మీనరాశియందు సంచారము చేయును.

రాహువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు మీనరాశియందు 18-5-2025 నుండి కుంభరాశియందు సంచారము.

కేతువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యారాశియందు 18-5-2025 ను సింహరాశి యందు సంచారము చేయును.

అదృష్టం : కృత్తికా నక్షత్ర జాతకులు కెంపునూ, రోహిణి నక్షత్ర జాతకులు ముత్యమును మృగశిర నక్షత్ర జాతకులు పగడమునూ ధరించవలయును. ఈ రాశి వారలకు 1-2-5-6-9 సంఖ్యలు గల రోజులందు ధనప్రాప్తి యోగము. సోమ, బుధ, శుక్ర, శని వారములం ప్రయాణములు కార్యానుకూలములు. స్టార్ నెంబరు 6.

నక్షత్రఫలము: కృత్తిక నక్షత్ర 2,3,4 పాదముల వారికి వృత్తి ఉద్యోగ సమస్యలు, కొన్ని ఇబ్బందులు, ధనప్రాప్తి, రోహిణి నక్షత్ర జాతకులకు వృత్తియందు మిశ్రమ ఆదాయమ కార్యములు పూర్తి, ఉద్యోగప్రాప్తి, మృగశిర నక్షత్ర 1,2 పాదముల వారికి పిల్లల సమస్య పూర్తి ధార్మికచింతన, సామాన్య ధనము. రాశివారికి మే, జూలై, నవంబరు, డిశెంబర్ జనవరి, మార్చి నెలలందు ధనప్రాప్తి యోగము. 3,4, 5 తేదీలు బుధ, శుక్ర, శనివారములు ప్రయాణములు, ధనయోగము.

నెలల వారీగా ఫలితాలు

ఏప్రిల్ : ఈనెల ధనలాభము, నూతన కార్య ప్రాప్తి, సౌఖ్యము, ఇంటి యందుపిల్లల ఆరోగ్య స్థితి మెరు మెరుడుపడును. మాస మధ్య గ్రామదేవత పూజలు మంచివి. స్త్రీల వేధింపు చర్యగా చేయవద్దు. దురాశకు వెళ్ళక ఆనందంతో జీవనం గడుపుట మంచిది బుధవారము లందు బుధుని పచ్చ పూలతో ఆర్చన, పూజలు చేసిన ఆరోగ్యము, వ్యాపారాభివృద్ధి, ధనప్రాప్తి కలుగును.

మే : ఈ నెల యందు ప్రోత్సహించే బంధువులు మీ వెంట వుంటారు. ధనాదాయము బాగుగా యుండును. మున్నగు వ్యవహారములు కొంచెం చైతన్యము నిచ్చున దైవానుగ్రహము సంపూర్తిగా యుండును. పూజల యందు శ్రద్ధ అవసరము. వైరములకు దూరంగా యుండుట మంచిది. ఆదివారములందు సుబ్రహ్మణ్య స్వామివారి పూజలు చేయుట వలన శతృదోషములు తొలగి, ఆరోగ్యము బాగుగా యుండును.

జూన్ : ఈ నెల ఆర్ధిక లావాదేవీలు అధిక ఉత్తేజాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారములు అనుకూలము. ప్రయాణాలలో దుస్సంఘటనలు జరుగ వచ్చును. మిత్ర ద్రోహము సంభవించును. కొత్త వ్యాపారాలు నిలకడ లాభాన్నిస్తాయి. సోమవారములందు ఈశ్వర అభిషేకములు, పూజలు చేయుట మంచిది. శుక్రవారములందు సరస్వతీ పూజ చేసి, పప్పు, బెల్లం ప్రసాద వితరణ చేసిన పిల్లలకు చదువులు బాగుగా వచ్చును. కుటుంబ వ్యాపారము ధనయోగముగా ఉండును.

జూలై : ఈ నెల ఉద్యోగ సమస్యలు ఆలోచించగలరు. క్రీడారంగ విషయ చర్చలు. బంధువుల నుంచి ఇబ్బందులు రావచ్చును. వృత్తి, వ్యాపార ఉద్యోగ రాజకీయాలందు తగిన గౌరవములు, ధనాదాయము, కొన్ని నిందారోపణలు కలుగును శనివారములందు రావి, వేప చెట్టులు కలిసిన అశ్వత నారాయణ చెట్టునకు ప్రధక్షిణములు చేసి, చీరలు చెట్టునకు కటినచో గర్భ దోషములు తొలగును. సంతాన యోగము కలుగును. వృధులకు దారిద్య్రం కష్టములు తొలగును.

ఆగస్టు : ఈనెల స్త్రీలు, యువతి యువకులు రాణించలేరు. స్త్రీలకు అవమానములు వస్తాయి. పురుషులతో వైరములు మంచివి కావు. ధార్మిక చింతనలు మంచివి. ప్రయాణములు ధన వ్యయము, చికాకులతో బాధలు పొందుతారు. అనవసరపు మాటలు ఉద్యోగ, వ్యాపారాల్లో వస్తాయి. గురువారం గురుగ్రహపూజలు, శనగలు బెల్లంతో తయారు చేసిన. గ్రహబాధలు తొలిగి వ్యాపారములు లాభ దాయకంగా ఉండును.

