Tula Rasi | ఉగాది తులా రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

Tula Rasi | ఉగాది తులా రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

tula rasi

తులా రాశి

తులా రాశి:

చిత్త 3, 4 పాదములు (రా, రి)

స్వాతి 1, 2, 3, 4 పాదములు (రూ, రే, రో, త)

విశాఖ 1, 2, 3 పాదములు (తీ, తూ, తే)

ఆదాయము-11, వ్యయం-5, పూజ్యత-2, అవమానం-2

గ్రహ సంచారం:

గురువు: ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశియందు, తదుపరి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిధునరాశి యందు సంచారము. శ్రీ విశ్వావసు నామ సం॥ర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచారము చేయును. శని - ఈ సం॥ నుండి 28-03-2025 వరకు కుంభరాశియందు 29-3-2025 నుండి మీనరాశి యందు సంచారము చేయును.

రాహువు: ఈ సంవత్సరం 17-5-2025 వరకు మీనరాశియందు 18-5-2025 నుండి కుంభరాశియందు సంచారము.

కేతువు: ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యారాశి యందు 18-5-2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును.

అదృష్టం : చిత్త నక్షత్ర జాతకులు పగడమునూ, స్వాతి నక్షత్ర జాతకులు గోమేధికమునూ విశాఖా నక్షత్ర జాతకులు పుష్యరాగమును ధరించవలెను. ఈ రాశి వారలకు 1-3-4-6-9 సంఖ్యలు సంఖ్యాశాస్త్రరీత్యా ప్రయాణము లందు ధనలాభాదులు కలుగును. మంగళ, బుధ, శుక్ర వారాలు ధన యోగ్యము, వ్యవహార జయము కలుగచేయును.

నక్షత్ర ఫలము : చిత నక్షత్రము 3, 4 పాదముల వారికి స్నేహ భంగము. ఆరంభ పనులకు వారికి సాన చలనము, మారు ఆలస్యము, ధనప్రాప్తి. స్వాతి నక్షత్రము వారికి వ్యాపారం, వృతి మిశ్రమము, పిల్లల సమస్యలు, ధనము ఖర్చు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల వారలకు స్థాన చలనము. ఇంటి పోరు అధికము. ఈ రాశి వారలకు జనవరి మార్చి మాసాల్లో ధనప్రాప్తి. 5,7,8 తేదీలు, బుధ, శుక్ర, శనివారములందు ప్రయాణము, ధనలాభము, కార్యసిద్ధి. స్టార్ నెంబరు 6.

నెలల వారీగా ఫలితాలు

ఏప్రిల్ : ఈనెల తలచిన పనులు ఆలస్యం, శారీరక శ్రమ, బంధు మరణ వార్తలు. ప్రయాణ ప్రమాదాలు వింటారు. దూరపు బంధు రాకలు సంతృప్తినిస్తాయి. మాసాంతములో హఠాత్తు ధనాదాయము, కీర్తి, గౌరవములు వృత్తియందు లభించును. శుక్రవారములందు దేవి పూజలు చేయుట మంచిది. సోమవారం ద్రాక్షారామ స్వామి వారి దర్శనము, అమ్మవారి పూజలు చేసిన భార్యభర్తల సమస్యలు తొలగును. పిల్లలు ఆరోగ్యముగా నుందురు.

మే : ఈమాసము స్త్రీల సమస్యలు వస్తాయి. ఆరోగ్య విషయములో జాగ్రతలు అవసరము. శుభవార్తలు వింటారు. గృహయోగము ఆలోచనలు ఫలిస్తాయి. మాసాంతము నందు అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. యువత, విద్యార్థులు శ్రద్ద పెట్టాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారస్థులకు ధనాదాయము ఉన్నది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనము శుభాలు కలిగిస్తుంది.

జూన్ : ఈ నెలయందు వృత్తి, వ్యాపార, ఉద్యోగ జనులకు కొన్ని ఇబ్బందులు రావచ్చును. ఋణములు చేస్తారు. ఆభరణములు కొరకు చర్చలు జరుగుతాయి. చివరికి ధనముతో ఆభరణములతో సంతోషముగా యుంటారు. దూరపు ప్రయాణములు చేస్తారు. ఉద్యోగ స్థిరత్వమునకు ప్రయత్నములు చేస్తారు. సోమవారములు శివునకు పంచామృత అభిషేకము చేసి మారేడు పత్రితో పూజలు చేస్తే ధనప్రాప్తి, వ్యాపార లావాదేవీలు బాగుగా యుండును.

జూలై : ఈ నెలయందు ఉద్యోగములో స్థిరత్వము ఉండదు. వృత్తి, వ్యాపారములందు సోమరితనముతో సంచరించెదరు. మీ పలుకుబడి ఉపయోగించి ఇంటి పనులు, ఉద్యోగ పనులు కొన్ని పూరి చేసారు. మాసి పోయిన, సమసి పోయిన సమస్యలు బయటకు వస్తాయి. కొంత మానసిక వ్యధను పొందుతారు. శనిశ్వరునికి పూజ చేయుట మంచిది. శనివారములందు జమ్మి పత్రితో శనికి పూజ చేసిన దారిద్య్రబాధ నివారణ మగును.

