Simha Rasi | ఉగాది సింహ రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు
సింహ రాశి
సింహ రాశి:
మఖ 4 పాదములు (మా, మీ, మూ, మే)
పుబ్బ 1, 2, 3, 4 పాదములు (మో, టా, టీ, టూ)
ఉత్తర 1వ పాదము (టే)
ఆదాయము -11,వ్యయం - 11,పూజ్యత-3,అవమానం – 6
గ్రహ సంచారం:
గురువు : ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశి యందు, తదు పరి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిధునరాశి యందు సంచారము, ఏరి -విశ్వావసు నామ సం||ర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచారము చేయును. శని - ఈ సం॥ నుండి 28-03-2025 వరకు కుంభరాశియందు 29-3-2025 నుండి మీన రాశియందు సంచారము చేయును.
రాహువు : ఈ సంవత్సరం17-5-2025 వరకు మీనరాశియందు 18-5-2025 నుండి కుంభరాశియందు సంచారము.
కేతువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యారాశి యందు 18-5-2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును.
అదృష్టం : మఖానక్షత్ర జాతకులు గోమేధికమునూ, పుబ్బా నక్షత్ర జాతకులు వజ్రమునూ, ఉత్తర నక్షత్ర జాతకులు కెంపురాయి ఉంగరమునూ ధరించవలెను. ఈ రాశి వారలకు 1- 3-6-8-9 సంఖ్యలు ప్రయాణములందు కార్యసిద్ధిని కలుగచేస్తాయి. ఆది, సోమ, మంగళవారములు ధనప్రాప్తినిచ్చును.
నక్షత్ర ఫలము : మఖ నక్షత్రమువారికి స్త్రీ సౌఖ్యము, రాజకీయ పదవులు, ఇంటి యందు అనుకూలము. పుబ్బ నక్షత్రమువారికి ధనలాభము, వృత్తియందు గౌరవములు, గృహయోగములు. ఉత్తర నక్షత్రము 1 పాదము వారికి స్థలములు ఖరీదు, కోర్టు సమస సమస్యలు తొలగును, వృత్తియందు ధనం. ఈ రాశివారికి మే, జూన్, సెప్టెంబరు, అక్టోబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ధనయోగములు. 3,4,5,9 తేదీలు, ఆది, మంగళ, బుధవారములు ప్రయాణములు, ధనయోగము, కార్యసిద్ధి. స్టార్ నెంబరు 1.
నెలల వారీగా ఫలితాలు
ఏప్రిల్ : ఈ మాసము నందు కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంతో ముందుకు సాగుతారు. జీవితాశయ సాధన కోసం బాగా శ్రమ తీసుకుంటారు. వృత్తి, వ్యాపార ఉద్యోగ రంగ జనులకు ధన విషయ ఊరట కనిపించును. పట్టుదలతో కార్యాన్ని సాగించెదరు. మీ వెనుక యున్న కుటుంబ సభ్యులు మిమ్ములను అనుసరించుటచే కార్యాన్ని సాధించి తీరుతారు. గురువారములందు శివాలయంలో పూజలు చేసిన ధనప్రాప్తి కలుగును.
మే : ఈనెల గ్రహస్థితి ప్రతికూలముగా ఉన్నది. మాట పట్టింపులు అధికం. ఇతర విషయాలలో తల దూర్చవద్దు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ, రాజకీయులకు సామాన్యం. ధనాది సుఖములు, మంగళ వారము కందులు దానము చేస్తే సమస్యలు తొలగును. ఆదివారములందు గ్రామ దేవతలకు పొంగలి పెట్టి, కుంకుమ పూజలు చేసిన రావల్సిన ధనం సకాలములో అందుతుంది. ధనప్రాప్తి కలుగును.
జూన్ : ఈ నెల ప్రయాణ నష్టములు, స్త్రీలతో నిందారోపణములు, బంధు మరణవార్తలు, శరీరశ్రమ, చింత, బాధలు కొన్ని మాస మధ్యలో వస్తాయి. ఆదివారము నవగ్రహ పూజలను చేయండి. ఇంటి నందు గణేశుని హెూమం చేస్తే ఈతి బాధలు తొలగును. తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనం శుభ యోగములు. జమ్మిచెట్టుకు వస్త్రము, పసుపు, కుంకుమ పూజలు చేసిన ఏలినాటి శని దోషాలు తొలగును.
జూలై : ఈ మాసము ఆదాయము కన్న వ్యయము అధికం. దూర ప్రయాణములు చేస్తారు. బంధుప్రీతితో ధనము ఖర్చు చేస్తారు. పూర్వ జనుల సంబంధాలు పెరుగుతాయి. ఆశించిన విధంగా వృత్తి, వ్యాపార రాజకీయలందు ఫలితములు రావచ్చు. భూ యోగములు కలుగవచ్చును. మంగళవారములందు ఎర్రని పూలతో కుజునికి పూజలు, కందిపప్పు దానము చేసిన సరఘోషలు తొలిగి ధనప్రాప్తిని పొందుతారు.