సెప్టెంబర్ : ఈనెల అవమానములు అధికము. ఇంటి బయటా ధనముతో జాగ్రత వహించాలి. స్త్రీలను నమ్మి తొందరపడి బాధ్యతలు అప్పగించవద్దు. ముందు వెనక ఆలోచనలు శుభములు ఇస్తాయి. ఉద్యోగ వ్యాపార, రాజకీయ రంగాల్లో అవకతవకలు. జాగ్రత అవసరము. మారేడు వృక్షము వద్ద కాల భైరవ పూజలు చేసి, ప్రసాద వితరణ చేసిన అనేక దోషములు తొలగి ఆరోగ్యవంతులై విరాజిల్లేదరు.

అక్టోబర్ : ఈనెల ప్రముఖుల పరిచయాలు ధనలాభాన్నిస్తాయి. చేయు వృత్తియందు పెట్టిబడులు వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. భాగస్వామ్యత్వము కొంత చురుగ్గా ఉంటుంది. పెద్దల సాహచర్యములు రాణించును. శ్రీకాళహస్తిలో రాహు, కేతువుల పూజలు చేయుట మంచిది. అన్ని వృత్తుల వారికి ధనాదాయము. శ్రీకాకుళం, అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామివారిని దర్శించి మ్రొక్కులు తీర్చి పూజలు చేసిన ఆరోగ్య సమస్యలు తొలగును.

నవంబర్ : ఈనెల విద్యార్థులు శక్తి వంచన లేకుండా శ్రమించిన, పరీక్షలు ఉత్తీర్ణత దిశగా పయనించును. మీ యందు ఆత్మ విశ్వాసము పెరుగుట మంచిది. ఉన్నత వర్గము నుండి ధన సహాయము లభించును. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ రంగముల వారికి శ్రమకు తగిన ఆదాయము లభించును. "సోమవారములందు ఈశ్వర అభిషేకములు, నిమ్మకాయల దండ, ఎర్రని పూలతో కాలభైరవ పూజలు చేసి, ప్రసాదము నివేదన చేసిన సకల సమస్యలు తీరును.

డిసెంబర్ : ఈనెల సీరాస్తులకు సంబంధించిన వ్యవహారములు అధికము. భూములకు సంభందించి వివాదములు వచ్చును. రాజకీయపరమగు బాధలు, కోర్టు వ్యవహారములందు జాగ్రత్త అవసరము. వృత్తి, ఉద్యోగ, విద్యార్థులందు దుర్బలత్వ మనస్సుతో సంచరించెదరు. మాసాంతము సర్వజనులు ఆనందముతో నుండి ఆరోగ్యము అను కూలముగా యుందురు. ఆదివారములందు గోవులకు పూజలు చేసిన పిల్లల విషయములు అను కూలం, వివాహ, చదువు, ఉద్యోగ కార్యసిద్ధులు కలుగును.

జనవరి : ఈ నెల అన్ని రంగములందునూ అధిక శ్రమముఖ్యము. పిల్లల పట్ట శ్రద్ద కల్గి ప్రవర్తించ వలెను. అన్నదమ్ముల ఆరోగ్య స్థితి ఆలోచలనలు కల్గించును. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు ములందు ధనాదాయములు సామాన్యము. శనివారములందు శుక్రగ్రహము పూజలు, దానములు అయ్యప్పస్వామి దర్శనము పూజలు మంచి ఫలితాలను అందించును. మానసిక ప్రశాంతత చేకూరును.

ఫిబ్రవరి : ఈ నెల తీవ్ర ఆలోచనలు, ధనరాబడి, సంచార ప్రయాసలు, భార్య బంధు సమస్యలు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగములందు రాణింపు ధనాదాయములు. దార్మిక చింతన, ఆదాయ పెంపు, నూతన గృహవాహన యోగాది శుభములు. అన్నవరం సత్యనారాయణ స్వామివారి వ్రతం, దర్శనము వలన సమస్యలు తీరి, కుటుంబవృద్ధి,ధన ప్రాప్తి కలుగును.

మార్చి : ఈ నెల కోర్టు వ్యవహార పరిష్కారములు. ఆస్తి విషయాలు, శుభయోగములు ఉద్యోగ దన ప్రాప్తి బంధు మిత్ర సంయోగ శుభములు మిశ్రమ ఆదాయము రుణములు తీర్చుట. సంచార ధనయోగము, ఉద్యోగ ప్రమోషన్ లాంటి శుభయోగములు కలుగును. గురువారమునందు గురు గ్రహమునకు దక్షిణామూర్తికి ప్రదక్షిణములు ప్రసాదములు వితరణ చేసిన గ్రహ దోషములు తొలగును వ్యవహార జయము కలుగును.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్