Meena Rasi | ఉగాది మీన రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు
మీన రాశి
మీన రాశి:
పూర్వాభాద్ర 4 పాదము (ది)
ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు (దు, శ్యం, ఝా. థా)
రేవతి 1,2,3,4 పాదములు (దే, దో, చా, చి)
ఆదాయము - 03, వ్యయం-05, పూజ్యత - 03, అవమానం- 1
గ్రహ సంచారం:
గురువు: ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశియందు. తదుపరి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిధునరాశి యందు సంచారము విశ్వావను నామ సం॥ర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచారము. శని ఈ సం॥ నుండి 28-03-2025 వరకు కుంభరాశియందు 29-3-2025 నుండి మీన రాశియందు సంచారము చేయును.
రాహువు ఈ సంవత్సరం 17-5-2025 వరకు మీనరాశియందు 18-5-2025 నుండి కుంభరాశి యందు సంచారము.
కేతువు: ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యా రాశియందు 18-5-2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును.
అదృషం: పూర్వాభాద్ర నక్షత్రజాతకులు పుష్యరాగమునూ, ఉత్తరాభాద్ర నక్షత్రజాతకుల నీలము నూ రేవతి నకుతజాతకులు పచ్చరాయి ఉంగరమునూ ధరించవలెను. ఈ రాశి వారలకు 1-3-4-5-7-9 సంఖ్యలు గల రోజులందు ప్రయాణములు చేస్తే ధనలాభాదులు గలుగును, మంగళ, బుధ, గురు, శుక్రవారములు కొత్తపనులు ప్రారంభిస్తే జయముగా నుండగలవు.
నక్షత ఫలము : పూర్వాభాద్ర నక్షత్రము 4 పాదమువారికి ఆరోగ్యము బాగు, అధికారులు ఒత్తిడి, కొంత వృధా ధనం ఖర్చు. ఉత్తరాభాద్ర నక్షతవారికి రావల్చిన బాకీలు వచ్చును. మిశ్రమ స్పందన, ఇంటి యందు శుభం. రేవతి "నక్షత్రము వారికి చరాస్తుల మార్పులు రావల్సిన ధనము చేతికి వచ్చును. ఈ రాశి వారలకు జూన్, జూలై, సెప్టెంబరు, అక్టోబరు, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ధన లాభము కలుగును. 1,2,5,9 తేదీలు, ఆది సోమ, గురువారములందు ప్రయాణము, అధిక లాభము, ధనయోగము కలుగును. స్టార్ నెంబరు 3.
నెలల వారీగా ఫలితాలు:
ఏప్రిల్ : ఈ నెల సామాన్య స్థితి. అనవసర ప్రయాణములు, సజ్జనుల వైరం కలుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కొంత అసంతృప్తి కలుగవచ్చును. రావల్సిన బాకీలు వస్తాయి. ప్రమాదము దర్శించెదరు. కొంత అనారోగ్యము రావచ్చును. గురువారములందు సాయిబాబా దర్శనము శుభములను కలుగ చేయును.
మే : ఈనెల స్త్రీలతో అనేక పూజలు చేయుట మంచిది. దూరపు దేవుళ్ళు దర్శనములు ముఖ్యము శుక్రవారములందు లక్ష్మి. పూజలు చేస్తే దారిద్య్ర బాధలు తొలగును. కుటుంబానికి కొన్ని మానసిక సంక్షోభములు, ఇబ్బందులు రావచ్చును. శుక్రవారములందు ఉసిరి చెట్టున అలంకరించి విష్ణు పూజలు చేసిన ప్రయాణములు శుభంగా, ధనలాభముగా ఉండును.
జూన్ : ఈనెల ఉద్యోగములందు స్థానచలన యోగములు, చివాట్ల యోగములు దాపరించును. వృత్తియందు చిటికి మాటికి ఇబ్బందులు ధనరూపంగా రావచ్చును. ఆరోగ్యము వేధింపు చర్యగా వుంటుంది. వ్యాపారాల్లో వర్కర్లు లేక ఇబ్బందులు పడగలరు. రాజకీయ నింద బాధలు అంతకు అన్ని వృత్తుల వాళ్ళకు వచ్చును. చెన్నకేశవస్వామిని దర్శించింది. ఋణ శాంతించి, వ్యాపార వృద్ధి కలుగును.
జూలై : ఈనెల వృత్తి, వ్యాపారాలో ఆశాజనకంగా ధనార్జన, పెద్దల సూచనలు వ్యాపారంలో కలసి వస్తాయి. వృత్తియందు మిత్రత్వముతో కలిసి వస్తాయి. రాజకీయములు నిందలుగా మారును. ధార్మిక చర్యలు జరుగుతాయి. వివాహ ప్రయత్నములు చేస్తే కష్టతరముగా నెరవేరును, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయులకు అనుకున్న పనులు రాణించి ధనాదాయము. సోమవారములందు ఈశ్వరుని పంచామృత అభిషేకములు, పూజలు చేసిన బిడ్డలకు విద్యా విజయములు, ఉద్యోగ ప్రాప్తి.