ఆగస్టు : ఈనెల వృత్తి, వ్యాపార, ఉద్యోగములందు కొత్త పనులు ఆలోచనలు సాధిస్తారు. అర్ధిక పురోగాభివృదీని సాధించెదరు. శుభకార్య ప్రవేశములు కొన్ని జరుగుతాయి. ప్రాతిష్టాత్మక విధి విధానముల్లో పొందినవి కీర్తిని అర్జించెదరు. అనావృష్టితో వ్యవసాయదారులు చిక్కులు పొందేదరు. వృత్తి యందు సామన్య ఆధాయములుండును. ఆదివారములందు రవికి జిల్లేడు పూలతో, జిల్లేడు ఆకులతో పూజలు గావించిన ఆరోగ్య దోషముపోవును, ఋణ సమస్యలు తొలగగలవు.

సెప్టెంబర్ : ఈ నెల కుటుంబ సభ్యులతో తీర్ధయాత్రలు చేస్తారు. భూ, గృహయోగముల ఆలోచనలు చేస్తారు. కొన్ని శుభయోగములు కలిసి వస్తాయి. మాసాంతములో శారీరక శ్రమ అధికం. వ్యాధులు కూడా రావచ్చును. రాజకీయ వ్యక్తులతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, వ్యాపార, ఉద్యోగులకు మిశ్రమము. బుధవారం బుధుని పూజలు, పెసలు దానము చేయుటచే వ్యాపార వ్యతిరేకతలు తొలగును.

అక్టోబర్ : ఈనెల మిశ్రమ ఫలితములు. ఆర్థిక, విద్యాపరమైన, వ్యాపార సంబంధమైన విషయాలు కటువుగా వుంటాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరము. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, విద్యార్థులకు ప్రయత్న కార్యములు సిద్ధించును. సోమవారములందు దేవాలయ దర్శనము, ప్రసాద వితరణ చేసిన ధనయోగము, శుభములు కలుగును.

నవంబర్ : ఈనెల అసంఘటిత వ్యాధులు రావచ్చును. స్త్రీలకు తగు న్యాయాన్ని అందించుట మంచిది. దుబారా ఖర్చులు వస్తాయి. స్వంత నిర్ణయములు వృత్తి, వ్యాపార, ఉద్యోగములయందు కలసివచ్చును. నిందారోపణలతో విద్యార్థులు సంచరించేదరు. శనివారములందు నవగ్రహ పూజలు చేయుట మంచిది. గురువారములందు దత్తాత్రేయుడి దర్శనము పుష్ప నామార్చనలు, ప్రసాద వితరణచే దోషములు తొలగును.

డిసెంబర్ : ఈనెల ఆర్ధిక లోపములు తొలగాను. వృత్తి, కోర్టు వ్యవహార ములలో విజయము. ప్రయాణములందు అధిక శ్రమ. పిల్లల భవిష్యత్తు పతనము కావచ్చును. అందరికి తగిన ఆదాయము ఉంటుంది. శ్రీశైలేశుని దర్శనము, అభిషేకములు, అమ్మవారికి కుంకుమ పూజచేసిన రాబోవు ప్రమాదములు, మానసిక బాధలు తొలగిపోవును. ధనప్రాప్తి కలుగును.

జనవరి : ఈ నెల సాంప్రదాయ విషయ చర్చలు అపవాదులు తొలగును. ఆనందము పొందెదరు. కార్యవర్గములో సంచారము, అసూయలు పుట్టును. స్త్రీల పాత్రతో కొన్ని విజయాలు సాధించి తీరుతారు, వృత్తియందు ధనాదాయము మిశ్రమము. అన్నవరం శ్రీరమాసహిత సత్యదేవుని వ్రతము చేయుట సకల శుభములు కలుగును. తీవ్ర దృష్టి దోషములు తొలగును.

ఫిబ్రవరి : ఈ నెల మహిళ సంయోగము బాధించును, ఇంట్లో శుభ కార్యములు, అనుకున్న ప్రయాణములు చేస్తారు. ఉద్యోగము సాఫీగా యుండును. పుణ్యక్షేత్ర దర్శనము మంచిది. సామాన్య ధనప్రాప్తి ప్రయాణ ములు పుణ్యక్షేత్ర దర్శనములు చేస్తారు. వృత్తియందు సామాన్యము. తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనము బాధలు తొలగి సకల శుభములు, ధనప్రాప్తి కలుగును.

మార్చి : ఈ నెల ఋణములు తీర్చెదరు. రావలసిన ధనము వచ్చును. ఖర్చులు పెరుగును, బంధు మరణ చింతలు, ఉద్యోగ వ్యాపార వృత్తులందు మిశ్రమా దాయములు కలుగును. సోమవారములందు ఈశ్వరునికి అభి షేకములు, పూజలు, ప్రసాద వితరణము.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్