Mesha Rasi | ఉగాది మేష రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

Mesha Rasi | ఉగాది మేష రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు

mesha rasi

మేష రాశి

మేష రాశి:

అశ్వని 1,2,3,4 పాదములు (చూ,చే,చో,లా)

భరణి 1, 2, 3, 4 పాదములు (లీ,లూ,లే,లో)

కృత్తిక 1 పాదము (ఆ)

ఆదాయం - 2, వ్యయం-14,పూజ్యత-5,అవమానం-7

గ్రహ సంచారం: 

గురువు : ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశియందు, తదుపర్తి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిథున రాశి యందు సంచారం శ్రీ విశ్వావసు నామ సం॥ర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచారము చేయును. శని - ఈ సం|| నుండి 28-03-2025 వరకు కుంభరాశియందు 29-3-2025 నుండి మీనరాశియందు సంచారము చేయును.

రాహువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు మీనరాశియందు 18-5-2025 నుండి కుంభరాశియందు సంచారము.

కేతువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యారాశియందు 18-5-2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును.

అదృష్టం : అశ్వనివారు వైడూర్యమును, భరణివారు, వజ్రమునూ, కృత్తికవారు కెంపును ధరించాలి. ఈ రాశి వారలకు 2, 3, 8, 9, 11 సంఖ్యలయందు అదృష్ట కార్యములు లభించును. ఆది, మంగళ, బుధ, శని వారములు కార్యసిద్ధి కల్గును. స్టార్ నెంబరు 9.

నక్షత్రఫలము: అశ్వని నక్షత్రమువారికి మిశ్రమాదాయము. కొన్ని కార్యములు పూర్తి ఋణవిముక్తి, భరణి నక్షత్రమువారికి తలచిన పనులు ఆలస్యము. ధనాదాయము సామాన్యము. కృత్తిక నక్షత్రమువారికి వ్యవహార చిక్కులు, కుటుంబమునందు అధిక ధనము. ఈ రాశివారికి ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబరు, డిశెంబరు, ఫిబ్రవరి ధనప్రాప్తి యోగము. 1,2,3,6 ఆది, బుధ, గురువారములందు తలచిన పనులు విజయము.

నెలల వారీగా ఫలితాలు

ఏప్రిల్ : ఈనెల ప్రతికూలతలు ఉన్నను దైవబలముతో కార్యాలు కొన్ని సాధించెదరు. దేవుని పూజలు శనివారములందు చేయండి. కలహాలకు దూరంగా ఉండండి. ధార్మిక తత్వము తగ్గించింది. అష్టలక్ష్మి దేవికి ఎరుపు పూలతో పూజలు, కుంకుమార్చనలు చేసిన ధనదాయము, ఆరోగ్య ప్రాప్తి కలుగును.

మే : ఈనెలయందు గ్రహాస్థితిలో ఎవరి సహకారముతో పనిలేదు. దూర ప్రయాణములు, ఆత్మీయులతో చిన్న చిన్న వ్యక్తులతో లావాదేవీలు చేస్తారు. కార్మిక కర్షక వ్యవసాయాధి సర్వజనులకు కృషికి ఫలితము, ఉద్యోగులు తగు జాగ్రత్త వహించి ప్రమోషన్ గురించి ఆలోచించుకోవాలి. ఆదివారములందు గ్రామదేవత, లక్ష్మీ తిరుపతమ్మ లకు నిమ్మకాయల దండను సమర్పించి కుంకుమార్చనలు చేసిన శతృదోషము తొలిగి ధనప్రాప్తి కలుగును.

జూన్ : ఈమాసము చికాకులు అధికం, స్నేహము ఇబ్బందులు రావచ్చును. విష్ణుమూర్తిని పూజలు చేయండి. ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, వృత్తి వ్యాపారాలు తగిన శక్తితో పనులు ప్రారంభించుట శ్రద్ధగా ఆలొచించి ధనార్జన చేయుట మంచిది. శనివారములందు ఆంజనేయ స్వామికి ఆకు పూజ, అప్పాల నివేదించిన ప్రమాదములు తొలగిపోవును.

జూలై : ఈ నెల కుటుంబ విషయాలు జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. పిల్లల భవిష్యత్తు వక్రత్వముతో యున్నది. ఋణ ప్రయత్న విజయము, పోటీ తత్వముతో వృత్తి, ఉద్యోగ వ్యాపార, వ్యవసాయ,రాజకీయ, విద్యార్థులు చేసుకోవాలి. కొద్దిపాటి ఒడిదుడుకులు వస్తాయి. మిశ్రమ శుభయోగమే. గురువారం సరస్వతీదేవి పూజ చేసిన నరద్రిష్టి దోషములు తొలగును. లక్ష్మి దేవి పూజ చేసిన వ్యాపారము బాగుగా యుండును.