ఆగస్టు : ఈనెల శుభాశుభ మిశ్రమముగా ఉండును. గృహములో చేదు అనుభవాలు కలుగును. ప్రయాణ ఇబ్బందులు కలుగును. ధార్మిక చింతన అవసరము. దైవ పూజలు అతిగా చేయండి. మాసాంతము నందు కోరు వ్యవహారములు రాణించగలవు. ఆదివారములందు పానకాల నరసింహస్వామి పుణ్య క్షేత్రమును దర్శించి, స్వామివారికి పానకం సమర్పించిన కుటుంబ సమస్యలు తీరి కోరికలు నేరవేరును.
సెప్టెంబర్ : ఈ నెల చెప్పుకోదగ్గ మార్పులు లేవు. వ్యాపారము సాఫీగా సాగును. రాజకీయ, ఉద్యోగ, ప్రయాణము అనుకూలము. వృత్తియందు ధనాదాయము. పుట్టను దర్శించి, పాలు, పండ్లు నివేదన చేసిన శుభములు కలుగును.
అక్టోబర్ : ఈ నెల గ్రహస్థితిచే ద్రవ్య లాభము, కుటుంబ సౌఖ్యము తగ్గును. దూరప్రయాణములు, దాంభిక మాటలు మాసాంతములో వద్దు. వ్యాపారములు మాసమధ్యమములో ఉత్తెజముగా నుండును. ఉద్యోగులు మసరంభంలో శ్రమాధిక్యయోగము వచ్చును. ఆర్థిక వ్యవహారములలో, ప్రయాణములలో తగు జాగ్రత్త అవసరము. బుధవారములందు బుధునికి పూజ చేయుటచే వ్యాపారవృద్ధి కలుగును. దారిద్య్ర దోషములు తొలగును.
నవంబర్ : ఈ నెల వృత్తి వ్యవహారాలలో ఇబ్బందులు తొలగును. పూర్వ ఋణములు కొన్ని తీర్చగలరు. స్త్రీలకు తగిన గుర్తింపు వచ్చును. విద్యార్థులు కొంత బాధ, పొందగలరు. ఉద్యోగ, వ్యాపార, వృత్తి వారులకు ఆదాయమున్నను నిందారోపణములు కలుగును. శుక్రవారములందు తులసి పత్రములతో విష్ణుమూర్తి సుదర్శన చక్ర పూజలు చేసిన మానసిక బాధలు తొలగి ధనదాయము కలుగును.
డిసెంబర్ : ఈ నెల శారీరక బలహీనతలు రావచ్చును. స్త్రీలకు ఆలసట, బంధు వైరములు రావచ్చును. వృధా కాలయాపన, మాట పట్టింపులు పెరుగుతాయి. మాసాంతములో రావల్సిన బాకీలు వస్తాయి. ఆభరణములు కొనుగోలు, వస్త్రాది భోగములు, కుటుంబ ఆనందము కలుగును. ఆరోగ్యము మిశ్రమము. బుధవారములందు బుధగ్రహ పూజలు చేసిన ఇతి బాధలు తొలగును.
జనవరి : ఈ నెల నూతన ప్రయత్నములు ఫలించును, వాహన యోగము, వివాహ ఉద్యోగ ప్రయత్నములు రాణించును. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరము. మీరు అనుకున్న పనులు కార్యసిద్దిని పొందుతాయి. గురువారాలందు గురుగ్రహ పూజలు, ప్రసాద వితరణచే రాజయోగం, ధనవృద్ధి కలుగును.
ఫిబ్రవరి : ఈ నెల సమయస్ఫూర్తితో కార్యాలు నడుపుతారు. కొన్ని కష్టములు వచ్చినా ధైర్యంతో ముందుకు సాగుతారు. ఆత్మీయుల ఆనందాన్ని అనుభవించేదరు. కొని ఆటంకములు వస్తాయి. ధనదాయము వద్ద జాగ్రతలు అవసరము. మంగళవారములందు రాహు, కేతు పూజలు దానములు చేయుట వలన కార్యాలను సాధించెదరు.
మార్చి : ఈ నెల మిశ్రమాదాయము, స్త్రీల సమస్యలు, ఆరోగ్యభంగము, ధార్మికత లోపించును. గ్రహస్థితి మిశ్రమము, సామాన్య ధనప్రాప్తి కలుగును. దూర ప్రయాణములు, ధనము సకాలంలో అందును. దైవపూజలు చేయుట శుభము. గురువారములందు గురుగ్రహ పూజలు దానములు చేసిన దోషములు, ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి కలుగును.