Vruschika Rasi | ఉగాది వృశ్చిక రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

Vruschika Rasi | ఉగాది వృశ్చిక రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

vruschika rasi
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి:

విశాఖ 4 పాదము (తో)

అనూరాధ 1, 2, 3, 4 పాదములు (నా, నీ, నూ, నే)

జ్యేష్ఠ 1, 2, 3,4 పాదములు (నో,యా,యీ,యూ)

ఆదాయము - 02, వ్యయం 14, పూజ్యత - 5, అవమానం- 2

గ్రహ సంచారం:

గురువు: ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశియందు. తదుపరి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిధునరాశి యందు సంచారము. శ్రీ విశ్వావసు నామ సంబర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచారము చేయును. శని - ఈ సం॥ నుండి 28-03-2025 వరకు కుంభరాశియందు 29-3-2025 నుండి మీనరాశియందు సంచారము చేయును.

రాహువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు మీనరాశియందు 18-5-2025 నుండి కుంభరాశియందు సంచారము.

కేతువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యారాశియందు 18-5-2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును.

అదృష్టం : విశాఖా నక్షత్ర జాతకులు పుష్యరాగమునూ, అనూరాధ నక్షత్ర జాతకులు నీలమునూ, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పచ్చరాయి ధరించవలెను. ఈ రాశి వారలకు 1-2-4-6-8-9 సంఖ్య లందు ప్రయాణములు చేస్తే వ్యవహార విజయములు కలుగును. బుధ, గురు, శుక్ర వారములు ప్రయాణములు చేస్తే ధనాదాయము కలుగును.

నక్షత్ర ఫలము : విశాఖ నక్షత్రము 4 పాదమువారికి ఆదాయం మించిన ఖర్చు, వృత్తియందు సన్మానములు, ధనప్రాప్తి, అనూరాధ నక్షత్రమువారికి ధన చింతన, అధికార సమస్యలు, ఇంటి యందు కార్యసిద్ధి. జ్యేష్ఠ నక్షత్రమువారికి ధనము ఖర్చు, ప్రయాణ బడలిక, సామాన్య అప్పు, చికాకులు, ఈ రాశివారికి జూన్, జూలై, అక్టోబరు, నవంబరు, ఫిబ్రవరి, మార్చిమాసాల్లో సమస్యలు తీరును, ధనప్రాప్తి యోగము. 1,2,3,4 తేదీలు, ఆది, సోమ, మంగళ వారములందు క్రొత్త పనుల ప్రారంభం, ధనప్రాప్తి, స్టార్ నెంబరు 9.

నెలల వారీగా ఫలితాలు: 

ఏప్రిల్ : ఈనెల ఆదాయము వచ్చిననూ మంచినీళ్ళ వలె దుబారాగా ఖర్చులగును అన్నదమ్మల సహాయ సహకారములు లొపించును. ప్రభుత్వ కార్యాలయాల్లో స్త్రీలకు గౌరవ మర్యాదలు. మానసిక ఆందోళనలు, వ్యాపారము మిశ్రమము. ఉద్యోగము నందు నిందలు ఉంటాయి. వృత్తి నందు వ్యతిరేకతలు వస్తాయి. రాహు, కేతువుల పూజలు చేయుట మంచిది. అశ్వత్థనారాయణ వృక్ష పూజచేసి, స్త్రీలకు పసుపు, కుంకుమ వితరణ చేసిన గర్భాది దోషములు తొలిగి కన్యలకు వివాహ యోగము, శుభములు కలుగును.

మే : ఈ నెల యందు వృత్తియందు ఆకస్మిక తనిఖీలు, మానసిక బాధలు, అధికారుల ఒత్తిడి, నిందలు, ఆరోపణలు నిజం చెప్పాల్సిన అవసరము వస్తుంది. ధైర్యముతో ముందుకు సాగండి. దేవీ పూజ ఫలము తప్పక కలుగుతుంది. అశాంతి కార్యములకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారులకు ధనాదాయము. శనివారములందు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మ్రొక్కులు తీర్చుకొని దర్శనము చేసిన దోషములు తొలగి ధనలాభము, పిల్లల చదువులు, వివాహములు అనుకూలంగా ఉంటాయి.

జూన్ : ఈ నెల యందు పిల్లల భవిష్యత్తు అనుకూలం. వివాహాది కార్య నిశ్చయములు దగ్గరలో లభించును. బంధు సంచారములు అధికము. పూర్వపు బంధువుల స్నేహము పెంపొందును. ఉద్యోగ ప్రాప్తి యోగము పిల్లలకు లభించును. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ, విద్యార్థులకు యోగకాలము. శుక్రవారములందు సంతోషిమాత పూజలు చేసిన నరదృష్టి దోషములు తొలిగి, పిల్లెల చదువులు, ఉద్యోగ విషయములు అనుకూలమగును.

జూలై : ఈనెల యందు కార్యనిర్వాహక పనులు అధికంగా చేస్తారు. బ్యాంకు మిత్రులు అతి దగ్గరగా అనుకూలించెదరు. ధనధాన్య విధులు సక్రమ మార్గములో ఆచరిస్తారు. ఉద్యోగ, వ్యాపార కార్యాలు విజయ ప్రాప్తి నిస్తాయి. గురువారము దత్తాత్రేయూని పూజలు చేయుట శుభములిచ్చును. బుధవారము లందు బుధునికి పూజలు చేసి, పెసరపప్పు నివేదన చేసిన వ్యాపార, అధికార సమస్యలు తొలగును.