ఆగస్టు : ఈనెల ప్రయాణ కష్టములు, పనుల్లో ఆటంకములు, ధనము అందక భాదలు వస్తాయి. చెడు వ్యసన సమస్యలు కొన్ని రావచ్చును. యువతీ, యువకులు ప్రయాణ ఇక్కట్లు, ధన సమస్యలు కొన్నిచోట్ల పొందుతారు. ఆరోగ్యములు మిశ్రమము. ఆదివారములందు రవికి ఉత్తరేణి పూలతో పూజలు చేసి, గోధుమపిండి పదార్థములను వితరణచేసిన సర్వరోగములు శాంతించును.

సెప్టెంబర్ : ఈనెల ప్రతికూలముచే మిశ్రమముగా ఉండును. ప్రయాణ లాభములు దూరపు బంధువులను దర్శించెదరు. సంతానముతో కొన్ని ఇబ్బందులు రావచ్చును. బ్యాంక్ ఋణాదులు ఇబ్బందులు కలుగుతాయి. శ్రీ వేంకటేశ్వరుని దర్శనముచే లాభములు పొందు అవకాశము, కుటుంబ సమేతముగా దుర్గాదేవి దర్శనముచే ఆరోగ్యము, వ్యాపార, వృత్తి అనుకూలముగా ఉండును.

అక్టోబర్ : ఈనెల ప్రతి పనిని ఆలోచించి దూరదృష్టితో చేయుట మంచిది. కుటుంబ సభ్యులతో సంప్రదించి ఇంటి కార్యక్రమాలు చేయుట మంచిది. బంధు మిత్రులతో తర్కవితర్కములు చేయుట మంచిది కాదు. అహోబిల నరసింహస్వామిని పూజించి, దర్శించిన కుటుంబ దోషములు తొలగి శుభ యోగములు కలుగును.

నవంబర్ : ఈనెల మహిళా రాజకీయ నాయకులు అతిగా ప్రవర్తించెదరు. భార్యా బిడ్డల ఆరోగ్యములు తరచు శ్రద్ధగా చూచుట మంచిది. వ్యాపార, ఉద్యోగ, రాజకీయ, వృత్తి యందు సామాన్య లాభములు, రాహు, కేతువుల పూజలు చేయుట మంచిది. ఒంటిమిట్ట "కోదండరాముని దర్శనము, దర్శనమువలన సకల పాపాలు, ఋణ విమోచన తోలగి ధనప్రాప్తి, కుటుంబ వృద్ధి కలుగును.

డిసెంబర్ : ఈనెల శుభ మరియు మిశ్రమ ఫలితాలు ఉండును. రావల్సిన బాకీలు ఆలస్యముగా వచ్చును. దూర ప్రయాణములు బాగా లాభాన్నిస్తాయి. ఆరోగ్య చికిత్సలు జరుగవచ్చును. బంధు మిత్రులతో కలసిచేయు వృత్తి, వ్యాపార, ఉద్యోగము, రాజకీయులందు అనుకూలిస్తాయి. శని, రాహువుల పూజలుచేయుట మంచిది. నాగేంద్రస్వామి పుట్టలో పాలు పోయుట మొదలగు ప్రసాద నివేదన చేసిన గర్భ దోషములు, నానావిధ దోషములు తొలగును.

జనవరి : ఈ నెల గ్రహస్థితి అనుకూలముకాదు, దైవపూజలు చేయుట మంచిది. బిడ్డల - విషయమై చర్చలు, చికాకులు కల్గించును, ఆధ్యాత్మిక కార్యక్రమములు చేస్తారు. దూర బంధు మరణవార్తలు వింటారు, విలువైన వస్తువులు ఖరీదులు చేస్తారు, ధనాదాయము. శుక్రవారంలందు లక్ష్మీదేవి పూజలు, కుంకుమాదులతో అర్చనలు చేసిన ఆరోగ్య, ధనప్రాప్తి కలుగును.

ఫిబ్రవరి : ఈ నెల గ్రహస్థితి మిశ్రమము, దైవభక్తితో కార్యాలు సాధించుట ముఖ్యము. అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమగును, ఆకస్మిక ధనప్రాప్తి యోగములు కలుగును. ప్రముఖుల పరిచయములు అధికము. మానసిక స్థితీతో కొన్ని ఇబ్బందులున్నా ఆదాయమునకు లోటు ఉండదు. ఆదివారము లందు సుబ్రహ్మణ్యస్వామికి పూజలుచేసి, ప్రసాద వితరణ చేసిన శత్రుదోషములు తొలగి శుభములు కలుగును.

మార్చి: ఈ నెల వాహన సౌఖ్యము, దూరప్రయాణ సంచారములు, స్నేహ పూరిత పనులు పూర్తి. ధార్మిక విజయము, బంధుమిత్ర ఆరోగ్య సమస్యలు తీరును. దూర ప్రయాణములు విరోధములు కల్గించును. అన్ని విజయములు చేకూరును, ధనాదాయము బాగుండును. లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనము, పూజలుచేసి ప్రసాద వితరణ చేసిన నర దోషములు తొలగును.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్