ఆగస్టు : ఈ నెల వాహన యోగ సూచనలు ఉన్నాయి. ఇంటి యందు భార్యాబిడ్డల విషయంలో అనుకూలము. రుణములు కొన్ని తీర్చగలుగుతారు. ఆరోగ్యము నిలకడ రావలసిన బాకీలు వసూలు అవుతాయి. ధార్మిక విషయాలు ఎందుకు శ్రద్ధ వహించడం మంచిది. శనివారాలు యందు తీర్థయాత్ర స్థల సందర్శనము శుభ ఫలితాలను ఇచ్చును. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శనం వ్రతం పూజలు చేసిన బంధువులకు పెట్టుబడి అందించే ఆనందము కుటుంబ సభ్యులు ఉండగలరు అనుకూలము.
సెప్టెంబర్ : ఈ నెల శుభాశుభములు కలుగును. శారీరక, మానసిక, ఆర్థికపర ఇబ్బందులు. పెట్టుకున్న ఆశలు కొన్ని పూర్తి కాగలవు. ఆదివారములందు మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేయట మంచిది. వృత్తి, వ్యాపార, రాజకీయ, విద్యార్థులకు మిశ్రమ స్పందన, పురోగతితో ధనప్రాప్తి లభించును. అన్నవరం శ్రీసత్యదేవుని దర్శనం, వ్రతము జరిపించిన ఆరోగ్యం, వ్యాపారములందు శుభములు కలుగును.
అక్టోబర్ : ఈనెల ఆదాయమునకు లోటుండదు. సాంఘిక అభివృద్ధితో పయనించెదరు. వాహన యోగములు రావచ్చును. నెల మధ్యలో ఆరోగ్యము లోపించును ఇంటియందు వివాహా కార్యములు పూర్తిచేయు సమయము రావచ్చును. కుటుంబము మొత్తము ఒకే మాట అవలంభించి దైవారాధనలు చేసిన పిల్లల భవిష్యత్తు అనుకూలముగా ఉంటుంది. గుమ్మడికాయను సింహాద్వార గుమ్మమునకు కట్టినచో నరబాధలు, తోలుగును.
నవంబర్ : ఈనెల చేయు వృత్తి, వ్యాపారములందు అనుకూలత, ధనాదాయము. మిత్రద్రోహముతో ధన వ్యయము జరుగుతుంది. ఆరోగ్యము, ఆనందమయము. భార్య విరోధము చవిచూడాల్సివస్తుంది. సహెూద్యోగుల వేదింపులు అధికంగా వుంటాయి. రాహు, కేతువుల పూజా, దానములు చేసిన కొంతమేలు చేకూరును. శనివారములందు మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహుని దర్శనము, తీర్చుకోనిని సమస్త సంసార బాధలు తొలగి సుఖములు కలుగును.
డిసెంబర్ : ఈనెల భార్యా పుత్రులతో వైరములు. పిల్లల చదువుల రీత్యా కొన్ని ఇబ్బందులు రావచ్చును. ఉద్యోగ యోగములు పిల్లలకు దగ్గరలో ఉన్నవి. వివాహాదీ శుభకార్యములు అనువుగా వుండును. బంధువర్గములో వివాహములు బిడ్డలకు జరుగును. వృత్తి, వ్యాపార, రాజకీయ వాదులకు అనుకూల ధనలాభములు కలుగును. పిడుగురాళ్ళ శ్రీవాసవి అమ్మవారి దర్శనము, కుంకుమ పూజలు చేసిన వ్యాపార వృద్ధి, ధనలాభములు కలుగును.
జనవరి : ఈ నెల శని దోష చికాకులు అధికము, ప్రయాణ ఇబ్బందులు కలుగును. భార్యా సమస్యలు కొన్ని వచ్చును. ఆరోగ్య సమస్య ధనవ్యయములు చేస్తారు. ప్రశాంతత వచ్చును. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగములు యధాస్థితి పొంది ధనార్జనా పరులుగా యుందురు. శనివారములందు, శని, రాహు గ్రహపూజలు చేసి ప్రసాదములను వితరణచేసిన దాయాది దోషములు తొలగును.
ఫిబ్రవరి : ఈ నెల ప్రణాళికా బద్దంగా వ్యవహరించుట మంచిది. వాహన యోగములున్నవి. వృత్తి యందు శ్రమకు తగిన ఫలం. తలచిన పనులు పూర్తి యగును. పాత బాకీలు తీర్చెదరు. నూతన గృహస్థుల చర్చలు ఫలిస్తాయి. ధనాదాయము సామాన్యము. మంగళవారంలందు కుజగ్రహ పూజలు, ప్రసాద వితరణ చేసిన దోషనివృత్తి కలుగును.
మార్చి : ఈ నెల ఉన్నతాధికారులతో బంధుత్వము పెరుగును. నిందారోపణములు కొన్ని రావచ్చును. ఆర్థిక వ్యవహారములు లాభసాటిగా సాగుతాయి. ఆస్థి నిమిత్తం కొన్నీ ప్రయత్నములు విభేదించును, ప్రతి కార్యము దైవానుకూలముగా భావించాలి. లలితా నామ పారాయణము, హనుమాన్ చాలీసా పారయణములు చేసిన దోషములుతొలగి, వృత్తి, వ్యాపారములు లాభసాటిగా ఉండును.