ఆగస్టు : ఈ నెల ఆర్థికంగా, ఆనందంగా యున్నను ఆరోగ్యము మందగించును. ఆభరణ ప్రాప్తి, ఉద్యో గాదులు కలుగును. వృత్తి, వ్యాపార, ఉద్యోగులకు తగిన ఆదాయము వచ్చినను విలాసంగా ఖర్చుచేస్తారు. శనివారం శ్రీకాళహస్తి దర్శనం, రాహుకేతువుల పూజలచే గృహ, ఋణ సమస్యలు తొలగును.

సెప్టెంబర్ : ఈనెల శని పూజ కుటుంబ సౌఖ్యమునిచ్చును. అప్పుల నుండి బయట పడతారు. ఆలయాలు సందర్శిస్తారు. స్త్రీల మూలక వివాదములు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు స్వల్ప ఆదాయము. "వ్యవహారములందు నిక్కచ్చిగా యుండుట మంచిది. వాహన, ఋణములు బాధించును. గురువారములందు గోవును అలంకరించి తవుడు, నవ ధాన్యములు సమర్పించి పూజలు చేసిన గర్భాది దోషములు తొలగి ఆరోగ్య, ధనప్రాప్తి కలుగును.

అక్టోబర్ : ఈ మాసము మిత్ర లాభముల వికటించును. శారీరక రోగములు పెరుగును. స్వల్ప తగాదాలు రావచ్చును. వ్యాపారము, వ్యవసాయము అనుకూలించదు. ఉద్యోగ, వృత్తులు ఒక మాదిరిగా ఉండును. మాసాంతము నందు అపార్ధములు విడిచి కుటుంబ సభ్యులతో తీర్థ యాత్రలు చేయుట మంచిది. శుక్రవారములందు లక్ష్మీ నరసింహాస్వామి - దర్శనము, లక్ష్మి అమ్మవారికి పసుపు, కుంకుమ పూజ, ప్రసాద నివేదన చేసిన వ్యవహార జయము, ధనప్రాప్తి కలుగును.

నవంబర్ : ఈ నెల అనుకూలమైన కాలము. పుణ్య తీర్థములు తిరుగుతారు. వ్యాపారములు విశ్రుతంగా చేస్తారు. వృత్తియందు రాత్రింబవళ్ళుచేసి ధనార్జన చేస్తారు. విద్య యందు బాగుగా రాణించెదరు. కోపతాపాలతో కొంత నష్టాన్ని చవిచూస్తారు. మాసాంతము నందు ధనార్జనలు అధికం. ఆరోగ్యముమిశ్రమము. శుక్రవారములందు తెల్ల జిల్లేడు పూవ్వులతో, ఆకులతో సూర్యదేవునికి, రాజరాజేశ్వరి అమ్మవారికి పూజలు చేసిన • అప్పుల బాధలు తీరుతాయి.

డిసెంబర్ : ఈ మాసము దేవుళ్ళను నమ్మక తిరుగుతాయి. మీరు కోరిన ఫలితములు సరిగ్గా రాకపోవుటచే విరక్తి భావములు కలుగుతాయి. ధార్మిక చింతన ముఖ్యము. మాసాంతమునందు తరుచూ గౌరవములు వచ్చిననూ అనుకూలించక మాటల యుద్దము కలుగును. వ్యాపార, ఉద్యోగ, వ్యవహారము లందు ఆదాయ, వ్యయుం సమము. ఆకాంక్ష పెరిగినననూ రావల్సిన బాకీలు అన్నియునూ వస్తాయి. శుక్రవారములందు లలితా సహస్రనామావళి చదివి, కుంకుమార్చనలు చేసిన దోషములు తొలగి శుభములు కలుగును.

జనవరి : ఈ నెల గ్రహయోగముచే అన్నివిధములైన ఆందోళనలు తొలగును, వాహ ప్రయత్నములు ఒకదారికి వచ్చును. వృత్తి పనులు సామాన్యముగా నుండును. - చేయు వృత్తియందు తరచు ఆటంకములు కల్గిననూ ధనార్జనకు లోటుండదు. శుక్రవారములందు కనకదుర్గమ్మ దర్శనము, పూజలు దోషములు తొలగి కార్యములు ముందుకు సాగును.

ఫిబ్రవరి : ఈ నెల దూర సమస్యలు వస్తాయి, ధనవ్యయం చేస్తారు, పుత్రపుత్రిక కార్యములు పూర్తి. శారీరక మానసిక సమస్యలు వస్తాయి. వాహన యోగ్యత, కుటుంబ బంధువర్గ మైత్రి అనుకూలము, బుధవారము లందు బుధునికి పూజలు, దానములు ఇచ్చిన దోషములు తొలగును కార్యసాధనచే ధనప్రాప్తి యోగములు ఉండును.

మార్చి : ఈ నెల గ్రహములు అనుకూలముచే బాగుగా యుండును, అన్ని సమస్యలు తీరును వ్యవహార చిక్కులు సంభవించిననూ అనుకూల స్థితి వచ్చును. అన్ని రంగములందునూ సాహసించీ పనులు పూర్తి చేస్తారు, ధనాదాయము కలుగును. శనివారములందు శని గ్రహమునకు పూజలు, అభిషేకములు, దానములు చేసిన దోష నివృత్తి, ధనయోగము కలుగును.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్