Midhuna Rasi | ఉగాది మిధున రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

Midhuna Rasi | ఉగాది మిధున రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

midhuna rasi

మిధున రాశి

మిధున రాశి:

మృగశిర 3, 4 పాదములు (కా, కి)

ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, చా)

పునర్వసు 1,2,3 పాదములు (కే. కో, హా)

ఆదాయము - 14,వ్యయం-02,పూజ్యత -4,అవమానం - 3

గ్రహ సంచారం:

గురువు : ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశియందు, తదుపరి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిధున రాశి యందు సంచారము చేయును. విశ్వావసు నామ సం॥ర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచార చేయును. శని - ఈ సంవత్సరం నుండి 28-03-2025 వరకు కుంభరాశియందు 29-3-2025 నుండి మీన రాశియందు సంచారము చేయును.

రాహువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు మీనరాశియందు 18-5-2025 నుండి కుంభరాశియందు సంచారము.

కేతువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యారాశియందు 18-5-2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును.

అదృష్టం : మృగశిరవారు పగడమును, ఆరుద్రవారు గోమేధిక మునూ, పునర్వసు వారు పుష్యరాగమునూ ధరించవలయును. ఈ రాశివారలకు 1,3,6,9 సంఖ్యల రోజుల్లో కార్యసిద్ధిలాభములు కలుగును. ఆది, సోమ, బుధ వారాల్లో ప్రయాణములు చేస్తే పనులు విజయమును పొందును. స్టాన్ నెంబర్ -5

నక్షత్ర ఫలము : మృగశిర నక్షత్రము 3,4 పాదముల వారికి ఆరోగ్యం బాగు, పిల్లల సమస్యలు తొలగును, ధనప్రాప్తి. ఆరుద్ర నక్షత్రమువారికి దీర్ఘ ఋణము నివృత్తి, ఆరోగ్య సామాన్యము. ప్రయాణముల. పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదముల వారికి ఉమ్మడి సమస్య నివృత్తి, బంధు ప్రీతి. ఆదాయము అధికము. ఈ రాశి వారలకు జూలై, సెప్టెంబర్ అక్టోబరు, జనవరి, మార్చి నెలలండు ధనప్రాప్తి యోగము, 1,3,6,8 తేదీలు, ఆది, గురు శుక్రవారాలందు ప్రయాణాలు, ధనప్రాప్తి యోగము.

నెలల వారీగా ఫలితాలు

ఏప్రిల్ : ఈ నెల గ్రహస్థితిచే తలచిన పనులు పూర్తియగును. బంధువు సహకారము లభిస్తుంది. కోర్టు వ్యవహారములు ఊరటనిస్తాయి. మాసంతంలో అసహన కలిగి సంచరిస్తారు. యువత, విద్యార్థులు, కర్షకులు తగిన విధంగా జాగ్రత్త వహించాలి. స్త్రీలకు అధిక శ్రమ, మిశ్రమ ధనాదాయము. "సోమవారములందు శివునికి పంచామృతాలతో అభిషేకము, మారేడు దళములతో పూజచేసిన ఈతి బాధలన్నియు తొలగి ధనప్రాప్తి కలుగును.

మే : ఈ నెల ఆర్థిక పరిస్థితి బాగుండును. బిడ్డల చదువులు ఆనందాన్ని ఇస్తాం. పెళ్ళయిన ఆడపడుచులకు ధనం ఖర్చులు పెరుగుతాయి. ఎస్త్రీలకు అధిక ప్రసంగాలు తగదు. వ్యసనములకు దూరంగా వుండుట మంచిది. ప్రయత్న పూర్వక పనులు కొన్ని రాణించును. శివుని ప్రార్ధనల చే కొన్ని ప్రయత్నములు లాభిస్తాయి. శుక్రవారంలందు కామేశ్వర వ్రతం చేసి స్త్రీలకు పసుపు, కుంకుమ, వితరణ చేసిన ఇంటి ఆడపడుచులు వివాహాములు త్వరగా పూర్తియగును.

జూన్ : ఈ నెల రాజకీయాలకు ఇబ్బందులు, నిందారోపణలు, అవమానము రావచ్చును. విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, వృత్తి వారలకు ఆనందముతో ఉంటారు. చేతివృత్తుల వారికి అతిశ్రమ, అధిక ధనప్రాప్తి కలుగును. సోమ వారములందు శివార్చన చేసిన మంచి కలుగును. గురువారములందు లక్ష్మి కుబేరవ్రతం ఇంటియందు చేసిన వ్యాపారవృద్ధి, వివాహాది కార్యసిద్ధి, శుభయోగములు కలుగును.

జూలై : ధర్మ కార్యాల్లో సంచారం చేస్తారు. ధనం ఖర్చు అధికము, బిడ్డల ఖర్చులు అధికము. వృత్తి, వ్యాపార, ఉద్యోగములందు కొంత ధనాందోళనలు కలుగును. రావల్సిన ధనము కొంత కాలములో వచ్చును. దుర్గాదేవి పూజలుచేయుట మంచిది మిశ్రమ ఆరోగ్యము. శుక్రవారములందు సరస్వతిదేవి పూజలు చేసిన పిల్లల ఉద్యోగములు, చదువులు, పరీక్షలందు మంచి ఫలితములు కలుగును.

ఆగస్టు : ఈ నెల జీవన విధానములో ముందడుగు వేస్తారు. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, రాజకీయాదులు ఆదాయము కంటే ఖర్చులు అధికము. ప్రయాణములు చేస్తారు. లాభసాటితో ఆనందంగా కుటుంబ జనులు పొందుతారు. బుధవారములందు గణేశునికి చెఱకురసము, కుడుములు, ఉండ్రాళ్ళతో పూజ చేసిన పిల్లల చదువులు విజయము పొందుదురు. వ్యాపారాదులు ధనప్రాప్తిని ఇస్తాయి.

సెప్టెంబర్ : ఈ నెల వ్యసనముల బారి నుండి దూరంగా ఉండుట మంచిది. కోపంచే అనర్ధములు కొని తెచ్చుకుంటారు. స్త్రీలు సదాచారముతో నడుచుట మంచిది. కోర్టు వ్యవహారములు విజయము. ఇంటి సమస్యలు తీరుతాయి. ఆరోగ్య సమస్యలు రావచ్చును. మంగళవారము లందు ఆంజనేయస్వామి వారికి ఆకు పూజ, అప్పాలు నివేదన చేసిన దారిద్య్ర బాధలు తీరును.

అక్టోబర్ : ఈ నెల అధికారులతో కలహాలకు వెళ్ళరాదు. మైత్రితో కార్యములు సాధించండి. స్థాన చలనములకు అవకాశమున్నది. స్త్రీలకు కొన్ని ఇబ్బందులు వచ్చును. పిల్లలు దారితప్పే అవకాశము ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ వాదులకు ధనదాయమున్నను సంక్షోభములు కలుగును. శ్రీశైలేశ్వరుని అభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చనలు చేసిన కళ్యాణములు నిశ్చయమగును.

నవంబర్ : ఈనెల ప్రతి పనిలోను ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. ఇంటి యందు వ్యతిరేకలు రావచ్చును. వివాదస్పద వ్యాఖ్యలు వినరాదు. ధనం విషయంలో తగు జాగ్రత్తలు వహించుట మంచిది. స్థిరాస్తులకు సంబంధించి కొన్ని వివాదాలు రావచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయులకు అనుకూల ధనప్రాప్తి కలుగును. విద్యార్థులకు అనుకూలము. శుక్రవారములందు లలితాసహస్రనామ పారాయణము, కుంకుమ పూజలు చేసినచో ధనప్రాప్తి కలుగును.

డిసెంబర్ : ఈ నెలయందు ఋణ బాధలు, ఆరోగ్య సమస్యలు, భార్యకు ఆరోగ్య సమస్య బాధించును. సొంత విషయములందు తగు జాగ్రత్త అవసరము. లక్ష్మీ నరసింహ పూజలు చేయుట మంచిది. బుధవారము లందు బుధ గ్రహమునకు పెసలుతో కూడిన అన్నమును నివేదన చేసి, సాధువులకు భోజనములు పెట్టినచో వ్యాపార సమస్యలు తీరి, రావల్సిన ధనము వచ్చును.

జనవరి : ఈ నెల ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యములు విజయముతో కూడును, పనులు పూర్తి యగును. మాతృవర్గములో ఆరోగ్యలోపము రావచ్చును. ఉద్యోగ వ్యాపార వృత్తుల యందు ధనాదాయము. శనివారములందు వేంకటేశ్వర స్వామికి తులసి దళములతో పూజలు చేసిన వ్యవహార జయము, ధన ప్రాప్తి కలుగును.

ఫిబ్రవరి : ఈ నెల వ్యతిరేకతలు సంభవించును. వృత్తి యందు మానసిక బాధలు, ఉద్యోగ చికాకులు, వ్యాపారం మిశ్రమము. కొంత అనుకూలము. అన్ని రంగములందు సమస్యలు తీరును, ధనప్రాప్తి, శుక్రవారములందు అష్టలక్ష్మీదేవికి ఎర్రనిపూలతో పూజలు, కుంకుమాదులతో అర్చనలుచేసి ప్రసాదము వితరణచేసిన దోషములు తొలగి, ధనప్రాప్తి కలుగును.

మార్చి : ఈ నెల వృత్తి ఉద్యోగ వ్యాపారములు రాణించగలవు, ప్రయాణములు అధికము. వాహన ప్రయాణ జాగ్రత్తలు అవసరము. దూర మిత్ర దర్శనములు కలుగును. సంతానాది సౌఖ్యములు కలుగును. గురువారములందు గురుగ్రహ పూజలు, ప్రసాద వితరణ రాజయోగము, ధనవృద్ది కలుగును.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్